Sam CS – Pushpa 2 : ‘పుష్ప 2’ (Pushpa 2) మూవీ రిలీజ్ కు కేవలం మరికొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉంది. ఈ క్రమంలోనే తాజాగా యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ శ్యామ్ సిఎస్ (Sam CS) ‘పుష్ప 2’ (Pushpa 2) మేకర్స్ ని ఇరకాటంలో పడేసే ట్వీట్ ఒకటి చేశాడు. మరి ఆ ట్వీట్లో ఏముంది? ఇప్పటికే వరుసగా సమస్యలను ఎదుర్కొంటున్న పుష్ప టీంకు ఈ ట్వీట్ వల్ల ఎదురు కాబోతున్న మరో సమస్య ఏంటి? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.
‘పుష్ప 2’ సినిమా మ్యూజిక్ విషయంలో మొదటి నుంచి మేకర్స్ కు సమస్యలు ఎదురవుతూనే ఉన్నాయి. ముందుగా దేవి శ్రీ ప్రసాద్ అందించిన బీజీఎంతో సుకుమార్ సాటిస్ఫై అవ్వలేదని వార్తలు వచ్చాయి. అందుకే ఆయన ఇచ్చిన బిజీఎంని పక్కన పెట్టగా, తమన్, అజనీష్, శ్యామ్ సీఎస్ (Sam CS) ‘పుష్ప 2’ ఆ బాధ్యతను తీసుకున్నారని టాక్ నడిచింది. ఓ వైరల్ వీడియోలో స్వయంగా తమన్ ‘పుష్ప 2’ లో ఫస్ట్ హాఫ్ కు తను అందించిన బిజిఎం హైలైట్ గా ఉంటుందని కామెంట్స్ చేశారు. ఇక వీరిద్దరు సరిపోరు అన్నట్టుగా ‘పుష్ప 2’ సినిమాకి శ్యామ్ సీఎస్ కూడా కొన్ని సన్నివేశాలకి మ్యూజిక్ అందించారని అన్నారు. అయితే ఈ సినిమాలో దేవిశ్రీ ప్రసాద్ కేవలం పాటలకు మాత్రమే పరిమితం అయ్యాడని, ఇక తమన్, శ్యామ్, అజనీష్ బిజీఎం అందించారని పుకార్లు షికార్లు చేశాయి.
ముఖ్యంగా సినిమాలో హైలైట్ గా నిలవబోతోంది జాతర సీక్వెన్స్. రీసెంట్ గా ‘పుష్ప 2’ ఈవెంట్లో దేవి శ్రీ ప్రసాద్ తన అసహనాన్ని వ్యక్తం చేశారు. ‘క్రెడిట్ ఎవ్వరూ ఇవ్వరు… అడిగి తీసుకోవాలి’ అంటూ ఆయన చేసిన కామెంట్స్ సెన్సేషనల్ గా మారాయి. ఆ తర్వాత నుంచి ప్రతి వేదికపై మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) పేరును ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ వస్తున్నారు చిత్ర బృందం. నిన్న జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో అల్లు అర్జున్ కూడా స్పెషల్ గా దేవిశ్రీ ప్రసాద్ ని అభినందించారు. కానీ ఈ సినిమాకు బిజిఎం అందించారు అంటూ వార్తలు వినిపిస్తున్న శ్యామ్ సిఎస్ పేరును మాత్రం ఎక్కడా ప్రస్తావించలేదు. దీంతో ‘పుష్ప 2’ మ్యూజిక్, బీజిఎం క్రెడిట్ మొత్తం దేవిశ్రీ ప్రసాద్ కి చెందినట్టుగా అయింది. దీంతో ఈ మూవీ మ్యూజిక్ వివాదం సద్దుమణిగినట్టేనని అంతా భావించారు.
ఈ నేపథ్యంలోనే తాజాగా శ్యామ్ (Sam CS) ఎక్స్ లో ఓ పోస్ట్ చేసి బాంబ్ పేల్చాడు. అందులో జాతర సీక్వెన్స్ కి బిజిఎం అందించే అద్భుతమైన అవకాశం తనకు కల్పించినందుకు ‘పుష్ప 2’ నిర్మాతలు, మేకర్స్ కి థాంక్స్ చెప్తూ రాసుకొచ్చాడు. కానీ అసలు ఆయన జాతర సీనుకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడా? లేదంటే సినిమాలో కొన్ని సీన్లకు మాత్రమే బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అందించాడా ? అనేది చాలామందికి ఉన్న డౌట్. అయితే ఇప్పుడు డైరెక్ట్ గా జాతర సీన్ కు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేసినట్టు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం హాట్ టాపిక్ గా మారింది.
ఎందుకంటే ఇప్పటిదాకా “పుష్ప 2” (Pushpa 2) టీంలో ఒక్కరు కూడా ఆయన గురించి ఎక్కడా అఫీషియల్ గా మాట్లాడలేదు. పైగా నిన్న సుకుమార్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికపై మాట్లాడుతూ దేవి శ్రీ ప్రసాద్ ను ఉద్దేశించి ‘క్లైమాక్స్ ను నీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లావు’ అని క్లియర్ గా చెప్పాడు. ఆ తర్వాతే శ్యామ్ ఇలా పోస్ట్ చేయడం మరిన్ని అనుమానాలకు దారి తీసింది.