BigTV English

RBI Governor : ప్రపంచంలోనే టాప్ ర్యాంక్ సాధించిన ఆర్బిఐ గవర్నర్.. వరుసగా రెండో సారి!

RBI Governor : ప్రపంచంలోనే టాప్ ర్యాంక్ సాధించిన ఆర్బిఐ గవర్నర్.. వరుసగా రెండో సారి!

RBI Governor Shaktikanta Das | ప్రపంచంలోని టాప్ సెంట్రల్ బ్యాంకుల్లో భారత దేశపు రిజర్వ్ బ్యాంక్ వరుసగా రెండోసారి ”A+” ర్యాంక్ సాధించింది. ఈ టాప్ ప్రపంచంలోని మూడు బ్యాంకులకు మాత్రమే ఈ సంవత్సరం లభించడం విశేషం. అమెరికాకు చెందిన గ్లోబల్ ఫైనాన్స్ మెగజీన్ ప్రచురించిన రిపోర్ట్ ప్రకారం.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, డెన్మార్క్ కు చెందిన యూరోపియన్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్, స్విట్జార్ ల్యాండ్ కు చెందిన స్విస్ నేషనల్ బ్యాంక్ ”A+” ర్యాంక్ సాధించాయి.


అయితే భారత్ కు ఈ టాప్ ర్యాంక్ రావడం ఇది వరుసగా రెండోసారి. గ్లోబల్ ఫైనాన్స్ మెగజీన్ ప్రచురించిన రిపోర్ట్ లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) గవర్నర్ శక్తికాంతా దాస్ తీసుకున్న కీలక నిర్ణయాల వల్లే ఈ టాప్ ర్యాంక్ సాధ్యమైందని ప్రశంసించింది. భారత దేశంలో పెరుగుతున్న ద్రవోల్బణాన్ని అదుపు చేయడం, ఆర్థికంగా దేశం అభివృద్ధి చెందడం, ఇండియన్ కరెన్సీ, వడ్డీ రేట్లు స్థిరంగా ఉండడానికి ఆర్‌బిఐ) గవర్నర్ శక్తికాంతా దాస్ వ్యూహాలు కీలక పాత్ర పోషించాయని రిపోర్ట్ పేర్కొంది.

”A+” ర్యాంక్ సాధించిడానికి నియమాలు ఇవే
గ్లోబల్ ఫైనాన్స్ మేగజీన్ సెంట్రల్ బ్యాంకర్ రిపోర్ట్ కార్డ్స్ నియమాల ప్రకారం.. ప్రతీ దేశ కేంద్ర బ్యాంకుల గవర్నర్లకు ”A” నుంచి ”F” వరకు ర్యాంక్ కేటాయిస్తారు. ముఖ్యంగా దేశంలో పెరుగుతున్న నిత్వావసరాల ఖర్చులు అదుపుచేయడానికి ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడం, ఆర్థిక పురోగతి సాధించడానికి కొత్త ఆర్థిక పాలసీలు రూపొందించడం, అంతర్జాతీయ మార్కెట్లకు అనుగుణంగా కరెన్సీని స్థిరంగా ఉంచడం, వడ్డీ రేట్లు నియంత్రించడం… ఈ బాధ్యతలన్నీ విజయవంతంగా నిర్వహించగలగాలి. అయితే ఈ పనులన్నీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంతా దాస్.. సమర్థవంతంగా నిర్విహించారు. పైగా ఆశించిన స్థాయ కంటే మెరుగైన ఫలితాలు సాధించారు.


ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంతా దాస్ ని గ్లోబల్ ఫైనాన్స్ మేగజీన్ ప్రశంసిస్తూ.. గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశంలో విపరీతంగా పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు శక్తి కాంతా దాస్ ప్రభావవంతమైన ఆర్థిక పాలసీలు రూపొందించి.. మంచి ఫలితాలు రాబట్టారని తెలిపింది.

గ్లోబల్ ఫైనాన్స్ మేగజీన్ 1994 నుంచి ప్రపంచ దేశాల కేంద్ర బ్యాంకుల గవర్నర్లకు ర్యాంకులు కేటాయిస్తూ ప్రతీ సంవత్సరం రిపోర్ట్ జారీ చేస్తోంది. దేశంలో ఆర్థికంగా అద్భుతమైన ఫలితాలు సాధించిన బ్యాంకర్లకు గౌరవంగా ఈ రిపోర్ట్ ప్రచురిస్తుంది.

Also Read: ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలనుకుంటున్నారా?.. అత్యధిక వడ్డీ రేటు ఏ బ్యాంకు ఇస్తుందో తెలుసా?

అయితే భారత దేశ ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంతా దాస్ తో పాటు యూరోపియన్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్ క్రిస్టియన్ కెట్టెల్ థామ్ సెన్, స్విట్జార్ ల్యాండ్ కు చెందిన స్విస్ నేషనల్ బ్యాంక్ చైర్మెన్ థామస్ జోర్డాన్ ని కూడా టాప్ ర్యాంకులు కేటాయించింది. క్రిస్టియన్ కెట్టెల్ థామ్‌సెన్ డెన్మార్క్ ప్రభుత్వంలో పలు పదువుల బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆయన డెన్మార్క్ ప్రధాన మంత్రి, ఆర్థిక శాఖకు పర్మనెంట్ సెక్రటరీగా కూడా పనిచేస్తున్నారు. అలా స్విస్ నేషనల్ బ్యాంక్ చైర్మాన్ థామస్ జోర్డాన్ కూడా ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ లావాదేవీల బ్యాంకులలో కీలక పదవులలో ఉన్నారు.

Also Read:  ట్రైన్ లేట్ అయితే మీ డబ్బులు ఫుల్ రిఫండ్.. షరతులు వర్తిస్తాయి!

 

Related News

Personal Finance: 45 సంవత్సరాలకే రిటైరయ్యి పెన్షన్ పొందుతూ లైఫ్ హాయిగా గడపాలని ఉందా..అయితే ఇలా ప్లాన్ చేసుకోండి..

Central Govt Scheme: విదేశాల్లో చదవాలని ఉందా… అయితే కేంద్ర ప్రభుత్వం అందించే రూ. 40 లక్షల లోన్ కోసం ఇలా అప్లై చేసుకోండి.

Mobile Recharge: ఎయిర్ టెల్ లోని ఈ ఆఫర్ తో రీచార్జ్ చేస్తే Netflix, Prime Video, Zee5, JioHotstar ఫ్రీగా చూసే ఛాన్స్..

Real Estate: రెంటల్ అగ్రిమెంట్ 11 నెలలు మాత్రమే ఎందుకు చేయించుకుంటారు..దీని వెనుక ఉన్న అసలు మతలబు ఇదే..

Real Estate: క్లియర్ టైటిల్ ల్యాండ్ కొనాలి అంటే తప్పనిసరిగా చూడాల్సిన డాక్యుమెంట్స్ ఇవే…లేకపోతే భారీ నష్టం తప్పదు..

Real Estate: అపార్ట్‌మెంట్ ఫ్లాట్‌ కొంటున్నారా..అయితే అన్ డివైడెడ్ షేర్ (UDS) అంటే ఏంటి ?.. ఈ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ?

Big Stories

×