Satya:మెగా మేనల్లుడు సాయి దుర్గ తేజ్ (Sai Durga Tej) హార్ట్ టచింగ్ షార్ట్ ఫిలిం తీసి అందరి ప్రశంసలు అందుకున్నారు. ఆయన నటించిన షార్ట్ ఫిలిం ‘సత్య’. సెకండ్ ఇన్నింగ్స్ లో తీసిన ఈ షార్ట్ ఫిలిం విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకుంది. అయితే ఇప్పుడు ఈ షార్ట్ ఫిలిం..” ఫిలిం ఫేర్ షార్ట్ ఫిలిం అవార్డ్స్ 2024″లో పోటీ పడుతోంది. పీపుల్స్ ఛాయిస్ క్యాటగిరిలో సత్య షార్ట్ ఫిలిం పోటీలో నిలవడం గమనార్హం. ఇక ఈ విషయంపై తాజాగా సాయి దుర్గ తేజ్ సోషల్ మీడియా ద్వారా స్పందించారు.
తన షార్ట్ ఫిలింకి ఓటు వేయండి అంటున్న హీరో..
సాయి దుర్గ తేజ్ సోషల్ మీడియా ఖాతా ద్వారా ఇలా రాసుకొచ్చారు.. ‘సత్య’.. “మా మనసుకు దగ్గరైన షార్ట్ ఫిలిం ఇది. ఈ షార్ట్ ఫిలిం చూసి ఓటు వెయ్యండి” అంటూ కోరారు. ఇకపోతే దిల్ రాజు(Dil Raju)ప్రొడక్షన్స్ తో కలిసి, సాయి తేజ్ సొంత బ్యానర్ అయిన విజయదుర్గా ప్రొడక్షన్స్ సంస్థలో చేసిన తొలి ప్రయత్నంగా సత్య ఎన్నో జ్ఞాపకాలను ఇచ్చిందని ఆయన తెలిపారు. ఇకపోతే ఈ షార్ట్ ఫిలింలో కలర్స్ స్వాతి రెడ్డి హీరోయిన్గా నటించింది. హర్షిత్, హన్షిత నిర్మాతలుగా వ్యవహరించగా.. విజయకృష్ణ వీ.కే.(Vijay Krishna V.K.) దర్శకత్వం వహించారు. ప్రముఖ సీనియర్ నటులు, దివంగత నటులు, రాజకీయవేత్త అయిన కృష్ణ(Krishna )మనవడే ఈయన.. స్పష్టంగా చెప్పాలి అంటే.. కృష్ణ రెండో భార్య విజయనిర్మల(Vijaya Nirmala)మొదటి భర్త సంతానమైన వీకే నరేష్ కొడుకు ఇతను. ఇండస్ట్రీలోకి రావాలని మొదట షార్ట్ ఫిలిం డైరెక్టర్ గా కెరియర్ ఆరంభించి, సత్య షార్ట్ ఫిలిం తీసి భారీ విజయాన్ని అందుకున్నారు. ఇకపోతే మ్యూజికల్ షార్ట్ ఫిలిం గా ప్రేక్షకులకు మంచి అనుభూతిని పంచింది. ఫిలింఫేర్ వెబ్సైట్ ద్వారా ప్రేక్షకులు తమ ఓటు వినియోగించుకోవచ్చు అని కూడా సూచించారు. ఇకపోతే ఫిలింఫేర్ అవార్డ్స్ లో పోటీ పడబోతున్న ఈ షార్ట్ ఫిలిం అవార్డు దక్కించుకోవాలని కూడా ఫ్యాన్స్ కోరుతున్నారు.
సాయి దుర్గా తేజ్ కెరియర్..
ఇక సాయి ధరమ్ తేజ్ విషయానికి వస్తే.. యాక్సిడెంట్ తర్వాత తన పేరులో.. తన తల్లి విజయ దుర్గ (Vijaya Durga) పేరు కలిసి వచ్చేలా సాయి దుర్గ తేజ్ గా మార్చుకున్నారు. 2014లో ‘పిల్లా నువ్వు లేని’ జీవితం సినిమాతో సినీ కెరియర్ ను ప్రారంభించారు. ఈ సినిమాతో ఉత్తమ తొలి నటుడిగా సైమా అవార్డును కూడా అందుకున్నారు. ఈ సినిమా తర్వాత సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, సుప్రీం వంటి చిత్రాలతో హ్యాట్రిక్ అందుకున్నారు. ఇక చిత్రలహరి, ప్రతిరోజు పండగే, సోలో బ్రతుకే సో బెటర్, రిపబ్లిక్ వంటి చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించారు. యాక్సిడెంట్ తర్వాత కొంతకాలం ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఇక మళ్ళీ రీఎంట్రీలో తన మేనమామ పవన్ కళ్యాణ్(Pawan Kalyan)తో బ్రో సినిమా చేసి డిజాస్టర్ చవిచూసిన సాయి దుర్గ తేజ్ ‘విరూపాక్షా’ సినిమా చేసి మంచి విజయాన్ని అందుకున్నారు. ఇక ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు.