BigTV English

Sai Pallavi: రామాయణం.. సాయిపల్లవికే ఎందుకు అంత.. ?

Sai Pallavi: రామాయణం.. సాయిపల్లవికే ఎందుకు అంత.. ?

Sai Pallavi: హీరోయిన్లందరి యందు సాయిపల్లవి వేరయా..అని చెప్పుకుంటున్నారు అభిమానులు. అందుకు కారణం .. ఆమె ఎంచుకొనే కథలు. ఫిదా నుంచి మొదలు సాయిపల్లవి చేసిన సినిమాలు అన్ని చాలా యూనిక్ గా ఉంటాయి. హీరోయిన్ పాత్ర మీదనే బేస్ చేసుకొని కథ ఉంటేనే ఆమె ఓకే చెప్తుంది. గార్గి సినిమా తరువాత సాయిపల్లవి తెలుగులో కనిపించింది లేదు. ఇకతండేల్ లో కథకు, తన పాత్రకు ప్రాధాన్యత ఉండడంతో ఆ సినిమాను ఓకే చేసింది. ఈ సినిమా కాకుండా కోలీవుడ్ లో శివ కార్తికేయన్ సరసన ఒక సినిమాలో నటిస్తుంది. ఈ రెండు కాకుండా సాయిపల్లవి బాలీవుడ్ ఎంట్రీ గ్రాండ్ గా ఇవ్వబోతున్న విషయం తెల్సిందే.


బాలీవుడ్ లోనే ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న రామాయణలో సీతగా సాయిపల్లవి ఎంపిక అయ్యింది. రణబీర్ కపూర్ రాముడిగా కనిపిస్తుండగా.. కెజిఎఫ్ స్టార్ యష్ రావణుడిగా కనిపించనున్నాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇక గత కొన్నిరోజులుగా ఈ సినిమా కోసం సాయిపల్లవి రికార్డ్ రెమ్యూనిరేషన్ తీసుకుందని టాక్ నడుస్తోంది. మొదటి నుంచి అమ్మడు.. ఒక్కో సినిమాకు రూ. 2 కోట్లు వసూల్ చేస్తూ వస్తుంది. ఇక రామాయణ కోసం ఏకంగా రూ. 10 నుంచి 12 వరకు రెమ్యూనిరేషన్ దీంతో చేసిందని, మేకర్స్ సైతం దానికి సిద్ధమయ్యారని టాక్.

ఇప్పటివరకు సౌత్ హీరోయిన్స్ లో నయన్ ఒక్కత్తే ఆ రేంజ్ పారితోషికం అందుకున్న నటి. ఇప్పుడు ఆ స్థానాన్ని సాయిపల్లవి భర్తీ చేస్తుందని చెప్పుకొస్తున్నారు. అయితే సాయిపల్లవికే ఎందుకు అంత.. ? చాలామంది హీరోయిన్లు అంతకన్నా తక్కువకే వస్తారు కదా అంటే.. సీత పాత్రలో ఆమెనే మేకర్స్ ఊహించుకున్నారట. ఆమె నటన గురించి ఇక్కడే కాదు అక్కడ కూడా బాగా పాపులర్ కావడంతో వాళ్లు ఎంత డబ్బు ఇచ్చి అయినా సాయిపల్లవినే సీతగా ఎంపిక చేసారని టాక్. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉన్నది అనేది తెలియాల్సి ఉంది.


Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×