BigTV English

Allu Arjun: ఎన్ని వివాదాలు వచ్చినా వైసీపీ ఫ్రెండ్ ను వదులుకొని బన్నీ.. అదిరా ఐకాన్ స్టార్ అంటే..?

Allu Arjun: ఎన్ని వివాదాలు వచ్చినా వైసీపీ ఫ్రెండ్ ను వదులుకొని బన్నీ.. అదిరా ఐకాన్ స్టార్ అంటే..?

Allu Arjun: ఎన్ని కష్టాలు వచ్చినా.. ఎన్ని బాధలు ఎదురైనా స్నేహాన్ని వదులుకోకూడదు అని అంటారు. ఈ మాటను అక్షరాలా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నిజం చేస్తున్నాడు. ఈ ఏడాది అల్లు అర్జున్ జీవితంలో ఎన్నో వివాదాలను ఆయన ఎదుర్కున్నాడు. అందులో ముఖ్యమైనది..ఎన్నికల సమయంలో బన్నీ.. వైసీపీ నేత అయిన శిల్పా రవి రెడ్డి ఇంటికి వెళ్లడం, వారింట్లో ఆతిథ్యం స్వీకరించడం పెను సంచలనాన్ని సృష్టించింది. సొంత కుటుంబ సభ్యుడు అయిన పవన్ కళ్యాణ్ కు సపోర్ట్ చేయకుండా.. ఆయనకు వ్యతిరేకంగా ఉన్న పార్టీకి అల్లు అర్జున్ ప్రచారం చేయడం పెద్ద దుమారాన్ని రేపింది.


ఇక ఎప్పటి నుంచో మెగా – అల్లు కుటుంబాల మధ్య ఉన్న విభేదాలు ఈ ఒక్క సంఘటనతో నిజమని రుజువు చేసినట్లు అయ్యింది. ఒక పక్క  పిఠాపురానికి రామ్ చరణ్.. పవన్ తరుపున ప్రచారానికి వెళ్తున్న సమయంలోనే బన్నీ.. శిల్పా రవి రెడ్డి ఇంటికి వెళ్లడం మరింత చర్చనీయాంశంగా మారింది. శిల్పా రవిరెడ్డి.. బన్నీ భార్య స్నేహరెడ్డి ఫ్రెండ్ భర్త. అలా వీరి మధ్య ఫ్రెండ్షిప్ ఏర్పడింది. ఒకానొక సమయంలో శిల్పా రవిరెడ్డికి బన్నీ మాట ఇవ్వడం జరిగింది. ఆయన ఎన్నికల్లో గెలవాలని కోరుకుంటున్నానని, దానికోసం తనవంతు ప్రయత్నంగా ఏదైనా చేస్తానని బన్నీ చెప్పుకొచ్చాడు.

BB Telugu 8: డేంజర్ జోన్ లో బెస్ట్ ఫ్రెండ్స్.. దెబ్బేసిన మాజీ కంటెస్టెంట్స్..!


ఇక ఆ మాటను నిలబెట్టుకోవడానికే.. బన్నీ, శిల్పా రవిరెడ్డి ఇంటికి వెళ్ళాడు. ఈ విషయాన్నీ అల్లు అర్జున్ ఎన్నోసార్లు చెప్పాడు. ఒక ఫ్రెండ్ గా ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి మాత్రమే తాను వారింటికి వెళ్లానని, తన సపోర్ట్ ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఉంటుందని కూడా చెప్పుకొచ్చాడు. కానీ, బన్నీ చేసింది మాత్రం కచ్చితంగా తప్పేనని నెటిజన్స్ ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. ఈ సంఘటన వలన మెగా – అల్లు కుటుంబాలే కాదు.. ఫ్యాన్స్ కూడా రెండుగా చీలి పోయారు.

తన కెరీర్ లో ఇప్పటివరకు లేని నెగెటివిటీని బన్నీ చూసాడు. విపరీతమైన ట్రోలింగ్..  మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ అయితే ఏకంగా తన సోషల్ మీడియా అకౌంట్స్ నుంచి బన్నీని తొలగించాడు కూడా. రాజకీయ పరంగా కాకుండా కేవలం ఒక ఫ్రెండ్ గా మాత్రం వెళ్లానని, ఒకసారి నా అనుకుంటే.. వారికి ఏ కష్టం వచ్చినా వదిలిపెట్టను అని బన్నీ తెగేసి చెప్పాడు. సాధారణంగా ఎవరైనా ఇంత నెగెటివిటీ చూసాక.. కొన్నిరోజులు వారికి దూరంగా ఉండడమో.. లేక సైలెంట్ గా ఫ్రెండ్షిప్ ను మెయింటైన్ చేయడమో చేస్తారు. కానీ, బన్నీకి అది అలవాటు లేదు. ఏదైనా తగ్గేదేలే అని అనడమే.

Shiva Jyothi : నోరు జారిన బిగ్ బాస్ బ్యూటీ.. ప్రభాస్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ మధ్య వార్..!

తాజాగా శిల్పా రవిరెడ్డి.. పుష్ప 2 సినిమాకు అల్ ది బెస్ట్ చెప్తూ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా.. దానికి బన్నీ రిప్లై ఇవ్వడం మరింత సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. పుష్ప 2 ప్రమోషన్స్ కోసం  అన్ని వాణిజ్య ప్రకటనలతో మేకర్స్ ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెల్సిందే. బిస్కెట్ ప్యాకెట్స్, చిప్స్ ప్యాకెట్స్, క్రాకర్స్, అగరబత్తీలు.. ఇలా ప్రతిదాని మీద పుష్ప రాజ్ దర్శనమిస్తున్నాడు. వాటిని షేర్ చేస్తూ శిల్పా రవి రెడ్డి.. పుష్ప 2 కోసం వేచి ఉండలేకపోతున్నాం అంటూ రాసుకొచ్చాడు.

దానికి బన్నీ ”  థాంక్యూ బ్రదర్.. మీ ప్రేమకు థాంక్యూ” అని రాసుకొచ్చాడు. ఇక ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. ఈ పోస్ట్ చూసిన అభిమానులు వివాదాలు వచ్చాయని, నెగెటివిటీ వచ్చిందని ఫ్రెండ్షిప్ ను వదులుకొని రకం కాదు.. అదిరా ఐకాన్ స్టార్ అంటే అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×