BigTV English

Salaar Movie Update : సలార్ క్రేజీ అప్డేట్ .. కలవరంలో ప్రభాస్ ఫ్యాన్స్..

Salaar Movie Update : సలార్ క్రేజీ అప్డేట్ .. కలవరంలో ప్రభాస్ ఫ్యాన్స్..
Salaar Movie Update

Salaar Movie Update : పాన్ ఇండియా రేంజ్ స్టార్ డమ్ ఉన్న టాలీవుడ్ యాక్టర్ ప్రభాస్. కటౌట్ చూసి కొన్ని నమ్మేయాలి డ్యూడ్.. అన్నట్లు ప్రభాస్ కటౌట్ చూస్తే.. అతను ఉంటే చాలు ఏ మూవీ అన్న హిట్ అవ్వాల్సిందే అనిపిస్తుంది. కానీ బయట నుంచి వచ్చి పెద్ద పేరు లేని యాక్టర్ సినిమాలు కూడా తెలుగులో సూపర్ డూపర్ హిట్ అవుతుంటే.. టాలీవుడ్ లో డార్లింగ్ గా గుర్తింపు పొందిన ప్రభాస్ చిత్రాలు మాత్రం సరి అయిన ఆదరణ అందుకోలేక పోతున్నాయి. దీనికి తోడు ప్రభాస్ చిత్రం విడుదల అవుతుందంటే చాలు ఎక్కడ నుంచి వస్తాయో నెగటివ్ టాక్స్ ఆ మూవీని చుట్టుముడతాయి. నెగిటివ్ టాప్స్ ఉన్నా సరే వాటన్నిటిని దాటుకొని ప్రభాస్ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బాగానే ఇంపాక్ట్ చూపిస్తున్నాయి.


గత మూడు సినిమాలు విడుదలకు ముందు ఏమాత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకొని ఉన్నా బాక్స్ ఆఫీస్ వద్ద మంచిగా పెర్ఫార్మ్ చేసి రికార్డులు సృష్టించేవి అని ఆ చిత్రాల ఓపెనింగ్స్ చెప్పకనే చెబుతున్నాయి. ప్రస్తుతం రాబోయే ప్రభాస్ సలార్ మూవీ పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ మూవీతో ప్రభాస్ సూపర్ డూపర్ సక్సెస్ అందుకుంటాడు అని ఫ్యాన్స్ గట్టి నమ్మకంతో ఉన్నారు. ట్రైలర్ పై కాస్త నెగటివ్ టాక్ అక్కడక్కడ వినిపిస్తున్నప్పటికీ.. స్క్రీన్ పై ఈ మూవీ బాగా క్లిక్ అవుతుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

ప్రశాంత్ నీల్ టేకింగ్ పై ఉన్న నమ్మకం.. ప్రభాస్ ఇమేజ్ పై ఉన్న విశ్వాసం.. సలార్ మూవీ రికార్డ్ సృష్టిస్తుందని గట్టిగా నమ్మేలా చేస్తుంది. అయితే లేటెస్ట్ గా వినిపిస్తున్న ఒక చిన్న విషయం ప్రభాస్ అభిమానులను కాస్త కలవర పెట్టే విధంగా ఉంది. ప్రస్తుతం మూవీ చిన్నదైనా.. పెద్దదైన ప్రమోషన్స్ భారీగా జరిగితేనే ఆ మూవీ భవిష్యత్తు బాగుంటుంది. స్టార్ హీరోలైన ..మిడ్ రేంజ్ హీరోలైన పోటీపడి మరి తమ మూవీ ప్రమోషన్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సలార్ ప్రమోషన్స్ లో ప్రభాస్ కనిపించకపోవచ్చు అనే వార్త ప్రస్తుతం వైరల్ అవుతుంది.


గతంలో ఆదిపురుష్ సినిమా అప్పుడు కూడా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ అయ్యాక ప్రభాస్ విదేశాలకు వెళ్లిపోయాడు.. ఇప్పుడు కూడా అదే తరహాలో సలార్ ఈవెంట్ లో పాల్గొని ఆ తర్వాత సైలెంట్ గా ఉండే అవకాశం ఉంది అని టాక్. మిగిలిన సినిమా షూటింగ్స్ లో ఎక్కువ బిజీగా ఉన్న కారణంతో ప్రభాస్ ప్రమోషన్స్ లో పెద్దగా పాల్గొనలేడు అని తెలుస్తోంది. ఇదే కనుక నిజమైతే కచ్చితంగా మూవీ పై ఈ విషయం ప్రభావం చూపిస్తుందేమో అంటున్నారు సినీ విశ్లేషకులు. అయితే మొత్తానికి ఈ విషయంపై త్వరలోనే ఒక క్లారిటీ వస్తుంది అని ప్రభాస్ ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×