BigTV English

Prabhas: “సలార్” సినిమా టికెట్ ధర పెంపు.. తెలుగు రాష్ట్రాలు గ్రీన్ సీగ్నల్..

Prabhas: “సలార్”  సినిమా టికెట్ ధర  పెంపు..  తెలుగు రాష్ట్రాలు గ్రీన్ సీగ్నల్..

Prabhas: సలార్ మూవీ టికెటు ధరలను పెంచుకునేందుకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అనుమతులు ఇచ్చాయి. భారీ అంచనాలతో ఈ సినిమా డిసెంబర్ 22న విడుదల కానుంది. అగ్ర కథానాయకులు నటించిన సినిమాలకు, భారీ బడ్జెట్ తో నిర్మించిన చిత్రాలకు మొదటి వారం టికెట్ల ధరలను పెంచుకునేందుకు వెసులుబాటు ఉంది. మైత్రీ నిర్మాణ సంస్థ టికెట్లు పెంపుకోసం చేసిన వినతిని పరిశీలించిన ప్రభుత్వం మల్టీ ప్లెక్స్ లో రూ.100 రూపాయలు, సింగిల్ థియోటర్ల లో రూ.65 రూపాయలు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది.


రాష్ట్రవ్యాప్తంగా 20 థియోటర్ల లో మాత్రమే అర్ధరాత్రి 1గంటకు బెన్ ఫిట్ షో లకు అనుమతి ఇచ్చింది. సాధారణంగా ఉండే నాలుగు షో లతో పాటు అదనంగా ఉదయం 4 గంటల నుంచి ఆరో ఆట ప్రదర్శించుకోవటానికి అనుమతులు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వూలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం రాష్ట్రంలో మల్టీప్లెక్స్ లో సాధారణ థియేటర్లలో రూ.40 రూపాయలు ధరలు పెంచుకునేందుకు అనుమతులు ఇచ్చింది. సినిమా విడుదల అయిన 10 రోజుల వరకు మాత్రమే ఈ నిబంధనలు వర్తిస్తాయని ఉత్తర్వులు జారీ చేసింది. అదనపు షో లకు మాత్రం అనుమతి ఇవ్వలేదు.

కేజీయఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ చిత్రంలో శ్రుతి హాసన్ ,పృథ్వీ రాజ్ సుకుమారన్ మొదలైన వారు కీలక పాత్రలు పోషించారు.ఇప్పటికే చాలా నగరాలలో సినిమా టికెట్లు విక్రయాలు పెరగడంతో థియోటర్లు వద్ద అభిమానులతో సందడి నెలకొంది.


Related News

Singer Lipsika: గుడ్ న్యూస్ చెప్పిన సింగర్ లిప్సిక.. కీరవాణి చేతుల మీదుగా?

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Big Stories

×