BigTV English

Laggam Movie Review : ‘లగ్గం’ మూవీ రివ్యూ

Laggam Movie Review : ‘లగ్గం’ మూవీ రివ్యూ

చిత్రం : లగ్గం
విడుదల తేదీ : 25 అక్టోబర్ 2024
నటీనటులు : సాయి రోనక్, ప్రజ్ఞా నగ్రా, రాజేంద్ర ప్రసాద్ తదితరులు
డైరెక్టర్ : రమేష్ చెప్పాల
ప్రొడ్యూసర్ : వేణుగోపాల్ రెడ్డి


Laggam Movie Review Rating – 2.75/5

సినిమా హిట్టు, ప్లాపు అనే వాటితో సంబంధం లేకుండా వరుస సినిమాలు రిలీజ్ చేస్తూ ప్రేక్షకుల పై దండయాత్ర చేస్తున్నాడు హీరో సాయి రోనాక్. అప్పుడే ఇతను 15 కి పైగా సినిమాల్లో నటించేశాడు అంటే అతిశయోక్తి అనిపించుకోదు. కానీ అది నిజం. మొన్నటి వారం ‘రివైండ్’ అనే సినిమాని రిలీజ్ చేశాడు. వెంటనే ఈ వారం ‘లగ్గం’ అనే ఇంకో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు. పెద్దగా బజ్ లేకుండా అక్టోబర్ 25 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా.. ప్రేక్షకుల్ని ఆకట్టుకుందో లేదో అనేది ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం రండి…


కథ :
చైతన్య(సాయి రోనాక్) ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్. ఇతనికి రెండు లక్షల జీతం. అయితే అనుకోకుండా ఇతన్ని కలవడానికి హైదరాబాద్ వస్తాడు మేనమామ సదానందం (రాజేంద్ర ప్రసాద్). ఇతని ఫ్లాట్.. లైఫ్ స్టైల్ చూసి అతను కూడా ఫ్లాట్ అయిపోతాడు. ఊరెళ్ళి తన కూతురు మానస (ప్రగ్య నగ్రా) తో చైతన్యని పెళ్లి చేసుకోమని రిక్వెస్ట్ చేస్తాడు. ఇక తన చెల్లెలు సుగుణ (రోహిణి) అంటే చైతన్య తల్లి కూడా ఈ పెళ్ళికి ఒప్పుకుంటుంది. వెంటనే పెళ్లి పనులు మొదలవుతాయి. ఇదిలా ఉంటే.. మరోపక్క ఊర్లో అమ్మాయిల తండ్రులకి సాఫ్ట్ వేర్ సంబంధాలే తేవాలని ఎక్కడలేని ఆశలు రేపుతాడు సదానందం. వ్యవసాయం చేసుకునేవాళ్ళకి పిల్లని ఇస్తే.. సుఖపడదు అనేది అతని ఉద్దేశం. అయితే పెళ్లి దగ్గర పడుతున్న టైంలో చైతన్య జాబ్ పోతుంది. ఈ విషయం సదానందంకి తెలిసి పెళ్లి ఆపేయాలని అనుకుంటాడు. కానీ అతని ప్రమేయం లేకుండానే పెళ్ళి ఆగిపోతుంది? సదానందం కాకుండా ఈ పెళ్లిని ఆపింది ఎవరు? వాళ్లకి చైతన్యతో సంబంధం ఏంటి? ఆ తర్వాత మానస జీవితం ఎలా మారింది? వంటి ప్రశ్నలకి సమాధానమే ఈ ‘లగ్గం’ సినిమా.

