Sai Kiran:ప్రముఖ హీరో సాయి కిరణ్(Sai Kiran) ‘నువ్వే కావాలి’ సినిమాలో “అనగనగా ఆకాశం ఉంది” అనే పాటతో భారీ పాపులారిటీ అందుకున్నారు.. ఆ తర్వాత హీరోగా మరి ఎన్నో సినిమాలలో నటించారు. అందులో భాగంగా రావే నా చెలియా, డార్లింగ్ డార్లింగ్, ప్రేమించు, మనసుంటే చాలు, వాడంతే అదో టైపు, పెళ్లి కోసం వంటి పలు చిత్రాలలో నటించి తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని అందుకున్నారు. కానీ అనుకున్నంత స్థాయిలో హీరోగా సక్సెస్ కాలేకపోయారు సాయికిరణ్. దాంతో బుల్లితెర వైపు అడుగులు వేశారు. ఇక్కడ పలు సీరియల్స్ లో నటిస్తూ బుల్లితెర ఆడియన్స్ కి మరింత దగ్గరయ్యారని చెప్పవచ్చు.
సినిమాలే కాదు సీరియల్స్ తో కూడా భారీ గుర్తింపు..
అలా సుడిగుండాలు, మౌనరాగం, కోకిలమ్మ, అభిలాష, గుప్పెడంత మనసు, ఇంటిగుట్టు వంటి సీరియల్స్ లో నటించి ఇటు బుల్లితెర ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరయ్యారు. ఇక ఇటీవల వచ్చిన గుప్పెడంత మనసు సీరియల్ తో ఫ్యామిలీ ఆడియన్స్ కి మరింత దగ్గరయ్యారని చెప్పవచ్చు. సాయికిరణ్ మరోవైపు తమిళ్, కన్నడ సీరియల్స్ లో కూడా అవకాశం అందుకుంటున్నారు. అంతేకాదు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ లైఫ్ ను బిజీగా గడిపేస్తున్నారు. ఈయన వ్యక్తిగత జీవిత విషయానికొస్తే.. ఇటీవలే తన సీరియల్ కో ఆక్టర్ అయిన ప్రముఖ నటి స్రవంతి (Sravanthi)ని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.
లవ్ స్టోరీ రివీల్ చేసిన సాయికిరణ్..
ఈ క్రమంలోనే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయికిరణ్ తన మొదటి లవ్ స్టోరీని గుర్తు చేసుకుని అందరిని ఆశ్చర్యపరిచారు. ఆమె ఎవరో కాదు హీరోయిన్ లయ (Laya). వీరిద్దరూ కలిసి ‘ప్రేమించు’ అనే సినిమాలో నటించినప్పుడు నిజంగానే ఇద్దరు ప్రేమించుకుంటున్నారని, త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని కూడా పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. కానీ ఎప్పుడు కూడా ఆ వార్తలపై ఇద్దరూ స్పందించలేదు. కానీ తాజాగా సాయికిరణ్ తన లవ్ స్టోరీని గుర్తుచేసుకొని లయతో ఉన్న బంధాన్ని బయటపెట్టారు.
జాతకాల వల్లే పెళ్లి ఆగిపోయింది..
సాయి కిరణ్ తన లవ్ స్టోరీ గురించి మాట్లాడుతూ.. నేను లయ కలిసి ప్రేమించు అనే సినిమా చేసాము. అయితే అది సూపర్ హిట్ అయింది. మా ఇద్దరి కెమిస్ట్రీ కూడా బాగుందని ఎంతోమంది మెచ్చుకున్నారు.అందుకే మేమిద్దరం ఒకటైతే బాగుంటుందని, మా ఇంట్లో వాళ్ళు కూడా అనుకున్నారు. అయితే దానికి నేను ఓకే చెప్పాను. కానీ మా జాతకాలు కలవకపోవడం వల్లే మా పెళ్లి.. పీటల వరకు వెళ్లలేదు అంటూ సాయికిరణ్ తెలిపారు. ఇకపోతే తనతో పాటు తన ఇంట్లో వాళ్ళు కూడా జాతకాలను ఎక్కువగా విశ్వసిస్తారని, అందుకే జాతకాలు కలవకపోవడం వల్లే మరో మాట లేకుండా లయతో పెళ్లికి దూరమయ్యాను అంటూ సాయికిరణ్ తెలిపారు. అంతేకాదు తమ మధ్య ప్రేమ అనే విషయం లేదని,జాతకాలు కలిస్తేనే పెళ్లి చేసుకుందామని అనుకున్నామని, అయితే ఇప్పటికీ కూడా తామిద్దరం మంచి స్నేహితులుగానే ఉన్నామని తెలిపారు సాయికిరణ్. ఇక ప్రస్తుతం ఈయన చేసిన కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
ఇకపోతే సాయి కిరణ్ కి గతంలోనే వివాహమై, ఒక కూతురు కూడా ఉంది. కానీ ఇద్దరి మధ్య విభేదాలు రావడంతోనే ఆమె నుండి విడిపోయి ఇటీవల సీరియల్ నటిని వివాహం చేసుకున్నారు.