CM Chandrababu: ఫైళ్ల క్లియరెన్సుపై కార్యదర్శులకు ఆరు నెలల నుంచి ఏడాది వరకు సమయం పడుతోందన్నారు సీఎం చంద్రబాబు. అంత సమయం తీసుకోవడానికి కారణమేంటని ప్రశ్నించారు. ఎందుకు ఫైళ్లు క్లియర్ చేయలేదో మీకు స్పష్టత ఉండాలన్నారు. కార్యదర్శులంతా సమిష్టిగా నిర్ణయాలు తీసుకోవాలన్నారు. సమస్యలను పరిష్కరించినప్పుడే మంచి ఫలితాలు వస్తాయన్నారు. కొంతమందిని ఎత్తి చూపడం కాదన్నారు. వ్యవస్థలు మెరుగుపడాలని సూచన చేశారు.
ప్రస్తుతం వ్యవస్థల్ని బాగు చేయడానికి తగినంత ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పుకొచ్చారు ముఖ్యమంత్రి. ఫైల్స్ సరి చేయడానికి ఎందుకు ఆలస్యం చేస్తున్నారని అన్నారు. ఎక్కడ ఫైళ్లు ఆలస్యమవుతున్నాయో తెలుస్తుందన్నారు. ప్రతీ డిపార్టుమెంట్ టెక్నాలజీని వినియోగించుకోవాలన్నారు. ఈ విషయంలో బాధ్యతంతా ఆఫీసర్లపై ఉందన్నారు.
మంగళవారం ఉదయం సచివాలయంలో మంత్రులు-వివిధ శాఖల కార్యదర్శులతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, బుధవారం నాటికి మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలు అవుతోందన్నారు. ఐదేళ్ల వైసీపీ పరిపాలనను ప్రజలు అంగీకరించలేదన్నారు.
మనపై విశ్వాసం ఉంచి భారీ మద్దతు ఇచ్చారని, ప్రభుత్వం ఏర్పాటు అయినప్పుడు ఏదో ఒక సవాళ్లు ఉంటాయన్నారు. ఈసారి ఇన్ని సవాళ్లు ఎదుర్కోవడం ఇదే తొలిసారన్నారు. ఏడు శ్వేతపత్రాలు విడుదల చేశామని, నిర్వీర్యమైన వ్యవస్థలను గాడిలో పెట్టేందుకే ప్రజలు మనను అధికారం ఇచ్చారని గుర్తు చేశారు.
ALSO READ: మరోసారి వైసీపీ ఆఫీసుకు నోటీసులు.. వివరాలు ఇవ్వాలంటూ ప్రస్తావన
సమర్థ నాయకత్వం ఉంటేనే అభివృద్ధి సాధ్యమన్నారు ముఖ్యమంత్రి. ఈ సందర్భంగా అధికారులకు దిశా నిర్ధేశం చేశారు. గడిచిన ఆరునెలల పాలనలో 12శాతానికి పైగా వృద్ధి రేటు కనిపించిందన్నారు. సర్వాంధ్ర-2047 ద్వారా లక్షాలను నిర్థేశించుకున్నా మన్నారు. 15శాతం వృద్ధి రేటుతో ఆర్థిక వ్యవస్థ సుస్థిరం కావాలన్నారు.
అప్పులు కూడా తీర్చాల్సిన అవసరముందన్నారు సీఎం. వనరులవే.. అధికారులూ వాళ్లే.. కాని వృద్ధిలో వ్యత్యాసం రావాలంటే కావాల్సింది కార్యదక్షత ఉండాలన్నారు. 10 సూత్రాలను అమలు చేయాలని నిర్ణయించుకున్నామని వివరించారు. రాష్ట్రంలో ప్రతీ వ్యక్తికీ భద్రత ఉండాలన్నారు. ఫ్యామిలీని యూనిట్‌గా తీసుకోవాలన్నారు.గ్రామాల్లో వసతులు మెరుగుపడాలన్నారు. రెవిన్యూ ఇంకా పెరగాల్సిన అవసరం ఉందన్నారు.
ఢిల్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధిని వివరించారు ముఖ్యమంత్రి. గుజరాత్ కంటే బెంగాల్‌లో వనరులు ఉన్నాయన్నారు. 97 శాతం వాటర్ ఉందన్నారు. గుజరాత్‌లో నీటి సమస్య ఉందన్నారు. కీలక సమీక్షకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హాజరుకాలేదు. అన్నిశాఖల మంత్రులు హాజరయ్యారు. కొద్దిరోజులుగా జ్వరంతో బాధపడుతున్నారు డిప్యూటీ సీఎం. మొన్న జరిగిన కేబినెట్ సమావేశానికి దూరంగా ఉన్న విషయం తెలిసిందే.
రేపటికి నేను ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి 8 నెలలు అవుతోంది: చంద్రబాబు
ఐదేళ్ల వైసీపీ పరిపాలనను ప్రజలు అంగీకరించలేదు
మనపై విశ్వాసం ఉంచి భారీ మద్దతు ఇచ్చారు
ప్రతిసారీ ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడల్లా ఏదో ఒక సవాలు ఉంటుంది.. కానీ, ఇన్ని సవాళ్లు ఎదుర్కోవడం ఇదే తొలిసారి… pic.twitter.com/xsaygCWbg4
— BIG TV Breaking News (@bigtvtelugu) February 11, 2025