విశ్లేషణ :
పెళ్ళి అనే థీమ్ తో గతంలో కొన్ని సినిమాలు వచ్చాయి. అందులో కొన్ని బాగా ఆడాయి. కానీ ఇప్పుడు.. అంటే గత 10 ఏళ్ళ నుండి యువతకి పెళ్లిపై పెద్దగా ఇంట్రెస్ట్ ఉండటం లేదు. అందుకే ‘శ్రీనివాస కళ్యాణం’ సినిమా కూడా పెద్ద డిజాస్టర్ గా మిగిలిపోయింది. మరి దర్శకుడు రమేష్ చెప్పాల ఏ దైర్యంతో ‘లగ్గం’ మొదలుపెట్టాడో అతనికే తెలియాలి. అయితే అతను కొంచెం తెలివి ఉపయోగించాలని చూశాడు. ఇప్పటివరకు పెళ్లి కాన్సెప్ట్ తో వచ్చిన సినిమాలు ఎక్కువగా ఆంధ్ర సైడ్ సంస్కృతి పై ఆధారపడి వచ్చాయి… కాబట్టి తెలంగాణ స్టైల్లో పెళ్లి ఎలా జరుగుతుంది? అనే కాన్సెప్ట్ తో ‘లగ్గం’ చిత్రాన్ని తీర్చిదిద్దాలని అతను అనుకున్నాడు. ‘పల్లెటూర్లలో సాఫ్ట్ వేర్ సంబంధాల కోసం పెద్దవాళ్ళు ఎలా ఉత్సాహం చూపుతున్నారు?’ అనే పాయింట్ ని కూడా టచ్ చేశాడు. అది కూడా బాగానే ఉంది. కానీ ‘అర్దాంతరంగా పెళ్లి మానుకుని.. ఆఫీస్ పనిపై విదేశాలకి వెళ్ళు..లేదంటే జాబ్ మానేసి వెళ్ళిపో’ అంటూ కఠినంగా మాట్లాడే బాస్ లు ఈరోజుల్లో ఉన్నారా? అంటే రిలేట్ అవ్వడం కొంచెం కష్టంగా అనిపిస్తుంది.

సరే జాబ్ మానేసిన హీరో వ్యవసాయం చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాడు? అక్కడ ఇంకాస్త ఎమోషనల్ కనెక్ట్ ఉంటే బాగుండేది. సాఫ్ట్ వేర్ జాబ్..ల వల్ల ఉండే టెన్షన్స్ ని కిరీటీ పాత్ర ద్వారా చూపించడం, తండ్రి చనిపోయినా ఊరికి రాలేని దుస్థితిలో ఉన్నట్టు ప్రెజెంట్ చేయడం వంటి సీన్స్ కూడా రియాలిటీకి కొంచెం దూరంగా అనిపిస్తాయి. మరోపక్క రైతుల గొప్పతనం గురించి ఇంకాస్త బాగా చెప్పే ఆస్కారం ఉన్నా ఆ ఎలిమెంట్ ను దర్శకుడు టచ్ చేయలేదు. అయితే కొన్ని చోట్ల ఎమోషన్స్ వర్కౌట్ అయ్యాయి. మణిశర్మ సంగీతంలో రూపొందిన సాంగ్స్ బాగానే ఉన్నాయి. ముఖ్యంగా ఆఖరి పాట బాగా కనెక్ట్ అవుతుంది. ఆడపిల్లలు పెళ్లయ్యాక పుట్టినిల్లుని వదిలి వెళ్ళడానికి పడే బాధని ఆ పాటలో బాగా వర్ణించారు. నిర్మాణ విలువలు కథకి తగ్గట్టు బాగానే ఉన్నాయి. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ కూడా బాగానే సెట్ అయ్యాయి.

నటీనటుల విషయానికి వస్తే.. రాజేంద్రప్రసాద్, రోహిణి..ల పాత్రలు సినిమాకి పిల్లర్స్ లాంటివి. వాళ్ళు తమ పాత్రల్లో ఒదిగిపోయారు.వారితో తెలంగాణ స్లాంగ్ మాట్లాడించడం కూడా బాగుంది.హీరో సాయి రోనాక్, హీరోయిన్ ప్రగ్య నగ్ర సటిల్డ్ గా బాగానే చేశారు. రఘుబాబు, కృష్ణుడు, సప్తగిరి వంటి వాళ్ల కామెడీ అక్కడక్కడా బాగానే పేలింది. ఎల్.బి.శ్రీరామ్ కి చాలా రోజుల తర్వాత ఓ మంచి పాత్ర దొరికింది. ఆ పాత్రకి అతను పూర్తిగా న్యాయం చేశాడు.

ప్లస్ పాయింట్స్ :

మంచి కాన్సెప్ట్
లాస్ట్ సాంగ్
నటీనటుల పనితీరు
సెకండాఫ్

మైనస్ పాయింట్స్ :

అక్కడక్కడా ల్యాగ్ ఉండటం

మొత్తంగా… ఈ ‘లగ్గం’ మంచి కాన్సెప్ట్ తో రూపొందిన ఓ ఫ్యామిలీ డ్రామా. ఇంటర్వెల్, క్లైమాక్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. ఈ వీకెండ్ కి ఒకసారి ట్రై చేసే సినిమానే..!

Laggam Movie Review Rating – 2.75/5

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×