BigTV English

Salman Khan-Aamir Khan: 30 ఏళ్ల తర్వాత కలిసి నటిస్తున్న ఖాన్ లు..ఇక బాక్సాఫీస్ బద్దలే

Salman Khan-Aamir Khan: 30 ఏళ్ల తర్వాత కలిసి నటిస్తున్న ఖాన్ లు..ఇక బాక్సాఫీస్ బద్దలే

Salman Khan-Aamir Khan reunion after 30 years? Production House’s post sparks buzz: బాలీవుడ్ లో ఖాన్ త్రయం అనగానే అమీర్ ఖాన్, షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్ లే గుర్తుకొస్తారు. అయితే షారుఖ్ ఖాన్ కన్నా అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ ముందుగా బాలీవుడ్ ను బంతాడేసుకున్నారు. బాక్సాఫీస్ వద్ద వీరి సినిమాలు కనకవర్షం కురిపించాయి. సల్మాన్ ఖాన్ 1988 లో బివి హోతో ఐసీ మూవీలో చిన్న పాత్రతో పరిచయం అయ్యాడు. అయితే హీరోగా మాత్రం 1989లో మైనే ప్యార్ కియా మూవీతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు. ఈ మూవీతో ఫిలింఫేర్ అవార్డు కూడా అందుకున్నారు. ఈ మూవీ తర్వాత సల్మాన్ వెనుతిరిగి చూసుకోలేదు. 1973 సంవత్సరంలో యాదోంకీ బారాత్ చిత్రంలో ఓ చిన్న క్యారెక్టర్ లో నటించారు. 1988లో వచ్చిన ఖయామత్ సే ఖయామత్ తక్ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. తర్వాత కమర్షియల్ చిత్రాలలో నటిస్తూనే సందేశాత్మక చిత్రాలలోనూ నటించి మంచి పేరు తెచ్చుకున్నారు.


30 ఏళ్ల తర్వాత..

సల్మాన్, అమీర్ ఖాన్ ఇద్దరూ సంవత్సరం తేడాతో బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. అయితే వీరిద్దరూ కలిసి అందాజ్ అప్నా అప్నా అనే మూవీలో హీరోలుగా నటించారు. 1994లో విడుదలైన ఈ మూవీ బ్లాక్ బస్టర్ గా మంచి కలెక్షన్లు అందుకుంది. ఈ మూవీలో రవీనా టాండన్, కరిష్మాకపూర్ హీరోయిన్లుగా వీరితో జతకట్టారు. అయితే ఈ మూవీకి సీక్వెల్ తీస్తారని ఎప్పటినుంచో అనుకుంటున్నారు. దీనిపై అనేక గాసిప్స్ కూడా వచ్చాయి. అయితే 30 సంవత్సరాల తర్వాత మరోసారి ఈ జంట కలిసి నటిస్తున్నారనే వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ ముప్పై సంవత్సరాలలో ఇద్దరు హీరోలూ తమ తమ సినిమా బిజీ షెడ్యూల్స్ తో కలిసి నటించే అవకాశం దొరకలేదు. ఇద్దరి మధ్య సన్నిహిత సంబంధాలు బాగానే ఉన్నాయి. కానీ ఇద్దరూ కలిసి నటించే రేంజ్ కథ దొరకక నిర్మాతలెవరూ ముందుకు రాకపోవడంతో పెండింగ్ లో పడిపోయింది.


సల్మాన్ నిర్మాతగా..

అందాజ్ అప్నా అప్నా తర్వాత వీళ్లిద్దరినీ కలిపేందుకు చాలా మంది ప్రయత్నించారు. అయితే ఇటీవల సల్మాన్ ఖాన్ తన మిత్రుడు అమీర్ ఖాన్ ను కలిసేందుకు ఇంటికి వెళ్లారట. అక్కడే వీరిద్దరూ కలిసి నటించే చిత్రానికి బీజం పడిందని అంటున్నారు. ఇద్దరూ తమ తమ సినిమాల షెడ్యూల్స్ లో బిజీగా ఉన్నప్పటికీ కొత్త గా ఇద్దరూ కలిసి నటించే ప్రాజెక్టుపై చర్చలు జరిగాయట. అయితే అమీర్ ఖాన్ తన సొంత ప్రొడక్షన్ బ్యానర్ లోనే ఈ మూవీని చేయాలని ఉందని తన కోరికను బయటపెట్టగానే సల్మాన్ ఖాన్ వేరే ఆలోచన చేయకుండా ఒప్పేసుకున్నాడట. బాలీవుడ్ లో ఇప్పుడిప్పుడే దర్శకుడిగా ఎదుగుతున్న ఆర్ఎస్ ప్రసన్న ఎప్పుడో హీరో అమీర్ ఖాన్ కు తన వద్ద ఉన్న కథను వినిపించాడట. ఆ కథ వినగానే అమీర్ ఖాన్ చాలా ఎక్సైట్ గా ఫీలయ్యాడట. దీనితో దానిని తానే సొంతంగా నిర్మిస్తే ఎలా ఉంటుందనే ఆలోచనతో అమీర్ ఖాన్ కలిసినప్పుడు ఈ ప్రాజెక్టు వివరాలు చెప్పినట్లు సమాచారం.

పాన్ వరల్డ్ మూవీగా..

ఇద్దరి పాత్రలకూ సూటయ్యే కథ కావడంతో ఇద్దరూ ఈ ప్రాజెక్టు చేసేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం పాన్ వరల్డ్ మూవీస్ గా భారతీయ చిత్రాలు రూపుదిద్దుకుంటున్నాయి. షారుఖ్ ఖాన్ పఠాన్, జవాన్ సినిమాలు రెండూ వెయ్యి కోట్ల ప్రాజెక్టులుగా రికార్డు కలెక్షన్లు క్రియేట్ చేశాయి. రీసెంట్ గా ప్రభాస్ నటించిన కల్కి మూవీ కూడా వెయ్యి కోట్లు రాబట్టింది. ఇప్పుడు ఈ ఇద్దరు హీరోలు కలిసి నటిస్తే..ఆ మూవీలో విషయం ఉంటే తప్పకుండా మరో వెయ్యి కోట్లు రాబట్టే సినిమా వచ్చినట్లే..అని ఫ్యాన్స్ ఆత్రుతగా ఈ క్రేజీ ప్రాజెక్టు కోసం ఎదురుచూస్తున్నారు.

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×