E-Paper
Advertisement

Sai Dharam Tej: హీరోయిన్ మెహ్రీన్ తో పెళ్లి.. మెగా మేనల్లుడు ఏమన్నాడంటే.. ?

Sai Dharam Tej: హీరోయిన్ మెహ్రీన్ తో పెళ్లి.. మెగా మేనల్లుడు ఏమన్నాడంటే.. ?
Advertisement

Sai Dharam Tej (celebrity news today): మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ మధ్య తేజ్ పేరు సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విషయం తెల్సిందే. ఇక ఇవన్నీ పక్కన పెడితే.. తేజ్ పెళ్లి వార్తలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంటుంది.

అప్పుడెప్పుడో తిక్క బ్యూటీతో ప్రేమాయణం దగ్గర నుంచి.. నిహారిక పెళ్లి అని, ఆ తరువాత స్వాతిని వివాహమాడుతున్నాడని, యాక్సిడెంట్ తరువాత మెగా ఫ్యామిలీ తేజ్ కు వివాహం చేయాలనీ చూస్తోందని.. ఇలా ఒకటి కాదు రెండు కాదు.. ప్రతిసారి తేజ్ పెళ్లి వార్త రావడం, అతను ఖండించడం చూస్తూనే ఉన్నాం.

Advertisement

ఇక గత కొన్నిరోజుల నుంచి హీరోయిన్ మెహ్రీన్ తో తేజ్ పెళ్లి పీటలు ఎక్కుతున్నాడని వార్తలు గుప్పుమన్నాయి. వీరిద్దరూ కలిసి జవాన్ సినిమాలో నటించారు. అప్పటినుంచి వీరి మధ్య ప్రేమాయణం నడుస్తోందని, మధ్యలో మెహ్రీన్ ఎంగేజ్ మెంట్ కావడంతో తేజ్ కు బ్రేకప్ అయ్యిందని, అయితే మెహ్రీన్ ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసుకోవడంతో మళ్లీ వీరి ప్రేమ చిగురించిందని చెప్పుకొస్తున్నారు.

ఇక తాజాగా ఈ పెళ్లి వార్తలపై తేజ్ స్పందించాడు. నిన్న జరిగిన ఉషా పరిణయం ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా విచ్చేసిన తేజ్ కు తన పెళ్లి వార్తలకు సంబందించిన ప్రశ్న ఎదురవ్వగా ఆయన మాట్లాడుతూ.. ” నాకు లవ్ ఉంది.. అది వన్ సైడ్ మాత్రమే. ఒకవేళ ఆ అమ్మాయి నచ్చి వెళ్లి పెళ్లి గురించి మాట్లాడేలోపు.. మీకు ఆల్రెడీ పెళ్లి అయిపోయిందిగా అని అడిగేస్తున్నారు. అదేంటి నాకు పెళ్లా అని నేను షాక్ అయ్యేలోపు.. మీడియాలో చూసాం అని అంటున్నారు” అని చెప్పుకొచ్చాడు.

Advertisement

ఇక మీ ఇంట్లో పెళ్లి జరగనుందని, ఇద్దరు పేర్లు వినిపిస్తున్నాయి. దానికి మీరేమంటారు అన్న ప్రశ్నకు తేజ్ మాట్లాడుతూ.. ” సోలో బ్రతుకే సో బెటర్ సినిమలో నో పెళ్లి ససాంగ్ ఉంది కదా.. అదే పాడుకుంటున్నా’ అంటూ చెప్పుకొచ్చాడు. సో, ఎట్టకేలకు తేజ్ తన పెళ్లి వార్తలో ఎలాంటి నిజం లేదని తేల్చి చెప్పాడు. మరి తేజ్ కు కాబోయే భార్య ఎక్కడ ఉంది.. ? ఎప్పుడు వస్తుంది అనేది తెలియాలంటే ఇంకొన్నిరోజులు ఆగాల్సిందే.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×