BigTV English

Unstoppable 4 : బాలయ్య టాక్ షోకి ‘గేమ్ ఛేంజర్’… ఇది మామూలు ప్లాన్ కాదు భయ్యో

Unstoppable 4 : బాలయ్య టాక్ షోకి ‘గేమ్ ఛేంజర్’… ఇది మామూలు ప్లాన్ కాదు భయ్యో

Unstoppable 4 : ‘అన్ స్టాపబుల్ సీజన్ 4’ (Unstoppable 4) స్టార్ట్ కూడా కాకముందే రోజుకో వార్తతో సంచలనం సృష్టిస్తుంది. ఇప్పటికే ఈ సీజన్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు అల్లు అర్జున్ (Allu Arjun), సూర్య (Suriya) తదితరులు పాల్గొనబోతున్నారని వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ షోకి నెక్స్ట్ గెస్ట్ గా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ఎంట్రీ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. మరి ఈ గేమ్ ఛేంజింగ్ ఎపిసోడ్ వచ్చేది ఎప్పుడు? అనే విషయంలోకి వెళ్తే…


అచ్చ తెలుగు ఓటిటి ప్లాట్ఫామ్ ‘ఆహా’ (Aha) ‘అన్ స్టాపబుల్’ షో నాలుగో సీజన్ ను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న ఈ షోపై అప్పుడే అంచనాలు భారీగా పెరిగిపోయాయి. దీపావళి కానుకగా ఈ షో నుంచి మొదటి ఎపిసోడ్ ను రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే దానికి సంబంధించిన ట్రైలర్ ను రిలీజ్ చేయగా మంచి బజ్ క్రియేట్ అయింది. ఈ నేపథ్యంలోనే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో బాలయ్య ఎపిసోడ్ ను రిలీజ్ చేసి ఆసక్తిని పెంచేశారు. అలాగే ఇప్పటికే ఈ షోలో అల్లు అర్జున్, ‘కంగువ’ (Kanguva) స్టార్ సూర్యలతో ఒక్కో ఎపిసోడ్ ను చిత్రీకరించారు. ఇక ఇప్పుడు నెక్స్ట్ ఎపిసోడ్ గ్లోబల్ స్టార్ వంతు అని తెలుస్తోంది. దీంతో ఇది ‘అన్ స్టాపబుల్ 4’కి మరో గేమ్ ఛేంజింగ్ ఎపిసోడ్ అవుతుందని అంటున్నారు.

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘గేమ్ ఛేంజర్’ (Game Changer). దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా, సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్ చేయబోతున్నారు. ఈ మూవీని పాన్ ఇండియా వైడ్ గా తెలుగు, హిందీ, తమిళ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. అయితే సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ సినిమాకు మరింత బజ్ క్రియేట్ చేయడానికి మేకర్స్ అదిరిపోయే ప్లాన్ వేశారు. ముందుగా ఈ దీపావళికి ‘గేమ్ ఛేంజర్’ మూవీ టీజర్ ను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అంతేకాకుండా ప్రమోషన్స్ లో మరింత జోరును పెంచడానికి బాలయ్య ‘అన్ స్టాపబుల్ 4’ (Unstoppable 4) షోకి చెర్రీ హాజరు కాబోతున్నాడు అన్న వార్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. జస్ట్ టాక్ కే ఇలా ఉంటే ఎపిసోడ్ రిలీజ్ అయితే ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదు. ఇక ఈ షోలో చరణ్ తో పాటు కియరా అద్వాని డైరెక్టర్ శంకర్ కూడా పాల్గొనబోతున్నట్టు నడుస్తోంది.


కాగా గత సీజన్లో ప్రభాస్, పవన్ కళ్యాణ్ గెస్ట్ లుగా హాజరైన క్రమంలో చెర్రీ బాలయ్యతో ఫోన్ లో మాట్లాడుతూ బాలయ్య ఆహ్వానిస్తే షోకి తప్పకుండా వస్తానని చెప్పిన విషయం గుర్తుండే ఉంటుంది. అన్నట్టుగానే చెర్రీ ఈ షోకి హాజరవ్వడం మాత్రమే కాదు, సినిమా రిలీజ్ కి ముందు ప్రమోషన్స్ లో భాగంగా బాలయ్య, చెర్రీ ఎపిసోడ్ ని రిలీజ్ చేయబోతున్నారని తెలుస్తోంది.

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×