Khushi Kapoor : బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో దివంగత నటీమణి శ్రీదేవి కూతుళ్లు జాన్వీ కపూర్ (Janhvi Kapoor), ఖుషీ కపూర్ (Khushi kapoor) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ ‘దేవర ‘సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఈ సినిమాకి కొరటాల శివ (Koratala Shiva) దర్శకత్వం వహించగా.. ఎన్టీఆర్ (NTR) హీరోగా నటించారు. మరోవైపు బుచ్చిబాబు సనా (Bucchibabu Sana) దర్శకత్వంలో రామ్ చరణ్ (Ram Charan) హీరోగా నటిస్తున్న సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే నాచురల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న నాని (Nani) ఇప్పుడు శ్రీకాంత్ ఓదలతో చేస్తున్న సినిమాకు కూడా సైన్ చేసినట్లు సమాచారం. ఇదిలా ఉండగా ఈమె సోదరీ ఖుషి కపూర్ కూడా బాలీవుడ్లో పలు సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తూ మంచి పేరు అందుకుంది.
ఎఫైర్ రూమర్స్ నిజం చేసిన ఖుషీ కపూర్..
ఖుషీ కపూర్ ఒకవైపు సినిమాలు, మరొకవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. తల్లికి ఏమాత్రం తగ్గని అందంతో తన ఫోటోలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటుంది. ఇదిలా ఉండగా ఈమె గత కొంతకాలంగా వేదాంగ్ రైనా (Vedang Raina) తో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. అంతే కాదు వీరిద్దరికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. అయితే ఇప్పుడు ఆ రూమర్స్ ని నిజం చేసింది ఖుషీ కపూర్. తన బ్రేస్ లెట్ పై వేదాంగ్ రైనా పేరులోని మొదటి అక్షరం వచ్చేలా డిజైన్ చేయించుకుంది. ఇటీవల ఈమె పుట్టినరోజు సందర్భంగా ఒక బీచ్ లో దిగిన ఫోటోలలో ఈ విషయం కాస్తా బయటపడింది.
బాయ్ ఫ్రెండ్ వేదాంగ్ రైనా తొలి పరిచయం..
తన పుట్టినరోజును బాయ్ ఫ్రెండ్ వేదాంగ్ రైనా సమక్షంలో జరుపుకోగా.. ఆ ఫోటోలు కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇకపోతే వీరిద్దరూ జంటగా ‘ది ఆర్చీస్’ అనే వెబ్ సిరీస్ లో నటించారు. అప్పటినుంచి వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని పుకార్లు రాగా.. వీటిపై ఎవరు స్పందించలేదు. ఇక ఇప్పుడు ఫోటోల ద్వారా క్లారిటీ ఇచ్చింది ఖుషీ కపూర్.
వేదాంగ్ రైనా కెరియర్..
ఇక వేదాంగ్ రైనా విషయానికి వస్తే.. ఇప్పటికే నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈయన తాజాగా ఆలియా నటించిన ‘జిగ్రా’ సినిమాలో కూడా నటించారు. అలాగే బాలీవుడ్ లో సినిమాలు చేస్తూ బిజీగా మారిపోయారు. ఈయన కెరియర్ విషయానికి వస్తే.. 2000 జూన్ 2న న్యూఢిల్లీలోని కాశ్మీరీ పండిట్ కుటుంబంలో జన్మించారు. ముంబై లో తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు. ఆ తరువాత బ్యాచిలర్ డిగ్రీ పట్టా అందుకున్న ఈయన పలు ఈవెంట్స్ లో డాన్స్ చేస్తూ కెరియర్ ప్రారంభించారు. ఈయనకు సంగీతంపై మక్కువ ఎక్కువ. నటన గురించి ఆలోచించక ముందే గిటార్ నేర్చుకున్నారు. చదువు పూర్తయిన తర్వాత మోడలింగ్ రంగంతో పాటు సంగీత రంగంలోకి అడుగు పెట్టాలనుకున్నారు. కానీ నటన రంగంలోకి అడుగుపెట్టారు. అంతేకాదు నాలుగు సినిమాలలో పాటలు కూడా పాడారు. ఇక ఇప్పుడు ఖుషి కపూర్ తో ప్రేమలో పడి వార్తల్లో నిలిచారు.