BigTV English

Nagababu Latest Tweet: పవన్ కల్యాణ్‌కు షాకింగ్ న్యూస్.. జగన్‌కు సపోర్ట్ చేస్తూ నాగబాబు ట్వీట్?

Nagababu Latest Tweet: పవన్ కల్యాణ్‌కు షాకింగ్ న్యూస్.. జగన్‌కు సపోర్ట్ చేస్తూ నాగబాబు ట్వీట్?

JSP Leader Nagababu Latest Tweet: సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ గత వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తుంటారు జనసేన నేత నాగబాబు. ఇటీవలే ఓ వీడియోను పోస్ట్ చేసి.. జగన్‌పై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మీ హయాంలో ఘటనలు జరిగినప్పుడు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ఏపీలో రాష్ట్రపతి పాలన ఎందుకు అడుగుతున్నావ్..? గతంలో ఎందుకు అడుగలేదంటూ ఆయన నిలదీశారు. కేవలం అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకుండా ఉండేందుకే ఈ నాటకాలంటూ ఆయన జగన్‌పై మండిపడిన విషయం తెలిసిందే. తాజాగా కూడా మరో పోస్ట్ పెట్టారు. అయితే, ఈసారి జగన్‌కు సపోర్ట్ చేస్తూ పోస్ట్ పెట్టారు. జగన్‌కు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. దీంతో నైట్టింట వైరల్‌గా మారింది. ప్రస్తుతం ఏపీలో దీనిపై భారీగా చర్చ నడుస్తోంది. ఇందుకు సంబంధించి ఇతర మీడియా కథనాల ప్రకారం..


Also Read: ఏపీ రాజకీయాల్లో సంచలనం, విజయమ్మతో జేసీ ప్రభాకర్ భేటీ,

‘జగన్‌కు కూటమి ప్రభుత్వం న్యాయం చేయాలంటూ నాగబాబు ట్వీట్‌లో ఇలా పేర్కొన్నారు. జగన్‌కు రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేయాలి. ఎందుకంటే.. 2019లో శ్రీను అనే వ్యక్తి ఆయనపై కోడికత్తితో దాడి చేశాడు. ఐదు సంవత్సరాలు గడుస్తున్నా ఆ కేసు ఇంకా కొలిక్కి రాలేదు. ఆ ఐదేళ్లు జగన్‌కు ఉన్న బిజీ షెడ్యూల్ వల్ల అది కుదర్లేదు. ఇప్పుడు జగన్ ఖాళీగానే ఉన్నారు. అందువల్ల రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఆయనకు న్యాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆయనపై హత్యాయత్నం చేసిన నేరస్థుడికి సరైన శిక్ష విధించాలి కదా!.. అందుకే కేసును వెంటనే విచారించి అమాయకుడైన జగన్‌కు న్యాయం చేయవలసిందిగా నేను కూటమి ప్రభుత్వాన్ని, సీఎం చంద్రబాబును, డిప్యూటీ సీఎం పవన్‌ను, హోం మంత్రి అనితను కోరుతున్నాను’ అంటూ నాగబాబు ఆ ట్వీట్‌లో వ్యంగ్యాస్త్రాలు సంధించారు.


Related News

Roja Hot Comments: శుక్రవారం వస్తే జంప్.. జగన్‌పై రోజా సెటైర్లు?

Digital Book: డిజిటల్ బుక్‌తో వైసీపీ వార్నింగ్.. రెడ్ బుక్ విజృంభించే టైమ్ వచ్చిందా?

Mother Killed Son: కళ్లలో కారం, చీరతో ఉరి.. ఎకరం భూమి కోసం కొడుకును చంపిన తల్లి

Jagan: ప్రతిపక్ష హోదా వల్ల లాభం ఏంటి? ఎమ్మెల్యేలకు ప్రశ్నించే హక్కు ఉండదా? జగన్ లాజిక్ ఏంటి?

Tirumala News: భక్తులకు నేరుగా శ్రీవారి దర్శనం, సాయంత్రం తిరుమలకు సీఎం చంద్రబాబు

Amaravati News: హెచ్ 1 బీ వీసా ఎఫెక్ట్.. ఏపీకి టెక్ కంపెనీ యాక్సెంచర్, విశాఖలో కొత్త క్యాంపస్‌

Nellore News: రెచ్చిపోయిన హిజ్రాలు.. న‌ర్సుపై మూకుమ్మడిగా దాడి, అడిగినంత ఇవ్వలేదని

Rajahmundry News: క్రిమినల్ బత్తుల జాడెక్కడ? జైలులో ప్రభాకర్ ఏమేమి చేసేవాడు?

Big Stories

×