Samantha – Naga Chaitanya: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎన్నో జంటలు ఉన్నా అందులో కొన్ని జంటలు మాత్రమే ప్రేక్షకులకు ప్రత్యేకం. అలాంటి ప్రత్యేకమైన జంటలలో సమంత (Samantha ) – నాగచైతన్య (Naga Chaitanya)జంట కూడా ఒకటి. ఈ జంట చూడముచ్చటగా అనిపించడమే కాదు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ కూడా కలిగి ఉంది. ఆన్ స్క్రీన్ రొమాన్స్ పండించి, అభిమానుల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయిన ఈ జంట, నిజజీవితంలో కూడా ఒక్కటి అయ్యి, అందరినీ సంతోషపరిచారు. ‘ఏ మాయ చేసావే’ సినిమా సమంతకు తొలి తెలుగు చిత్రం అయినా తన నటనతో తెలుగు ఆడియన్స్ హృదయాలను దోచుకుంది. అదే సినిమాలో హీరోగా నటించిన అక్కినేని వారసుడు నాగచైతన్యతో పరిచయం పెంచుకుంది.
టాలీవుడ్ లో లవ్లీ కపుల్ గా గుర్తింపు..
పరిచయం కాస్త స్నేహంగా మారి, చివరకు ప్రేమగా మారింది. ఇక రానా దగ్గుబాటి (Rana Daggubati) సహాయంతో కుటుంబ పెద్దలను ఒప్పించి ఒక్కటి అయ్యారు ఈ లవ్లీ కపుల్. వివాహమనంతరం వీరు తీసిన ‘మజిలీ’ మరో స్థాయికి చేరుకుంది. జంట అంటే ఇలా ఉండాలి అని అందరూ అనుకున్నారు. అయితే ఏమైందో తెలియదు కానీ అనూహ్యంగా ఈ జంట విడాకులు ప్రకటించి అందరిని ఆశ్చర్యపరిచింది. అభిమానులే కాదు ఇటు సినీ ప్రేమికులు, అటు సెలబ్రిటీలు సైతం ఆశ్చర్యపోయారు. అంతేకాదు వీరిద్దరిని కలపడానికి చాలామంది సెలబ్రిటీలు ప్రయత్నాలు చేశారు. కానీ ఈ జంట మళ్లీ కలవడానికి ఆసక్తి చూపించలేదు.
విడాకులు తీసుకొని ఆశ్చర్యపరిచిన సామ్ – చైతూ..
సమంత నుంచి విడిపోయిన తర్వాత నాగచైతన్య కెరియర్ పై ఫోకస్ పెట్టడమే కాకుండా వ్యక్తిగతంగా కూడా ఒక అడుగు ముందుకేసాడు. 2021 లో విడాకులు తీసుకున్న ఈ జంట.. 2022లో నాగచైతన్య శోభితా ధూళిపాళ (Shobhita dhulipala) ప్రేమలో పడిపోయారు. మరొకవైపు సమంత – నాగచైతన్య నుంచి విడిపోయిన తర్వాత ఎన్నో రూమర్స్, విమర్శలు ఎదుర్కొంది. దీనికి తోడు మయోసైటిస్ అనే వ్యాధి బారిన పడింది. ఈ బాధ నుంచి తేరుకోవడానికి సద్గురు ను ఆశ్రయించిన ఈమె. హిందూ మతాన్ని స్వీకరించి అటు వెకేషన్స్ కి వెళ్తూ.. ఈ బాధ నుంచి బయటపడే ప్రయత్నం చేసింది. ఇక ఇప్పుడిప్పుడే మళ్లీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి సక్సెస్ దిశగా అడుగులు వేస్తోంది.
విడాకులకు కారణం అదేనా..?
సినీ ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరు తెచ్చుకొని,సడన్గా విడాకులు తీసుకున్న ఈ జంట విడిపోవడానికి గల కారణాలు మాత్రం ఇప్పటివరకు బయటకు రాలేదు. దాదాపు వీరు విడిపోయి మూడు సంవత్సరాలకు పైగానే అవుతున్నా “ఎందుకు విడిపోయారు?” అనే ప్రశ్న అందరిలో మెదులుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఇప్పుడు మరొక వార్త తెరపైకి వచ్చింది. అదేంటంటే.. నాగచైతన్య చాలా సైలెంట్ అన్న విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఏదైనా ఒక విషయం పై బాధ కలిగితే, అది ఇతరులకు చెప్పకుండా తనలోనే పెట్టుకుంటారట. అంతేకాదు ఈ విషయంపై సమంత నాగచైతన్యను ఎన్నోసార్లు మార్చాలనుకుంది. ఏదైనా సమస్య వస్తే నలుగురితో పంచుకున్నప్పుడే సమస్య తీరిపోతుందని నాగచైతన్యకు చెప్పిందట. అంతేకాదు ఈ అలవాటు మానుకోవాలని సలహా కూడా ఇచ్చిందట. అయినా సరే నాగచైతన్య మాత్రం తన అలవాటును మార్చుకోలేకపోయారట. ఇక చిన్నప్పటి నుంచి వచ్చిన అలవాటు సడన్ గా ఎలా మార్చుకోవాలి..? అని భార్యతో గొడవపడ్డారట. నాగచైతన్యను ఎంతో మార్చాలి అనుకున్న సమంత, చివరికి విసిగిపోయి విడాకులు తీసుకుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో వీరిద్దరి విడాకుల విషయంపై ఇలాంటి చర్చ జరుగుతోంది. కానీ, ఇందులో ఎంత వరకు నిజముందో తెలీదు.