E-Paper
Advertisement

Bengaluru Cafe Blast: బాంబ్ బ్లాస్ట్ నిందితుల మాస్టర్ ప్లాన్స్.. ఎలా తప్పించుకు తిరిగారో చూడండి(VIDEO)

Bengaluru Cafe Blast: బాంబ్ బ్లాస్ట్ నిందితుల మాస్టర్ ప్లాన్స్.. ఎలా తప్పించుకు తిరిగారో చూడండి(VIDEO)
Advertisement

Bengaluru Cafe Blast: బెంగుళూరులోని రామేశ్వరం కేఫ్ బాంబ్ బ్లాస్ట్ కేసు నిందితులను ఎన్ఐఏ అధికారులు గురువారం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే వారు ఇన్ని రోజులు ఎన్ఐఏ, పోలీసులు కల్లుగప్పి ఎలా తప్పించుకుని తిరిగారనే విషయాన్ని అధికారులు వెల్లడించారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను కూడా విడుదల చేశారు.

రామేశ్వరం బాంబ్ బ్లాస్ట్ కేసులో నిందుతులైన అబ్దుల్ మతీన్ అహ్మద్ తాహా, ముస్సావిర్ హుస్సేన్ షాజిబ్ లను ఎన్ఐఏ అధికారులు కోల్ కతాలోని ఇక్బాల్ పూర్ ఏరియాలోని డ్రీమ్ గెస్ట్ హౌస్ లో అరెస్ట్ చేశారు. అయితే ఆ నిందితులు ఎన్ఐఏ అధికారు చేతికి చిక్కే వరకు వేర్వేరు రాష్ట్రాల్లో పలు మకాంలు మారుస్తూ తప్పించుకుని తిరిగినట్లు వారు వెల్లడించారు.

Advertisement

ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఎన్ఐఏ అధికారులకు నిందితులకు సంబంధించిన కీలక సీసీటీవీ ఫుటేజ్ లు లభ్యమయ్యాయి. వాటికి సంబంధించిన కొన్ని వీడియోలను ఎన్ఐఏ అధికారులు విడుదల చేశారు. నిందితులు కోల్ కతాలోని డ్రీమ్ గెస్ట్ హౌస్ లో మార్చి 25 నుంచి 28వ తేదీ వరకు మకాం వేసినట్లు వారు గుర్తించారు. అనంతరం నిందితులు అక్కడి నుంచి మిడ్నాపుర్ కు వెళ్లినట్లు తెలిపారు.

నిందితులు వేరే వేరు ఐడీలు, గుర్తింపు కార్డులు ఉపయోగించి పలు ప్రాంతాల్లో తప్పించుకుని తిరిగారని ఎన్ఐఏ అధికారులు తెలిపారు. వీరు ఎక్కడ కూడా ఆన్ లైన్ ద్వారా, ఏటీఎం కార్డుల ద్వారా నగదును బదిలీ చేయలేదని.. ప్రతి దగ్గరా డబ్బులను నేరుగానే అందజేసినట్లు గుర్తించారు. దీనికోసం వీరు ముందుగానే అన్నీ సిద్ధం చేసిన్నారని తెలిపారు.

Advertisement

Also Read: మరో 3 స్లాట్లు రెడీ చేయండి.. మండోలి జైలు నుంచి సుకేశ్ లేఖ

మార్చి 1వ తేదీన రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్ జరగగా.. ఈ కేసును ఎన్ఐఏ మార్చి 3న టేకాప్ చేసింది. దీంతో ఈ కేసును టేకప్ చేసిన నుంచి ఎన్ఐఏ అధికారులు కర్ణాటక, తమిళనాడు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని 18 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. చివరికి వారు పశ్చిమబెంగాల్ రాజధాని కోలకతాకు 180 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ చిన్న పట్టణంలో నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వీరిని కోర్టులో హాజరు పరచగా.. కోర్టు మూడు రోజుల ట్రాన్సిట్ రిమాండ్ విధించింది.

Tags

Related News

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ జాబ్స్.. కనీస వేతనం రూ.50,000.. పూర్తి వివరాలివిగో

ISRO: ఇస్రో ‘నాటీ బాయ్’ ప్రయోగం సక్సెస్.. చైనా-పాక్‌లపై నిఘా నేత్రం, ప్రతీ 10 నిమిషాలకు చుక్కలే

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

బ్యాంక్ ఉద్యోగాల కోసం చూస్తున్నారా? IBPS RRBలో 13,706 పోస్టులు ఖాళీ.. పూర్తి వివరాలవిగో

Big Stories

Advertisement
×