Samantha: ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha )ఈ మధ్యకాలంలో నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా వుంటోంది. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా తన ఇన్స్టాగ్రామ్ ఖాతా వేదికగా ఒక ఆసక్తికర పద్యాన్ని షేర్ చేసింది సమంత. ఇంతకీ సమంత పోస్ట్ చేసిన ఆ పద్యం యొక్క అర్థం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఎన్నో విమర్శలు ఎదుర్కొన్న సమంత..
సమంత అందం, అభినయంతోనే కాకుండా వ్యక్తిగత క్యారెక్టర్ తో కూడా ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. ముఖ్యంగా నాగచైతన్య (Naga Chaitanya) నుంచి విడాకులు తీసుకున్న తర్వాత మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి బారిన పడి ఎంతో ఇబ్బంది ఎదుర్కొంది. ముఖ్యంగా జీవితంలో కఠినమైన సంఘటనలను ఎంతో ధైర్యంగా ఎదుర్కొన్న సమంత ఎందరికో ఆదర్శమని చెప్పవచ్చు. ఇక తనను తాను బలంగా మార్చుకుంటూ ముందుకు సాగుతోంది. మయోసైటిస్ తర్వాత సినిమాలను బాగా తగ్గించిన సమంత ఇటీవలే ‘సిటాడెల్- హనీ బన్నీ’ వెబ్ సిరీస్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇందులో యాక్షన్ సన్నివేశాలలో నటించి మెప్పించింది.
విమర్శకులకు గట్టి కౌంటర్..
ఇకపోతే తాజాగా సోషల్ మీడియాలో ఒక పద్యాన్ని పంచుకుంది. ఈ పద్యం నాకెప్పుడు మార్గదర్శకంగా ఉంది. అందుకే ఈరోజు ఈ పద్యాన్ని నేను మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను అంటూ అభిమానులతో పంచుకున్నారు సమంత. ఇంతకీ ఆ పద్యం అర్థం ఏమిటంటే..” మీరు రిస్క్ తో ఏదైనా కొత్త పని చేసి ఓడిపోతే, మళ్ళీ ప్రయాణాన్ని సరికొత్తగా మొదలుపెట్టాలి. అంతేకానీ ఆ ఓటమి గురించే ఆలోచిస్తూ ఉండకూడదు. మనల్ని మనం మరింత స్ట్రాంగ్ గా చేసుకొని, ఇంకా ధైర్యంగా ముందుకు వెళ్లాలి. మీ దగ్గర ఏం లేకపోయినా సరే సంకల్పాన్ని గట్టిగా పట్టుకోండి. అప్పుడు మనల్ని నిందించే వారికి సరైన సమాధానం చెప్పవచ్చు” అంటూ అర్థం వచ్చేలా ఒక పద్యం షేర్ చేసింది సమంత. ప్రస్తుతం సమంత షేర్ చేసిన ఈ పోస్ట్ చాలా వైరల్ గా మారుతుంది.
సమంతకు అండగా నెటిజన్స్..
ఇకపోతే ఈ పోస్ట్ చూసిన అభిమానులు సమంతాకు అండగా నిలుస్తున్నారు. ఇక సమంత కెరియర్ విషయానికి వస్తే.. సిటాడెల్ వెబ్ సిరీస్ తో యాక్షన్ పర్ఫామెన్స్ తో విపరీతంగా ఆకట్టుకుంది. అంతేకాదు ఈ సినిమాలో వరుణ్ ధావన్ (Varun Dhawan) కీలకపాత్ర పోషించారు. అంతేకాదు ఇతడితో లిప్ లాక్ సన్నివేశాలలో రెచ్చిపోయి మరీ నటించింది సమంత. ఇకపోతే సమంత మరోవైపు నిర్మాణ సంస్థను స్థాపించి ‘మా ఇంటి బంగారం’ అనే సినిమాను నిర్మిస్తోంది. అందులో హీరోయిన్ గా నటిస్తోంది కూడా. ఇక నిన్నటిగా భారీ పాపులారిటీ సంపాదించుకున్న ఈమె ఇప్పుడు నిర్మాతగా కూడా తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి సిద్ధం అయ్యింది. ఇక అలాగే సమంత ఐటమ్ సాంగ్స్ లో కూడా నటించి మెప్పించింది. సుకుమార్(Sukumar )-అల్లు అర్జున్ (Allu Arjun)కాంబినేషన్ లో వచ్చిన పుష్ప(Pushpa ) సినిమాలో సమంత మొదటిసారి ఐటమ్ సాంగ్ చేసి ఆకట్టుకుంది. ఇకపోతే వివాహం జరిగి విడాకుల తర్వాత సమంత ఐటమ్ సాంగ్ చేయడంతో అప్పుడు కూడా ఎన్నో విమర్శలు ఎదుర్కొంది.