Sai Pallavi:సాంప్రదాయానికి కేరాఫ్ అడ్రస్ గా మారిన సాయి పల్లవి (Sai Pallavi) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. నాచురల్ బ్యూటీగా పేరు దక్కించుకున్న ఈమె.. తన నటనతో, వరుస విజయాలతో లేడీ పవర్ స్టార్ గా పేరు సొంతం చేసుకుంది. ఇక తాజాగా చందు మొండేటి (Chandu Mondeti) దర్శకత్వంలో.. నాగచైతన్య (Naga Chaitanya) సరసన తండేల్ (Thandel) అనే సినిమా చేసింది ఈ ముద్దుగుమ్మ. ఇందులో తన నటనతో మంచి మార్కులే వేయించుకుంది. ఇదిలా ఉండగా సాయి పల్లవి అంటేనే పద్ధతికి బ్రాండ్ అంబాసిడర్ అని అందరూ అనుకుంటూ ఉండే వేళ.. సడన్గా సాయి పల్లవిలో మార్పు వచ్చిందని పలువురు కామెంట్లు చేస్తున్నారు.. అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
శింబు సినిమాలో అవకాశం అందుకున్న సాయి పల్లవి..
సాధారణంగా సాయి పల్లవి పేరు చెప్పగానే అందం, అభినయం, డాన్స్ ముందుగా గుర్తుకొస్తాయి. ఇక అలా తన అద్భుతమైన పర్ఫామెన్స్ తో ప్రేక్షకులను అలరిస్తున్న ఈమె.. తెలుగు, తమిళ్, మలయాళం భాషల్లో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. మొదట ‘ప్రేమమ్’ అనే మలయాళం సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన సాయి పల్లవి.. ‘ఫిదా’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. వరుస విజయాలతో ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు తెచ్చుకున్న సాయి పల్లవి తాజాగా మరో ప్రాజెక్టులో నటించబోతుందని సమాచారం. కోలీవుడ్ స్టార్ హీరో శింబు నటిస్తున్న ఎస్ టి ఆర్ 49 (STR 49) సినిమాలో సాయి పల్లవి ఎంపికైనట్లు తెలుస్తోంది.ఇక ఈ వార్తలు బయటకు రాగానే ప్రతి ఒక్కరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా సాయిపల్లవి అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉండడం గమనార్హం.
అసంతృప్తి వ్యక్తం చేస్తున్న అభిమానులు..
ఇక అసలు విషయంలోకి వెళ్తే.. శింబు (Simbu) హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా వస్తున్న STR 49 చిత్రానికి రాజ్ కుమార్ బాలకృష్ణన్ దర్శకత్వం వహిస్తున్నట్లు సమాచారం. డాన్ పిక్చర్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారట. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభమైనట్లు తెలుస్తోంది.సాధారణంగా శింబు సినిమాలు అంటేనే అలాంటి సన్నివేశాలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాదు గతంలో తనతో పాటు నటించిన హీరోయిన్లతో ఆయన వ్యక్తిగత సంబంధాలు పెట్టుకుంటారనే ప్రచారం కూడా ఎక్కువగా ఉంది దీంతో ఈయన సినిమాలో అవకాశం అందుకోవడంతో సాయి పల్లవి పై అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఇప్పటివరకు గ్లామర్ పాత్రలు చేయడానికి ఆసక్తి చూపని ఈమె ఈ సినిమాకి ఎలా ఒప్పుకుంది అని ప్రశ్నిస్తున్నారు. మరి కొంతమంది సాయి పల్లవి తన పాత్రకు ప్రాధాన్యత ఉంటేనే ఒప్పుకొని ఉంటుంది. శింబు సినిమాలో కూడా పద్ధతిగా కనిపించే హీరోయిన్ సాయి పల్లవి అవుతుందని అంటున్నారు. ఇంకా కొంతమంది శింబు సినిమాలు అంటేనే అలాంటి సన్నివేశాలకు కేరాఫ్ అడ్రస్ అలాంటి సినిమాలో సాయి పల్లవి అంటే నిజంగా ఆమె గ్లామర్ పాత్ర చేయడానికి ఒప్పుకొని ఉంటుంది అంటూ కూడా కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. ఇకపోతే సాయి పల్లవి ఇందులో ఎలాంటి పాత్రలో కనిపించబోతోంది అనేదానిపై అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ సెట్స్ నుంచి కొన్ని ఫోటోలు లీక్ అవ్వడంతో ఈ వార్తలు వైరల్ అవుతున్నాయి. మోత్తానికైతే సాయి పల్లవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి సాయి పల్లవి ఇందులో ఎలాంటి పాత్ర పోషిస్తోంది అనే విషయం తెలియాలి అంటే మేకర్స్ క్లారిటీ ఇచ్చేవరకు ఎదురు చూడాల్సిందే.