Saif AliKhan:బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ (Saif AliKhan)పై దుండగుడు కత్తితో దాడి చేసిన సంఘటన అందరిని ఉలిక్కిపడేలా చేసింది. ముఖ్యంగా ఆయన ఛాతీ వెన్నెముకకు కత్తి గుచ్చుకొని, అక్కడే విరిగిపోవడంతో లీలావతి హాస్పిటల్ వైద్యులు శస్త్ర చికిత్స చేసి మరీ కత్తిని తొలగించడం జరిగింది. ఇటీవలే డిస్చార్జ్ అయి బయటకు వచ్చిన సైఫ్ అలీ ఖాన్.. తాజాగా పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్లో అసలు విషయాన్ని బయటపెట్టారు. జనవరి 16వ తేదీన ముంబైలోని తన ఇంట్లోకి చొరబడిన వ్యక్తి కత్తిపోట్లకు గురైన నటుడు సైఫ్ అలీఖాన్ నుండి పోలీసులు ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేశారు. ఈ సంఘటనను గుర్తు చేసుకుంటూ సైఫ్ అలీ ఖాన్ ఈ విధంగా స్టేట్మెంట్ ఇచ్చారు.
దాడిపై పోలీసులకు వాంగ్మూలం ఇచ్చిన సైజ్..
సైఫ్ అలీఖాన్ ఇచ్చిన స్టేట్మెంట్ లో ఏముంది అనే విషయానికి వస్తే.. “నేను(సైఫ్అలీఖాన్), నా భార్య కరీనా కపూర్ (Kareena Kapoor) ముంబైలోని సద్గురు శరన్ భవనంలోని 11వ అంతస్తులో మా భవనంలో ఉన్నప్పుడు.. 12వ అంతస్తులో తమ గదిలో వున్న మా చిన్న కుమారుడు జహంగీర్ (జెహ్) , నాని అరుపులు విన్నాము.. ఆ కొద్దిసేపటికి ఆమె ఇంకా గట్టిగా అరుస్తుండడంతో ఆ అరుపులకు ఉలిక్కిపడ్డ నేను, నా భార్య కరీనాకపూర్ వెంటనే నా కొడుకు గదికి చేరుకున్నాము. అక్కడ ఒక వ్యక్తిని చూసి నా కొడుకు జహంగీర్, నానీ (ఎలియామా ఫిలిప్స్) భయపడి అరుస్తూ ఉన్నారు. ముఖ్యంగా నా కొడుకు అతడి ఆకృతిని చూసి భయపడి ఒకటే ఏడుపు. దీంతో మేము కంగారు పడిపోయాము అతడిని నేను ఆపడానికి ఎంత ప్రయత్నం చేసినా అతడు వెనక్కి వెళ్లలేదు. పైగా కోటి రూపాయలు ఇవ్వాలని బెదిరించాడు. ఇక మేము నిరాకరించడంతో ఆ వ్యక్తి నా వీపు, మెడ, చేతులపైన చాలాసార్లు కత్తితో పొడిచాడు. నేను, నాని ఇద్దరూ కలిసి అతడిని లాక్ చేయాలనుకుని వెంటనే గది లోపలికి నెట్టేసాము. ఇక వెంటనే నన్ను నా కుటుంబ సభ్యులు హాస్పిటల్కి తీసుకెళ్లిపోయారు”అంటూ షారుక్ ఖాన్ తెలిపారు.
ఇటీవలే డిశ్చార్జ్ అయిన సైఫ్ అలీఖాన్..
సైఫ్ అలీ ఖాన్ మొత్తం ఆరు కత్తిపోట్లకు గురవగా.. వాటిలో రెండు కత్తిపోట్లు చాలా లోతుగా దిగినట్లు లీలావతి హాస్పిటల్ వారు తెలియజేశారు. ముఖ్యంగా చేయి, మెడపై ప్లాస్టిక్ సర్జరీలు చేయించకుండా.. శస్త్ర చికిత్స చేయించుకున్నాడు ఇక జనవరి 21వ తేదీన డిశ్చార్జ్ అయ్యాడు సైఫ్ అలీ ఖాన్.
సైఫ్ అలీఖాన్ పై దాడి చేసిన వ్యక్తి అరెస్ట్..
ఇకపోతే సైఫ్ అలీఖాన్ పై దాడి చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. గత సంవత్సరం బాంగ్లాదేశ్ నుండి అక్రమంగా భారతదేశంలోకి ప్రవేశించిన ఇతడు, సెలబ్రిటీలను టార్గెట్ గా చేసుకొని దొంగతనాలు చేస్తూ ఉండేవాడట. ఇక ఇతడిని షరీఫుల్ ఇస్లాముగా గుర్తించారు. ఇతడిని పట్టుకోవడానికి ముంబై పోలీసులు ఏకంగా 20 బృందాలుగా విడిపోయి, మూడు రోజులపాటు వెతికిన తర్వాత ముంబై సమీపంలోని థానే లో అతను పట్టుపడ్డాడు. అయితే ఇతడిని ఇలా పట్టుకోవడానికి గూగుల్ పే లావాదేవీలు సమాచారం అందించినట్లు తెలుస్తోంది. ఇతడు అల్పాహారం కోసం పరాటా తీసుకొని దానికోసం డబ్బులు చెల్లించడానికి యూపీఐ పేమెంట్ ఉపయోగించారు. ఇక ఈ నెంబర్ ను ట్రేస్ చేసి పోలీసులు అతడు థానే లో ఉన్నట్టు గుర్తించి అరెస్టు చేసినట్లు సమాచారం.