BigTV English
Advertisement

Rupali Ganguly: పెళ్లి అయిన మగాడితో సంబంధం పెట్టుకుంది.. నటిపై సవతి కూతురు ఫైర్

Rupali Ganguly: పెళ్లి అయిన మగాడితో సంబంధం పెట్టుకుంది.. నటిపై సవతి కూతురు ఫైర్

Rupali Ganguly: ఇండస్ట్రీలో ప్రేమలు, పెళ్లిళ్లు, విడాకులు చాలా కామన్ గా మారిపోయాయి. ప్రేమ ఎప్పుడు పుడుతుందో ఎవరం చెప్పలేం. ఇండస్ట్రీలో చాలామంది పెళ్ళైన  వారిని ప్రేమించి.. పెళ్లి చేసుకొని  వారే తమ జీవితం అని చెప్పుకొస్తున్నారు. అలా జీవితం అని చెప్పిన  కొన్నాళ్లకే విడాకులు తీసుకొని ఇంకొకరితో ఆ మాట చెప్తున్నారు.


అయితే వీరి కోసం అంతకుముందు పెళ్లి చేసుకున్నవారికి విడాకులు ఇచ్చేసి సొంత బిడ్డలను అనాధలుగా మారుస్తున్నారు. ఇప్పుడు  ఇదంతా దేనికి అంటే.. ఒక బుల్లితెర నటి సవతి కూతురు.. ఆమెపై సోషల్ మీడియా వేదికగా ఫైర్ అయ్యింది. తన తండ్రిని  తమ నుంచి దూరం చేసినట్లు  తెలుపుతూ ఎమోషనల్ అయ్యింది. ఇంతకీ ఆ బుల్లితెర నటి ఎవరు.. ? అనేది తెలుసుకుందాం.

Pushpa Re Release: అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు డబుల్ గుడ్ న్యూస్.. ప్లానింగ్ మాత్రం అదుర్స్


బాలీవుడ్ బుల్లితెర నటి రూపాలీ గంగూలీ గురించి తెలుగు ప్రేక్షకుల్లో చాలామందికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సారాభాయ్ వర్సెస్ సారాభాయ్, అనుపమ అనే సీరియల్స్ తో ఎంతో గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో ప్రేమంటే ఇంతే అనే సినిమాలో కూడా ఒక కీలక పాత్రలో నటించింది.

టెలివిజన్  ఇండస్ట్రీలోనే రిచ్చెస్ట్ నటిగా రూపాలీ రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే ఆమె..  2013 లో వ్యాపారవేత్త అయిన అశ్విన్ కె వర్మను వివాహం చేసుకుంది. అప్పటికే అశ్విన్ కు పెళ్లి  అయ్యి ఒక కూతురు కూడా ఉంది. ఆమె పేరే ఇషా. రూపాలీని పెళ్లి చేసుకోవడానికే అశ్విన్.. ఇషా తల్లి  స్వప్నకు విడాకులు ఇచ్చినట్లు తెలుస్తోంది.

Devaki Nandana Vasudeva : క్లైమాక్స్‌‌లో మహేష్ బాబు పాత్ర ఇచ్చే ట్విస్ట్ సినిమాకే హైలైట్..?

ఇక అశ్విన్ కు రూపాలీకి ఒక బాబు కూడా ఉన్నాడు. నిత్యం సోషల్  మీడియాలో ఆమె తన కుటుంబంతో కలిసి  దిగిన ఫోటోలంను షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా రూపాలీ గురించి సవతి కూతురు అయినా ఇషా ఒక వీడియోలో  సంచలన వ్యాఖ్యలు చేసింది. ” నా తండ్రిని ఆమె దూరం చేసింది. నా తల్లికి అన్యాయం చేసింది. పెళ్లి అయిన మగాడితో సంబంధం పెట్టుకొని నా కుటుంబాన్ని విడగొట్టింది. బలవంతంగా నా తండ్రి చేత విడాకుల పత్రాలపై సంతకం చేసేలా చేసింది. రూపాలీ కోసమే మా నాన్న మలేషియా వదిలి ఇండియాకు వెళ్ళిపోయాడు. మరో మగాడే లేనట్లు.. పెళ్లి అయిన మగాడితో సంబంధం పెట్టుకోవడం తప్పు” అంటూ మాట్లాడింది.

TG Viswa Prasad : “మిస్టర్ బచ్చన్” చెత్త నిర్ణయం… రవితేజ మూవీపై నిర్మాత షాకింగ్ కామెంట్స్

ఇక ఈ వీడియో నెట్టింట పెద్ద దుమారాన్నే రేపింది. చాలామంది ఇషాకు సపోర్ట్ చేస్తున్నారు. ఇక ఈ వీడియోపై రూపాలీ కూడా సీరియస్ అయ్యింది. ఇషాపై పరువు నష్టం దావా వేస్తున్నట్లు లీగల్ నోటిసులు పంపిస్తున్నట్లు సమాచారం. దీంతో కంగుతిన్న ఇషా.. కొన్ని గంటల్లోనే ఆ వీడియోను డిలీట్ చేసింది. ప్రస్తుతం ఈ వార్త బాలీవుడ్ ను షేక్ చేస్తోంది. రూపాలీపై నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. నిజంగానే వారికి విడాకులు ఇప్పించిందా.. ? బంగారం లాంటి సంసారంలో నిప్పులు పోసింది అని కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ విషయమై రూపాలీ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×