Salman Khanబాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో కండల వీరుడుగా గుర్తింపు తెచ్చుకున్న సల్మాన్ ఖాన్ (Salman Khan) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఈ మధ్య ఈయన సినిమాల కంటే కూడా వ్యక్తిగతంగానే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. ముఖ్యంగా భిష్ణోయ్ వర్గం వారు సల్మాన్ ఖాన్ ను టార్గెట్ చేస్తూ హత్యా బెదిరింపులు చేయడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అలా ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు సల్మాన్ ఖాన్. ఇదిలా ఉండగా తాజాగా ఈయన సోదరికి రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రస్తుతం ఆమె హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయగా.. ఇవి కాస్త వైరల్ అవుతున్నాయి. దీంతో సల్మాన్ ఖాన్ సోదరి శ్వేతా రోహిరా (Swetha rohira) కి ఇప్పుడు ఎలా ఉంది? అని అభిమానులు తెలుసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేకాదు ఆమెకు జరిగిన పరిస్థితిని చూసి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదానికి గురైన సల్మాన్ ఖాన్ సోదరి..
అసలు విషయంలోకి వెళ్తే.. సల్మాన్ ఖాన్ సోదరి శ్వేత రోహిరా రోడ్డు ప్రమాదానికి గురైన తర్వాత హాస్పిటల్లో చికిత్స తీసుకుంటూ.. కాలుకి అతి పెద్ద కట్టుతో ఉన్న ఫోటోని షేర్ చేసింది. అంతేకాదు ఆసుపత్రి బెడ్ పై ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ..” లైఫ్ ఫుల్ సర్ప్రైజ్ కదా.. ఈరోజు ఏం చేయాలో అని ఆలోచిస్తున్నాను. కానీ జీవితం నిర్ణయించే ప్లాన్స్ వేరు.. సడన్గా ఒక బైకు వచ్చి మీకు తగిలి.. మిమ్మల్ని రెస్టింగ్ మూడ్ లోకి పంపుతుంది. కొన్నిసార్లు జీవితం పూర్తిగా మిమ్మల్ని కదిలిస్తుంది. ఎందుకంటే మనల్ని మరింత బలంగా మార్చడంలో జీవితం అనేది తొలి స్థానంలో ఉంటుంది. అంతేకాదు విధ్వంసమే సృష్టికి విశాలమైన మార్గం” అంటూ రాసుకుంది. దీంతో శ్వేత షేర్ చేసిన ఫోటోలు చూస్తుంటే ప్రమాదంలో శ్వేతా తీవ్రంగానే గాయపడినట్లు స్పష్టం అవుతుంది. కాలుతో పాటు పై పెదవికి కూడా గాయాలు తెలుస్తోంది. దీంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈమె ఫోటోలు చూసి నెటిజన్స్ కూడా షాక్ అవుతున్నారు.
శ్వేత రోహిరా కెరియర్..
ఇక శ్వేత రోహిరా కెరియర్ విషయానికి వస్తే.. సల్మాన్ ఖాన్ కు ఈమె రాఖీ కట్టిన సోదరి. 2014లో ప్రముఖ నటుడు పుల్కిత్ సామ్రాట్ ను వివాహం చేసుకుంది. ఇక కొంతకాలం అన్యోన్యంగా ఉన్న ఈ జంట అనుహ్యంగా విడాకులు తీసుకొని అందరిని ఆశ్చర్యపరిచారు. వివాహమైన ఒక సంవత్సరం తర్వాత శ్వేతా, పుల్కిత్ విడిపోవాలని నిర్ణయించుకున్నారు. అలా శ్వేత విడాకులు తీసుకొని బయటపడి ఒంటరి జీవితాన్ని కొనసాగిస్తుండగా.. పుల్కిత్ రెండవ జీవితాన్ని కూడా మొదలుపెట్టాడు. గత ఏడాది హీరోయిన్ కృతి కర్బంధాను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వీరి పెళ్లి ఫోటోలు కూడా సోషల్ మీడియాలో చాలా వైరల్ అయ్యాయి. భర్త ఇంకొక వివాహం చేసుకున్నా.. ప్రస్తుతం ఈమె మాత్రం ఇంకో తోడు వెతుక్కోకుండా ఒంటరిగానే జీవిస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు రోడ్డు ప్రమాదానికి గురవడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. త్వరగా కోలుకోవాలని కోరుతున్నారు.