Gajuwaka News: గాజువాకలో దారుణ ఘటన చోటుచేసుకుంది. యువతి స్నానం చేస్తుండగా ఓ యువకుడు వీడియో తీశాడు. గమనించిన యువతి ఒక్కసారిగా కేకలు వేసింది. యువతి బంధువులు, చుట్టుపక్కల స్థానికులు యువకుడి గదిలో బంధించి దారుణంగా చితకబాదారు. యువకుడి మొబైల్‌ను తీసుకుని యువతికి సంబంధించిన వీడియోలన్నీ డిలీట్ చేశారు. యువతి బంధువులు నిందితుడి తండ్రికి సమాచారం ఇస్తామని చెప్పి గదిలో బంధించారు. యువకుడు అవమానంతో గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని అత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.
పోలీసుల వివరాల ప్రకారం.. విజయనగరం జిల్లాకు చెందిన భాస్కర్ రావు(30) ఫార్మాసిటీలోని ఓ ఫార్మా కంపెనీలో గత కొన్ని రోజుల నుంచి ల్యాబ్ అసిస్టెంట్ గా పని చేస్తున్నాడు. ఇంకా అతని వివాహం కాలేదని.. గాజు వాక శ్రీనగర్ కాలనీలో రెంట్ కు ఉంటున్నాడని పోలీసులు తెలిపారు. కొద్ది రోజుల క్రితమే ఇంటి ఓనర్ మనవరాలు ఊరు నుంచి వచ్చింది. ఫస్ట ఫ్లోర్ లో ఓనర్ బాత్రూమ్ కొంత ఓపెన్‌గా ఉంటుంది. అయితే నిన్న ఓనర్ మనవరాలు స్నానం చేస్తుండగా వీడియో తీశాడు. దీంతో యువతి ఒక్కసారిగా కేకలు వేసింది. భాస్కర్ రావు అక్కడ నుంచి తన గదిలోకి వెళ్లాడు. యువతి బంధువులు, స్థానికులు, యువతి లవర్ అక్కడకు చేరుకుని భాస్కర్ రావును చితకబాదారు. అనంతరం రూంలోని యువకుడి బంధించారు. యువతి వీడియో తీశాడని.. భాస్కర్ రావు తల్లిదండ్రులకు తెలియజేశారు. దీందో ఆందోళనకు గురైన భాస్కర్ రావు రూమ్ లోనే కేబుల్ వైర్లతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Also Read: Bank of Baroda: బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలు.. రూ.25,00,000 జీతం భయ్యా.. డోంట్ మిస్..
సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. విజయనగరంలో ఆటో నడుతూ జీవనం కొనసాగిస్తున్న భాస్కర్ రావు తండ్రి తాతారావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన కుమారుడిని యువతి బంధువులు కొట్టి చంపేశారని ఫిర్యాదు చేశాడు. ఈ కేసులో యువతికి సంబంధించిన ఐదుగురి వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సిఉంది.