BigTV English

Janasena vs YCP: జనసేన వర్సెస్ వైసీపీ.. లైన్ క్రాస్ చేసి మరీ విమర్శలు!

Janasena vs YCP: జనసేన వర్సెస్ వైసీపీ.. లైన్ క్రాస్ చేసి మరీ విమర్శలు!

Janasena vs YCP: మాజీ సీఎం జగన్ కు జనసేన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. అది కూడ అలా ఇలా కాదు ఏకంగా జగన్ కు ట్విట్టర్ ద్వార ట్యాగ్ చేసి మరీ వార్నింగ్ ఇచ్చింది జనసేన. సాధారణంగా వైసీపీ వర్సెస్ టీడీపీ మధ్య విమర్శలు సాగుతుంటాయి. కానీ ఇప్పుడు వైసీపీ ఇచ్చిన కౌంటర్ కు జనసేన రిప్లై మాత్రం కాస్త ఘాటుగానే ఉందంటున్నారు నెటిజన్స్. అసలేం జరిగిందంటే?


ఇటీవల నారాయణ కాలేజీలో ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై వైసీపీ ఓ వీడియో విడుదల చేసింది. ఆ వీడియోలో ఒక మహిళ తాను తన సమస్య చెప్పుకోవడానికి పవన్ వద్దకు వెళితే, సరే బిడ్డ చనిపోయాడు.. ఇప్పుడు నీ బిడ్డ తిరిగి రాదు కడమ్మా అని పవన్ అన్నట్లు ఓ మహిళ చెప్పినట్లు ఉంది. అయితే ఈ వీడియోలో మొత్తం కట్ చేసి ప్లే చేసినట్లు నెటిజన్స్ అంటున్నారు.

ఇది ఇలా ఉంటే వైసీపీ ఈ వీడియోను ట్విట్టర్ ద్వార పవన్ కళ్యాణ్ కు ట్యాగ్ చేసి ఛీ.. సిగ్గుపడు దత్తపుత్రా.. నారాయణ, చైతన్య కాలేజీల్లో దురాగతాలపై ఆరోజు శుద్ధపూసలా తెగ నీతులు చెప్పావ్.. అధికారంలోకి రాగానే ఇప్పుడు నీ అసలు బుద్ధి చూపిస్తున్నావా? ఓ విద్యార్థిని చనిపోతే.. బాధిత కుటుంబం గోడుని కూడా కనీసం వినకుండా వెటకారం చేస్తావా? ఆడబిడ్డ చావు నీకు అంత ఎగతాళి అయిపోయిందా పవన్ కళ్యాణ్? అంటూ పోస్ట్ చేసింది.


వైసీపీ చేసిన ఈ విమర్శలకు జనసేన స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది. పవన్ ను దత్తపుత్రా అంటూ వైసీపీ సంభోధిస్తే, జనసేన మాత్రం సిగ్గు లేదా జైలు పుత్రా అంటూ ట్వీట్ చేసింది. సొంత చెల్లి, తల్లి కూడా కష్టం అని నీ దగ్గరికి వస్తే నువ్వు ఛీ కొట్టిన దుర్మార్గుడువని బహిరంగంగా చెప్పారు, అయినా బుద్ధి రాకపోతే ఎలా జైలు పుత్రా జగనా అంటూ జనసేన ప్రశ్నించింది.

Also Read: AP Schemes: విద్యార్థుల తల్లుల ఖాతాలో రూ. 15 వేలు.. కీలక అప్ డేట్ ఇచ్చిన ప్రభుత్వం

కష్టం అని వచ్చిన వారిని అక్కున చేర్చుకుని, వారి కష్టాలు తీర్చడమే పవన్ కళ్యాణ్ కు తెలుసని, అదే పవన్ రాజకీయ పంథా అంటూ.. సోషల్ మీడియాలో ఎవరో ఒక ఫేక్ వీడియో పెట్టగానే, శవాల దగ్గర చిల్లర వేరుకునే వాడిలా కనీసం నిజాలు తెలుసుకోకుండా నీచ రాజకీయాలు చేస్తావా? జనవాణి పేరుతో అధికారంలో లేనప్పటి నుండి నేటి వరకు కష్టం అని వచ్చిన ప్రతీ ఒక్కరి సమస్య వినే ఒక వేదిక ఏర్పాటు చేసి, సమస్యల పరిష్కారం చేస్తూ ఉన్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. వందల సమస్యలు పరిష్కారం అయ్యాయి, అందులో 90% సమస్యలు నీ దిక్కుమాలిన పాలనలో ఎదుర్కొన్నవే, అలాంటిది ఆడబిడ్డ కష్టం చెప్పుకోవడానికి వస్తే జనసేన పట్టించుకోదు అంటే ఎలా నమ్మావు జగనా అంటూ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది జనసేన. మరి జనసేన ఇచ్చిన రిప్లైకి వైసీపీ ఏమేరకు రియాక్ట్ అవుతుందో వేచిచూడాలి.

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×