BigTV English

Bigg Boss 8 Day 19 Promo: కఠిన నిర్ణయం తీసుకున్న బిగ్ బాస్..సైలెంట్ అయిన కంటెస్టెంట్స్ ..!

Bigg Boss 8 Day 19 Promo: కఠిన నిర్ణయం తీసుకున్న బిగ్ బాస్..సైలెంట్ అయిన కంటెస్టెంట్స్ ..!

Bigg Boss 8 Day 19 Promo.. బిగ్ బాస్ (Bigg Boss) 19వ రోజుకు సంబంధించి తాజాగా ప్రోమో ని విడుదల చేశారు మేకర్స్. అయితే తాజా ప్రోమో చూస్తుంటే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ పై ఫైర్ అవుతూ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎవరైనా బిగ్ బాస్ కంటే ఎక్కువ అని ఆలోచిస్తే ఇప్పుడే హౌస్ నుంచి వెళ్ళిపోవచ్చు అంటూ డోర్స్ తెరిచేసి అందరిని ఆశ్చర్యపరిచారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.


పనికిమాలిన గేమ్ అంటూ నోరు జారిన అభయ్..

ఎగ్ కలెక్టింగ్ టాస్క్ లో ఒకరికొకరు విజృంభించుకొని అసలు మనుషుల్లా ప్రవర్తించలేదు అనే కామెంట్స్ ఆడియన్స్ నుంచి వినిపిస్తున్నాయి. ఎగ్ కలెక్టింగ్ టాస్క్ పూర్తయిన తర్వాత ఒకరికొకరు కంటెస్టెంట్స్ మధ్య జరిగిన తప్పులను గుర్తు చేసుకుంటూ ఒకరికొకరు ఎమోషనల్ అయిపోయారు. ఆ తర్వాత పృథ్వీ గేమ్ లో భాగంగా మణికంఠ ను నేరుగా కొట్టడానికి వెళ్లినట్టు చూపించారు. ఒకరికొకరు కొట్టుకునేంత పనిచేశారు. అయితే ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకున్న అభయ్ మాట్లాడుతూ.. జనానికి బుద్ధి లేదు.. ఒకడికే ఒక రూల్ ఇచ్చి ఇంకొకడికి రూలేదని ఇదెక్కడి పనికిమాలిన గేమో నాకర్థం కావట్లేదు అంటూ బిగ్ బాస్ ను తక్కువ చేసి మాట్లాడారు.


ఆ తరువాత మణికంఠ – నిఖిల్ మద్య సంభాషణలో నిఖిల్ గేమ్ లో జరిగిన విషయం గురించి మాట్లాడుతూ.. సర్ది చెప్పే ప్రయత్నం చేయగా.. మణికంఠ మాత్రం ఓవర్ రియాక్ట్ అవుతూ ఎమోషనల్ అయిపోయాడు. నీకు ఒక ఫ్రెండ్ గా నేను మాట్లాడుతున్నాను. వింటే విను లేకపోతే లేదు అంటూ మాట్లాడాడు మణికంఠ. నేను నిన్ను బెస్ట్ ఫ్రెండ్ గా అనుకున్నాను. కానీ నిన్న గేమ్ లో నువ్వు చూపించిన తీరును నేను తీసుకోలేక పోతున్నాను. నువ్వెలా బిహేవ్ చేస్తున్నావో నీకు తెలుస్తుందా అంటూ ఎమోషనల్ అయిపోయి, కన్నీళ్లు పెట్టుకొని ఆ తర్వాత నిఖిల్ ను హగ్ చేసుకున్నాడు మణికంఠ.

కంటెస్టెంట్స్ కి షాప్ ఇచ్చిన బిగ్ బాస్..

Bigg Boss 8 Day 19 Promo: Bigg Boss took a tough decision..Silent contestants..!
Bigg Boss 8 Day 19 Promo: Bigg Boss took a tough decision..Silent contestants..!

ఇక తర్వాత హౌస్ మేట్స్ అందర్నీ ఒక చోటుకు పిలిపించిన బిగ్ బాస్ మాట్లాడుతూ.. ఈ సీజన్లో క్లాన్స్ అనేవి అతి ముఖ్యమైన భాగాలు. ఇది బిగ్ బాస్ ఇల్లు. ఇక్కడ కేవలం బిగ్ బాస్ రూల్స్ మాత్రమే చెల్లుబాటు అవుతాయి. మీలో ఎవరైనా బిగ్ బాస్ కంటే ఎక్కువ అని భావిస్తే ఇప్పుడే వెళ్లిపోవచ్చు అంటూ డోర్స్ ఓపెన్ చేశారు బిగ్ బాస్. దీంతో కంటెస్టెంట్స్ అందరూ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయి తలలు దించుకున్నారు. మొత్తానికైతే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ వాగుడికి అడ్డుకట్ట వేశారు అని నెటిజెన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా బిగ్ బాస్ రూల్స్ ప్రకారం గేమ్ ఆడాల్సిందే అందుకే ప్రైజ్ మనీ ఇస్తున్నారు అంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు. మరి కంటెస్టెంట్స్ ఆట తీరు మాట తీరు మార్చుకుంటారేమో చూడాలి.

Related News

Bigg Boss 9: బిగ్ బాస్ ఎంట్రీ.. కంటెస్టెంట్స్ ని ఆటాడుకున్న బాస్, ఇదేవరూ ఊహించలేదు భయ్యా!

Bigg Boss 9 Promo: ఇట్స్ ఎమోషన్స్ టైం.. దుఃఖంలో కూడా త్యాగం చేసిన ఇమ్ము!

Bigg Boss 9 Promo: హౌస్ లో మరో కొత్త లవ్ ట్రాక్.. ఒక్కొక్కరు ఇద్దరేసి!

Bigg Boss 9: గౌతమి ఎఫెక్ట్.. రీతూపై భారీ వేటు పడనుందా?

Bigg Boss 9 Telugu: రీతూకి డిమోన్ వెన్నుపోటు.. ల*త్కో*ర్ పనులంటూ.. శ్రీజ సేవ్, నామినేషన్ లో ఉన్నదేవరంటే..

Divvela Madhuri: నా రాజాను వదిలి ఉండలేను.. కానీ, వైల్డ్ కార్డ్ ఎంట్రీ పై మాధురి క్లారిటీ!

Bigg Boss 9 wildcard : వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ వీళ్లే.. ఇక హౌస్‌లో రచ్చ రచ్చే!

Bigg Boss 9 Promo: నామినేషన్స్‌లో రచ్చ రచ్చ.. కోడిగుడ్డుపై ఈకలు పీకుతా.. శ్రీజపై మాస్క్ మ్యాన్ ఫైర్

Big Stories

×