Mohammed Shami : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 మెగా వేలంలో.. సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఖాతా తెరిచింది. మొట్టమొదటిగా టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీని ( Mohammed Shami ) కొనుగోలు చేసింది హైదరాబాద్ జట్టు. పోటీపడి మరి కావ్య పాప… మహమ్మద్ షమీని ( Mohammed Shami ) కొనుగోలు చేయడం జరిగింది. ఈ తరుణంలోనే 10 కోట్లు పలికాడు మహమ్మద్ షమీ.
Also Read: Rishabh Pant: లక్నోలోకి రిషబ్ పంత్.. ఏకంగా 27 కోట్లు
Also Read: GUJARAT TITANS: రబడా, బట్లర్ ను దక్కించుకున్న గుజరాత్… ఎవరికి ఎంతంటే?
చివరివరకు సన్రైజర్స్ హైదరాబాద్ అలాగే కేకేఆర్ జట్లు మహమ్మద్ షమీ కోసం పోటీపడ్డాయి. కానీ చివరికి.. 10 కోట్లకు కావ్య పాప కొనుగోలు చేయడం జరిగింది. ఆర్టీఎం కార్డు వాడేందుకు ముందుకు వచ్చిన గుజరాత్…ఆ తర్వాత వెనక్కి తగ్గింది.దీంతో 10 కోట్లకు మహమ్మద్ షమీ ( Mohammed Shami ) .. హైదరాబాద్ జట్టుకు వెళ్ళనున్నారు.
Also Read: Shreyas Iyer: ఐపీఎల్ లో చరిత్రలో అత్యధికం… ఏకంగా 26.75 కోట్లు
వరల్డ్ కప్ తర్వాత వరుసగా.. గాయాల బారిన పడ్డ మహమ్మద్ షమీ… ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. అయితే ఇలాంటి నేపథ్యంలో మహమ్మద్ షమీకి ( Mohammed Shami ) 10 కోట్లు రావడం మంచి పరిణామమే అంటున్నారు క్రీడా విశ్లేషకులు.
Also Read: Arshdeep Singh: అర్షదీప్ ను RTM కార్డుతో దక్కించుకున్న పంజాబ్.. ఏకంగా 18 కోట్లు!
వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్ల పూర్తి జాబితా:
1. మహ్మద్ షమీ ( Mohammed Shami ): రూ 10 కోట్లు
2. హర్షల్ పటేల్ – రూ 8 కోట్లు
3. ఇషాన్ కిషన్ – రూ 11.25 కోట్లు
4. రాహుల్ చాహర్ – రూ 3.2 కోట్లు
5. ఆడమ్ జంపా – రూ 2.4 కోట్లు
6. అథర్వ తైదే – రూ. 30 లక్షలు
7. అభినవ్ మనోహర్ – రూ 3.2 కోట్లు
8. సిమర్‌జీత్ సింగ్ – రూ 1.5 కోట్లు
రిటైన్ చేయబడిన ఆటగాళ్ల పూర్తి జాబితా: హెన్రిచ్ క్లాసెన్, పాట్ కమిన్స్, అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, నితీష్ కుమార్ రెడ్డి రిటైన్ చేయబడిన ఆటగాళ్ల పూర్తి జాబితాలో ఉన్నారు.
Also Read: Kl Rahul: ఢిల్లీ జట్టులోకి కేఎల్ రాహుల్..గతంలో కంటే రూ.3 కోట్లు డౌన్ ?
SRH విడుదలైన ఆటగాళ్ల పూర్తి జాబితా: అబ్దుల్ సమద్, ఐడెన్ మర్క్రమ్, రాహుల్ త్రిపాఠి, గ్లెన్ ఫిలిప్స్, మయాంక్ అగర్వాల్, అన్మోల్‌ప్రీత్ సింగ్, ఉపేంద్ర సింగ్ యాదవ్ మార్కో జాన్సెన్* వాషింగ్టన్ సుందర్ సన్వీర్ సింగ్ వనిందు హసరంగా* ఆకాష్ సింగ్ షాబాజ్ అహమద్ భువనేశ్వర్ కుమార్ ఫజల్‌హక్ ఫరూఖీ* జయ్‌కత్ ఫారూఖీ* ఉమ్రాన్ మాలిక్ మయాంక్ మార్కండే జాతవేద్ సుబ్రమణ్యన్ విజయకాంత్ వియస్కాంత్. SRH విడుదలైన ఆటగాళ్ల పూర్తి జాబితాలో ఉన్నారు.
Also Read: Mohammad Siraj: తెలంగాణ DSP కు గుజరాత్ బంపర్ ఆఫర్.. ఏకంగా 12.25 కోట్లు