E-Paper
Advertisement

Salaar Trailer : సలార్ ట్రైలర్ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే..

Salaar Trailer : సలార్ ట్రైలర్ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే..
Advertisement

Salaar Trailer : ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న సినిమా సలార్. ఈ సినిమాను రెండు పార్టులుగా తెరకెక్కిస్తుండటంతో టాలీవుడ్ ఆడియన్స్ తో పాటు దేశవ్యాప్తంగా ప్రభాస్ ఫ్యాన్స్, మూవీ లవర్స్ ఎదురుచూస్తున్నారు. సలార్ పార్ట్ 1 ఈ ఏడాది సెప్టెంబర్ లోనే విడుదలవ్వాల్సి ఉండగా.. సినిమా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ పూర్తికాకపోవడంతో విడుదలను వాయిదా వేశారు. సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ ను డిసెంబర్ 22న విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు.

సినిమా విడుదలకు సమయం దగ్గర పడుతుండటంతో.. మేకర్స్ ఏయే అప్డేట్స్ ఇస్తారా అని ఎదురుచూస్తున్న అభిమానులకు ఎప్పటికప్పుడు నిరాశే ఎదురవుతుంది. మేకర్స్ ఇంకా ప్రమోషన్స్ స్టార్ట్ చేయకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. తాజాగా.. సలార్ పార్ట్ 1 ట్రైలర్ విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తామని చెప్పడంతో అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు. డిసెంబర్ 1న సలార్ ట్రైలర్ ను విడుదల చేస్తారని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. దీనిపై చిత్రబృందం ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు.

Advertisement

కాగా.. మొన్నటి వరకూ యూరప్ లో ఉన్న ప్రభాస్.. రీసెంట్ గానే ఇండియాకు వచ్చాడు. ప్రభాస్ రాకతో చిత్రం ప్రమోషన్స్ షురూ చేశారని సమాచారం. ట్రైలర్ అనౌన్స్ మెంట్ సూన్ అంటూ రిలీజ్ చేసిన పోస్టర్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. కాగా.. సలార్ లో శృతిహాసన హీరోయిన్ గా నటిస్తుండగా.. మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు విలన్లుగా నటిస్తున్నారు. శ్రియారెడ్డి కీలక పాత్ర పోషిస్తుంది. ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×