BigTV English

Sai Durgha Tej : హర్టింగ్ గా ఉంది… మెగా మేనల్లుడి పోస్ట్ వైరల్

Sai Durgha Tej : హర్టింగ్ గా ఉంది… మెగా మేనల్లుడి పోస్ట్ వైరల్

Sai Durgha Tej : మెగా హీరో సాయి దుర్గా తేజ్ (Sai Durgha Tej) తెగ కష్టపడి పోతున్నాడు. ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి జిమ్ లో ఈ హీరో పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. రీసెంట్ గా ‘సంబరాల ఏటిగట్టు’ మూవీ ఫస్ట్ లుక్ తో ప్రేక్షకులను ఫిదా చేసిన ఈ హీరో, తాజాగా జిమ్ లో తాను ఎంత కష్టపడుతున్నాడో తెలిసేలా ఓ ఫోటోను షేర్ చేశాడు. మరి ఇంత కష్టం ఎందుకు? అంటే… ఇంకెందుకు, ప్రేక్షక దేవుళ్లను అలరించడానికే.


సాయి దుర్గా తేజ్ (Sai Durgha Tej) 2023 లో ‘విరూపాక్ష’ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత ఏడాది పాటు సినిమాలకు గ్యాప్ ఇచ్చాడు ఈ హీరో. అంతలోపే తేజ్ నెక్స్ట్ మూవీపై ఎన్నో రూమర్లు వచ్చాయి. వాటన్నింటిపై స్పందించకుండా డైరెక్ట్ గా ‘సంబరాల ఏటిగట్టు’ సినిమా అప్డేట్ తో సమాధానం చెప్పాడు.

సాయి దుర్గా తేజ్ కెరీర్లో 18వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ ‘సంబరాల ఏటిగట్టు’ (SYG) మూవీకి రోహిత్ కె.పి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ‘హనుమాన్’ నిర్మాతలు నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా నటిస్తోంది. ‘సంబరాల ఏటిగట్టు’ మూవీని తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో సెప్టెంబర్ 25న రిలీజ్ చేయబోతున్నామని రీసెంట్ గా రిలీజ్ చేసిన గ్లిమ్స్ ద్వారా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.


ఇక అందులో తేజ్ (Sai Durgha Tej) లుక్ అందర్నీ నోరు వెళ్ళబెట్టేలా చేసింది. ఈ సడన్ సర్ప్రైజ్ ట్రాన్స్ఫర్మేషన్ ను చూశాక, మొదటి మూవీతోనే తేజ్ పాన్ ఇండియా లెవెల్ లో హిట్ కొట్టడం ఖాయమని అంటున్నారు మెగా అభిమానులు. అయితే ఆ ట్రాన్స్ఫర్మేషన్ లోకి మారడం అంత ఈజీ ఏం కాదు. జిమ్ లో ఎన్ని గంటలు చెమటోడిస్తే అలాంటి ఫిజిక్ వచ్చిందో ఆలోచించడానికి కష్టంగా ఉంటుంది. ఏదైతేనేం సినిమా కోసం డెడికేషన్, ప్యాషన్ తో అలాంటి ట్రాన్స్ఫర్మేషన్ లోకి మారాడు తేజ్.

ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ హీరో ఎప్పటికప్పుడు తన జిమ్ సెషన్స్ కు సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేస్తూనే ఉన్నాడు. తాజాగా మరో జిమ్ ఫోటోను షేర్ చేశాడు. అందులో తన కోచ్ రాకేష్ ఉదయార్ పక్కనే ఉన్నారు. ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో ఈ ఫోటోను షేర్ చేస్తూ “ఇప్పుడు ఇది హర్టింగ్ గా ఉంది. కానీ ఏదో ఒక రోజు జస్ట్ వామ్ అప్ లా అనిపిస్తుంది” అంటూ ఎంత కఠినమైన జిమ్ సెషన్ లో పాల్గొన్నాడో వెల్లడించారు. ఇక ఆ ఫోటోలు చూసిన తర్వాత మెగా అభిమానులు “అయ్యయ్యో తేజ్ కి ఎంత కష్టం వచ్చి పడిందో పాపం…” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×