BigTV English

Tamil Movies : కంగువ… వీళ్లకు ఓ గుణపాఠం

Tamil Movies : కంగువ… వీళ్లకు ఓ గుణపాఠం

Tamil Movies : తమిళనాట ఇప్పుడు కంగువ ఫీవర్ నడుస్తుంది. కంగువ రిలీజ్ అయ్యే వరకు కంగువ మానియాతో ఈ ఫీవర్ ఉంటే… ఇప్పుడు సినిమా చూసిన తర్వాత వస్తున్న రెస్పాన్స్ చూసిన తర్వాత వేరే ఫీవర్ వస్తుంది. ఇంత నెగిటివ్ టాక్ వస్తున్న కంగువ మూవీ అరవం వాళ్లకు ఎలాగు నచ్చుతుంది. కానీ, వాళ్లు అనుకున్న 1000 కోట్లు రావాలంటే… కేవలం తమిళియన్స్‌కు నచ్చితే సరిపోదు కదా… పాన్ ఇండియా (Pan India) ఆడియన్స్‌కు కనెక్ట్ అవ్వాలి. అదే ఇప్పుడు లోపం అయింది. ఎందుకు..? అరవం వాళ్లకు నచ్చుతున్నాయి. ఇతర ఆడియన్స్ ఎందుకు పెదవి విరుస్తున్నారు..? వీటిపై కచ్చితంగా లోతైన చర్చ జరగాలి. మార్చుకోవాలి.


తమిళులు ఓ కల కంటున్నారు. అదే మరో బాహుబలి. అలా అనుకుని వచ్చినవే పొన్నియన్ సెల్వన్, కంగువ. ఈ రెండు సినిమాలు రిలీజ్ అయ్యే వరకు తమిళుల నోటి నుంచి వచ్చింది ఒకటే మాట…. ఇది కోలీవుడ్ బాహుబలి, బాహుబలి రికార్డులను టచ్ చేసే సినిమా. కానీ, అది జరగలేదు. నిజానికి కంగువ సినిమాకి అందరూ ఫిక్స్ అయ్యారు. మరో బాహుబలి వచ్చేసిందని. మరి ఎక్కడ మైనస్ అయిందో ఇక్కడ చూద్ధాం…

తమిళ సినిమా ఇండస్ట్రీకి బాహుబలిని టచ్ చేసే మూవీ తీసే స్తోమత లేదా అంటే ఉంది. నటీనటులకు సత్తా లేదా అంటే అదీ ఉంది. అలాంటి కథ, కథనాన్ని తీసుకొచ్చే దమ్ము దర్శకుల్లో లేదా అంటే అది కూడా ఉంది. అయినా పని అవ్వడం లేదు. కారణాల్లో ఫస్ట్ సినిమాల్లో తమిళ స్మెల్ ఎక్కువగా ఉండటం. రెండోది… సినిమాలకు టైటిల్స్, క్యారెక్టర్ నేమ్స్ అన్నీ కూడా బయట వారికి ఎక్కువగా అర్థం కాలేని తమిళ భాషలోనే ఉండటం. అలాగే ఎప్పటిలాగే… తమిళ సినిమాల్లో కనిపించే ‘అతి’ ఎక్కువగా ఉండటం. వీటిని మార్చుకుంటే… ఇతర భాషా ఆడియన్స్‌కు కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.


పైన చెప్పిన పాయింట్స్ నిజమేనా అంటే… ఈ రోజు రిలీజ్ అయిన కంగువ సినిమాను పరిశీలిస్తే తెలిసిపోతుంది. ముందుగా టైటిల్… కంగువ అని అనౌన్స్ చేసినప్పుడే విమర్శలు వచ్చాయి. పాన్ ఇండియా సినిమా అంటూ తమిళ పేరు పెట్టారని కామెంట్స్ వచ్చాయి. ముఖ్యంగా తెలుగులో బాయ్ కాట్ కంగువ అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ కూడా అయింది. కంగువ అంటే.. అత్యంత పరాక్రమవంతుడు, అగ్నిలా దేనినైనా దహించే శక్తి కలిగినవాడు అని మీనింగ్ వస్తుంది. ఇంక ఇంగ్లీష్‌లో The Man with the Power of Fire అంటారు. దీన్నే షార్ట్ గా పెట్టేస్తే తమిళ ఆడియన్స్ తో పాటు ఇతర భాషల వాళ్లకు కూడా రిజిస్టర్ అయ్యేది.

ఇక, ‘అతి’ ఇప్పటి వరకు సూర్య ‘అతి’ ఎక్కువ ఉన్న క్యారెక్టర్స్ చేయలేదు. కానీ, ఫస్ట్ టైం కంగువలో సూర్య ‘అతి’ చేయడం కనిపించింది. ఇది సూర్యకు తమిళం కాకుండా ఇతర భాషల్లో ఫ్యాన్స్‌కు పెద్దగా నచ్చలేదు.

ఫైనల్‌గా తమిళ స్మెల్… ఇక్కడ ఒప్పుకోవాల్సింది ఏంటంటే… కంగువలో తమిళ స్మెల్ లేదు. ఎందుకంటే… అక్కడ డైరెక్టర్ శివ. ఈయన గతంలో శౌర్యం, శంకం, దరువు లాంటి సినిమాలు చేశాడు. అందువల్లే ఆ తమిళ ఫ్లేవర్ పెద్దగా రాలేదు. కానీ, పొన్నియన్ సెల్వన్ లాంటి సినిమాల్లో ఈ తమిళ స్మెల్ మనం చాలా చూశాం.

ఈ మార్పులు జరిగితే, తమిళ సినిమాలు కోలీవుడ్‌తో పాటు ఇతర ఇండస్ట్రీలోనూ రాణిస్తాయి. మరి దర్శకులు దీన్ని గమనించి… ఇప్పటి వరకు తీసుకొస్తున్న మూస పద్దతిని పక్కన పెట్టి… ఇతర భాష ఆడియన్స్‌పై కూడా ఫోకసె చేస్తే బెటర్.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×