BigTV English

Devara Glimpse: ‘దేవర’ నుంచి భైర గ్లింప్స్.. గూస్‌బంప్స్ వచ్చాయంతే..

Devara Glimpse: ‘దేవర’ నుంచి భైర గ్లింప్స్.. గూస్‌బంప్స్ వచ్చాయంతే..

Devara movie glimpse: ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ‘దేవర’ మూవీ గ్లింప్స్ రిలీజ్ అయింది. ఇవాళ సైఫ్ అలీ ఖాన్ బర్త్ డే కావడంతో అతనికి సంబంధించిన పాత్ర సన్నివేశాలను గ్లింప్స్ రూపంలో రిలీజ్ చేశారు. ఇందులో సైఫ్.. భైర అనే పాత్రలో నటిస్తున్నట్లు తెలిపారు. అతడి బర్త్ డే కానుకగా రిలీజ్ అయిన ఈ గ్లింప్స్ ఎలా ఉన్నాయంటే.. సైఫ్ అలీ ఖాన్ ఇందులో ఫుల్ మాస్ యాక్షన్ పాత్రలో కనిపించనున్నట్లు తాజాగా విడుదలైన గ్లింప్స్ చూస్తే అర్థం అవుతుంది.


ఈ గ్లింప్స్ మొత్తం అతడి పాత్రకు సంబంధించి సీన్లనే కట్ చేసి చూపించారు. ఇందులో అతడు కీలక పాత్ర పోషిస్తున్నా.. ఓ హీరో రేంజ్ ఎలివేషన్స్ చూపించారు. యాక్షన్ సన్నివేశాలు చూస్తే మాత్రం అదిరిపోయాయనే చెప్పాలి. ఇప్పటి వరకు దేవర నుంచి వచ్చిన అప్డేట్‌లు ఓ రకం.. ఇప్పుడు వచ్చిన అప్డేట్ మరో రకం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. సైఫ్ అలీ ఖాన్ లుక్స్, యాక్షన్ సన్నివేశాలు దేవర ఫ్యాన్స్‌లో ఫుల్ జోష్ నింపాయి. ఈ గ్లింప్స్‌తో దేవరపై అంచనాలు మరింత పెరిగాయి. అలాగే ఇందులో యాక్షన్ సన్నివేశాల్లో సైఫ్ తలపడుతున్న తీరు అందరిలోనూ ఆసక్తి పెంచింది. దానికి తోడు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ హైలైట్‌గా నిలిచింది.

Also Read: దేవర సెకండ్ సింగిల్ వచ్చేసిందిరోయ్.. ఎన్టీఆర్ రొమాన్స్ నెక్స్ట్ లెవెల్ అంతే


మొత్తం ఈ గ్లింప్స్ రిలీజ్ అయిన అతి కొద్ది నిమిషాల్లోనే యూట్యూబ్‌లో ట్రెండ్ అయింది. ఇదిలా ఉంటే ఈ సినిమాని దర్శకుడు కొరటాల శివ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. దీనిని రెండు పార్టులుగా తీస్తున్నాడు. అందులో మొదటి పార్టును ఈ ఏడాది సెప్టెంబర్ 27వ తేదీన రిలీజ్ చేయనున్నట్లు ఇది వరకే తెలిపారు. అందువల్లనే షూటింగ్ త్వరగా కంప్లీట్ చేసి సినిమాను అనుకున్న తేదీకి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇక ఆర్ ఆర్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా ఇదే కావడంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

ఆర్ఆర్ఆర్‌లో కొమరం భీమ్ పాత్రలో తన నటనతో ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు అందుకున్న ఎన్టీఆర్.. దేవరలో ఎలా కనిపిస్తాడని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఒక్క భారతదేశ సినీ ప్రేక్షకులే కాకుండా.. యావత్ ప్రపంచ సినీ ప్రేక్షకులు అతడి యాక్టింగ్ కోసం తహతహలాడుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఎన్టీఆర్ గ్లింప్స్ రిలీజ్ కాగా ఓ రేంజ్‌లో ఆకట్టుకున్నాయి. అలాగే రెండు సాంగ్‌లు కూడా విపరీతంగా అలరించాయి. ఇకపోతే బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ దేవర సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. అందం, నటనతో బాలీవుడ్‌ను కట్టిపడేసిన ఈ ముద్దుగుమ్మ దేవరతో ఎలాంటి గుర్తింపు సంపాదించుకుంటుందో వేచి చూడాలి.

 

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×