BigTV English

Trivikram: మహేష్ ఫ్యాన్స్‌ని భ‌య‌పెడుతున్న త్రివిక్ర‌మ్‌.. రెండు ప‌డ‌వ‌ల ప్ర‌యాణం

Trivikram: మహేష్ ఫ్యాన్స్‌ని భ‌య‌పెడుతున్న త్రివిక్ర‌మ్‌.. రెండు ప‌డ‌వ‌ల ప్ర‌యాణం

త్రివిక్ర‌మ్ చేస్తున్న ప‌నిని చూసి సూప‌ర్ స్టార్ మ‌హేష్ ఫ్యాన్స్‌లో తెలియ‌ని కంగారు మొద‌లైంద‌ని మీడియా వ‌ర్గాల్లో వినిపిస్తోన్న టాక్‌. అస‌లు త్రివిక్ర‌మ్‌ను చూసి మ‌హేష్ ఫ్యాన్స్‌కి ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ఉన్న లింకేంటో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. మ‌హేష్ SSMB 28కు త్రివిక్ర‌మే ద‌ర్శ‌కుడు. ఇది వ‌ర‌కు వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన అత‌డు, ఖ‌లేజా చిత్రాలు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఆశించిన స్థాయిలో స‌క్సెస్ సాధించ‌లేదు. దీంతో ఎలాగైనా ఈసారి హిట్ కొట్టాల‌ని మ‌హేష్‌, త్రివిక్ర‌మే కాదు.. ఫ్యాన్స్ కూడా ఆతృత‌గా ఎదురు చూస్తున్నారు. ఈ త‌రుణంలో త్రివిక్ర‌మ్ చేస్తున్న మరో ప‌ని సూప‌ర్ స్టార్ అభిమానులకు న‌చ్చ‌టం లేదు. ఇంత‌కీ త్రివిక్ర‌మ్ అంత‌లా ఏం చేస్తున్నాడో తెలుసా! ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమాకు రైట‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నార‌ట‌.


వివ‌రాల్లోకి వెళితే.. త‌మిళ చిత్రం వినోద సిత్తంను తెలుగులో రీమేక్ చేయ‌బోతున్నారు దీనికి స‌ముద్ర ఖని ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌బోతున్నారు. అయితే తెలుగు నెటివిటీకి త‌గ్గ‌ట్టు క‌థ‌లో చాలా మార్పులు చేర్పులు చేస్తున్నార‌ట‌. అందుకోసం ప‌వ‌న్ క‌ళ్యాణ్ రిక్వెస్ట్ మేర‌కు త్రివిక్ర‌మ్ రైటింగ్ ప‌రంగా బాధ్య‌త‌ల‌ను తీసుకున్నార‌ని టాక్‌. అయితే ప‌వ‌న్ క‌ళ్యాణ్ మీద ఫోక‌స్‌తో త్రివిక్ర‌మ్ ఎక్క‌డ మ‌హేష్ సినిమాను స‌రిగ్గా చేయ‌డోన‌ని ఫ్యాన్స్ భ‌య‌ప‌డుతున్నారు.

వినోద‌య సిత్తం చిత్రం తెలుగు రీమేక్‌ను పీపుల్ మీడియా నిర్మించ‌నుంది. ఇందులో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, సాయిధ‌ర‌మ్ తేజ్ క‌లిసి న‌టించ‌బోతున్నారు. అయితే ఇప్ప‌టికే ప‌వ‌న్ క‌ళ్యాణ్ సుజిత్ సినిమాను, హ‌రీష్ శంక‌ర్ సినిమాల‌ను చేస్తున్నారు. మ‌రిక వినోద‌య సిత్తం సినిమాను ఎప్పుడు చేస్తార‌నేది అంద‌రికీ మిలియ‌న్ డాల‌ర్స్ ప్ర‌శ్న‌గా మారింది.


Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×