BigTV English
Advertisement

Rashmika Mandanna: ‘పుష్ప 2’లో ర‌ష్మిక పాత్ర‌పై రూమ‌ర్స్‌.. ఫ్యాన్స్ టెన్ష‌న్‌

Rashmika Mandanna: ‘పుష్ప 2’లో ర‌ష్మిక పాత్ర‌పై రూమ‌ర్స్‌.. ఫ్యాన్స్ టెన్ష‌న్‌
Rashmika Mandanna

ఇప్పుడంటే రష్మిక మంద‌న్న తెలుగు, త‌మిళంతో పాటు బాలీవుడ్‌లోనూ సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. అయితే ఆమెకు పాన్ ఇండియా రేంజ్‌లో మంచి గుర్తింపు తీసుకొచ్చింది మాత్రం ‘పుష్ప ది రైజ్‌’ అనే చెప్పాలి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెర‌కెక్కించిన పుష్ప ది రైజ్ సినిమాలో ర‌ష్మిక మంద‌న్న శ్రీవ‌ల్లి పాత్ర‌లో న‌టించింది.


చిత్తూరు జిల్లాకు చెందిన అమ్మాయి పాత్ర‌లో ర‌ష్మిక మంద‌న్న న‌ట‌న, ఆమె చేసిన డాన్సులు ఆడియెన్స్‌ను అల‌రించాయి. దీనికి తోడు పుష్ప ది రైజ్ మూవీ పాన్ ఇండియా రేంజ్‌లో బ్లాక్ బ‌స్ట‌ర్ అయ్యింది. రూ.300 కోట్ల వ‌సూళ్ల‌ను సాధించింది. అందులో హిందీ నుంచే రూ.100 కోట్ల‌కు పైగా రావ‌టం హాట్ టాపిక్‌గా మారింది.

ఇప్పుడు అంద‌రి దృష్టి ‘పుష్ప 2’పై ఉంది. అల్లు అర్జున్‌, సుకుమార్ ఈ ఎక్స్‌పెక్టేషన్స్‌కు త‌గ్గ‌ట్టే పాత్ర‌ల‌ను మ‌రింత బ‌లంగా మ‌లిచారు. ఆల‌స్యం అయిన‌ప్ప‌టికీ ఇప్పుడే సెట్స్‌పై కివెళ్లారు. తాజాగా ఈ సినిమాలో ర‌ష్మిక పాత్ర ఎలా ఉండ‌బోతుంద‌నే దానిపై అంద‌రిలోనూ ఆస‌క్తి నెల‌కొంది. కాగా.. సినీ సర్కిల్స్‌లో వినిపిస్తోన్న స‌మాచారం మేర‌కు ‘పుష్ప 2’లో ర‌ష్మిక పాత్ర వ్య‌వ‌ధి పెద్ద‌గా క‌నిపించ‌ద‌ట‌.


హీరో స‌హా మిగిలిన పాత్ర‌ల‌కు ఎలివేషన్ ఇస్తూ క‌థను న‌డిపించాలి కాబ‌ట్టి సుకుమార్ ర‌ష్మిక పాత్ర‌ను వీలైనంతగా కుదించేశాడ‌ని అంటున్నారు. మ‌రి నెట్టింట వైర‌ల్ అవుతున్న ఈ వార్త‌ల‌పై ర‌ష్మిక ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

పుష్ప సినిమా శేషాచ‌ల అడ‌వుల్లో జ‌రిగే ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతుంది. ఫ‌స్ట్ పార్ట్‌గా వ‌చ్చిన పుష్ప ది రైజ్ చిత్రంలో కూలీగా స్టార్ట్ అయిన హీరో .. సిండికేట్ అధినేత‌గా ఎలా ఎదిగాడ‌నేదే క‌థాంశం. ఇక ‘పుష్ప 2’లో దీన్ని సుకుమార్ ఎలా ర‌క్తి క‌ట్టించాడు.

త‌న‌కు అడ్డుగా నిలిచిన ఫ‌హాద్ పాజిల్‌, సునీల్, అన‌సూయ వంటి వారిని ఎలా త‌ప్పించాడ‌నేది సినిమాలో చూడాల్సిందే. వ‌చ్చే ఏడాది సంక్రాంతికి ‘పుష్ప 2’ను విడుద‌ల చేయాల‌ని మేక‌ర్స్ అనుకుంటున్న‌ట్లు టాక్ వినిపిస్తోంది.

Tags

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×