Kadiri Doctor Bhumika: వైద్యో నారాయణో హరి అంటుంటారు. ఆ దేవుడు ప్రాణం పోస్తే.. ఆ ప్రాణానికి ఏమైనా జరిగితే కాపాడేది వాళ్లే కదా. అందుకే ఆ దేవుడి తర్వాత దేవుళ్లు డాక్టర్లే. నిత్యం పరితపించే డాక్టర్లు ఎందరో. అలా పరితపించి కష్టపడి చదువుకుని డాక్టర్లగా మారి.. రోగుల ప్రాణాలు కాపాడేందుకు తన వంతు సాయం చేస్తున్న ఓ యువ డాక్టర్. మధ్యలోనే ప్రాణాలు కోల్పోయింది. అయితే తాను బ్రతికున్నప్పుడే కాదు.. చనిపోతూ కూడా నలుగురికి ప్రాణాలు కాపాడి, వారి కుటుంబాల్లో వెలుగులు నింపి అర్హురాలు అయింది.