Jaggareddy Gudem News: ఏలూరు జిల్లా జంగారెడ్డి గూడెంలో దారుణం చోటుచేసుకుంది. కన్నకొడుకు, కూతురుని తండ్రి అత్యంత దారుణంగా సెల్ ఫోన్ ఛార్జర్ వైరుతో తీవ్రంగా కొట్టాడు. దీంతో బాలుడు శరీరం కుమిలిపోయింది. కొంత కాలంగా తనను, చెల్లిని కొడుతున్నారని, కొట్టిన తర్వాత కొట్టిన తర్వాత గాయాలపై కారం చల్లుతున్నారని బాలుడు రాహుల్ కన్నీళ్లు పెట్టుకున్నాడు.
వివరాల్లోకి వెళ్తే.. అభం శుభం తెలియని ఆ బాలుడి పట్ల కన్న తండ్రే కర్కశుడయ్యాడు. కుమారుడిపై ప్రేమ, ఆప్యాయతలు చూపకపోగా నిత్యం ఏదో కారణంగా చిత్రహింసలకు గురిచేస్తూ నాన్న అనే పదానికే తలవంపులు తెచ్చాడు. విచక్షణ మరిచి దాష్టీకం ప్రదర్శించడంతో ఆ బాలుడు విలవిల్లాడాడు. పెంచిన పిల్లలపై దారుణంగా వ్యవహరించాడు పవన్ అనే వ్యక్తి. మొదటి భర్తతో విభేదాల కారణంగా భర్తకు దూరంగా ఉంటుంది పిల్లల తల్లి శశి.
జంగారెడ్డి గూడెంలో నివాసముంటున్న శశికి పవన్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. దీంతో ఆమె, పిల్లలు అతడితో కలిసి జీవిస్తున్నారు. శనివారం రాత్రి శశి పిల్లలు ఉదయ్ కుమార్, రేణుకలని విచక్షణా రహితంగా చితకబాదాడు పవన్. స్థానికులు అడ్డుకుని చికిత్స కోసం జంగారెడ్డి గూడెం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు.
జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన పవన్, శశిలు భార్యాభర్తలు వీరికి కుమారుడు ఉదయ్ రాహుల్, కుమార్తె రేణుక ఉన్నారు. కొంత కాలంగా తండ్రి పవన్ తనను చిత్రహింసలకు గురిచేస్తున్నాడని, రాత్రి ఫోన్ ఛార్జర్ తీగతో కొట్టాడని ఉదయ్ తెలిపాడు.
Also Read: ఆ రైతుకి అదే చివరి ప్రయాణం.. ఆర్టీసీ బస్సులో కుప్పకూలి మరణించిన వైనం..
చిత్రహింసలకు గురి చేస్తున్న బాలుడిని స్థానికులు రక్షించి జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఒంటి నిండా గాయాలను చూసి వైద్యులు, సిబ్బంది నిర్ఘాంతపోయారు. తనను, చెల్లిని కొడుతుంటే తమ తల్లి చూస్తూ మౌనంగా ఉందని, అసలు ఎందుకు కొడుతున్నారో తెలియడం లేదనీ వాపోయాడు. దెబ్బలపై కారం సైతం పూయడంతో పాటు కారం తినిపిస్తున్నాడంటూ ఉదయ్ రాహుల్ వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. అయితే రాహుల్ అనే బాలుడుకు పవన్ మారు తండ్రి అని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాహుల్ ను గత కొంతకాలంగా విచక్షణారహితంగా దాడికి పాల్పడుతున్నాడు.