BigTV English

Saindhav Movie: ‘సైంధవ్‌’ న్యూ ఇయర్ కానుక.. ఫ్యాన్స్‌లో ఫుల్ జోష్

Saindhav Movie: ‘సైంధవ్‌’ న్యూ ఇయర్ కానుక.. ఫ్యాన్స్‌లో ఫుల్ జోష్

Saindhav Movie: టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేశ్ నటిస్తున్న తాజా చిత్రం ‘సైంధవ్‌’. యాక్షన్‌ థ్రిల్లర్‌ జోనర్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి శైలేష్‌ కొలను దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి మేకర్స్ ఓ సర్ప్రైజ్ అందించారు. ఆ సర్ప్రైజ్ వెంకీ మామ అభిమానుల్లో ఫుల్ జోష్ నింపింది. మరి అదెంటో తెలుసుకుందామా..


వెంకటేశ్ తన కెరియర్‌లో 75వ సినిమాగా ‘సైంధవ్’లో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి ‘హిట్’ ఫేమ్ శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తుండగా.. వెంకట్ బోయనపల్లి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 13న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా ఈ చిత్రం విడుదల కానుంది. రిలీజ్‌కి ఇంకా 12 రోజులే ఉండడంతో చిత్ర బృందం ప్ర‌మోష‌న్స్‌ను వేగవంతం చేసింది.

ఇందులో బాగంగా ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి రిలీజైన టీజ‌ర్‌, సాంగ్‌లకు ఆడియోన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ తరుణంలోనే మేకర్స్ మరో అప్డేట్‌ను అందించి.. అభిమానుల్లో ఫుల్ జోష్ నింపారు. న్యూ ఇయర్ కానుకగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ డేట్‌ను వెల్లడించారు. ఈ మేరకు జనవరి 3న ఈ ట్రైలర్‌ను రిలీజ్ చేయనున్నట్లు ఓ పోస్టర్ ద్వారా తెలిపారు. దీంతో ఈ ట్రైలర్‌ కోసం ఫ్యాన్స్ తెగ ఎదురుచూస్తున్నారు.


Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×