Samantha.. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) చాలా రోజులు విరామం తీసుకుని ఇప్పుడు సిటాడెల్ – హనీ బన్నీ వెబ్ సిరీస్ తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సిరీస్ నవంబర్ 7వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ (Varun Dhawan) ఈ సినిమాలో హీరోగా నటించారు. రాజ్ అండ్ డీకే (Raj and DK) దర్శకత్వం వహించిన ఈ సీరీస్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఇందులో వరుణ్ ధావన్, సమంత యాక్టింగ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నా.. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ పలు విమర్శలకు దారి తీసిందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇందులో ఘాటైన లిప్ లాక్ సన్నివేశాలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. సమంత నుంచి ఇలాంటి సన్నివేశాలు ఊహించనివి అంటూ కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.
యాక్షన్ సీక్వెన్స్ తో అదరగొట్టిన నయనతార..
ఇకపోతే స్పై యాక్షన్ థ్రిల్లర్ డ్రామాగా వచ్చిన ఈ కథాంశం లో ఊహించని ట్విస్టులు , అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్ తో ఈ సిరీస్ జనాలను విపరీతంగా కట్టిపడేస్తోంది. సమంత ఇలాంటి డైనమిక్ పాత్రలో నటించడం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇకపోతే ఈ వెబ్ సిరీస్ కోసం సమంత తీసుకున్న పారితోషకం అందరినీ ఆశ్చర్యపరుస్తోందని చెప్పవచ్చు. ఈమె సౌత్ లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న నయనతార (Nayanatara) రెమ్యూనరేషన్ తో పోటీ పడడం ఇక్కడ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
రెమ్యునరేషన్ విషయంలో నయనతారతో పోటీ..
సౌత్ సినీ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న నయనతార మాత్రమే ఒక్కో సినిమాకు రూ.10 కోట్ల రేంజ్ లో పారితోషకం తీసుకుంటూ బాలీవుడ్ హీరోయిన్స్ తో పోటీ పడుతోంది. ఇప్పుడు అలాంటి ఈమెతో సమంత పోటీపడి మరీ పారితోషకం తీసుకోవడం నిజంగా ఆశ్చర్యకరం అని చెప్పాలి. తాజాగా సమంత నటించిన సిటాడెల్ – హనీ బన్నీలో తన పాత్ర కోసం ఏకంగా రూ.10 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం. ఇకపోతే ఈ పారితోషకం ఇప్పటివరకు ఇండియన్ వెబ్ సిరీస్ లలో అత్యధిక పారితోషకం కావడం గమనార్హం.
సిటాడెల్ కోసం రూ.10 కోట్లు..
గతంలో ఫ్యామిలీ మెన్ లో కూడా సమంత యాక్షన్ సన్నివేశాలలో అదరగొట్టింది. అలాగే పుష్ప (Pushpa) చిత్రంలో ఊ అంటావా అనే స్పెషల్ సాంగ్ చేసి రూ.5 కోట్లు పారితోషకం తీసుకుందని సమాచారం. ఇక ఇప్పుడు ఏకంగా రూ.10 కోట్లు తీసుకొని నయనతారతో పోటీ పడడంతో అందరూ సమంత డిమాండ్ భారీగా పెరిగిపోయింది అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక సమంత విషయానికి వస్తే.. నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈమె, నటించిన వివాహం జరిగిన నాలుగేళ్లకే విడిపోయింది. విడాకుల సమయంలో సమంత పై ఎన్నో రూమర్స్ వినిపించాయి. దీనికి తోడు మయోసైటిస్ అనే వ్యాధి బారిన పడి డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది. అలా ఈ బాధ నుండి బయటపడడానికి దాదాపు ఏడాది పాటు విరామం తీసుకున్న ఈమె ఇప్పుడు మళ్లీ వెబ్ సిరీస్ తో ప్రేక్షకులు ముందుకు వచ్చింది. అలాగే నిర్మాతగా మారి “మా ఇంటి బంగారం” అనే సినిమా కూడా నిర్మిస్తోంది సమంత. ఈ సినిమా సక్సెస్ అయితే నిర్మాతగా సమంత సక్సెస్ అయినట్టే అని చెప్పవచ్చు. ఇకపోతే వెబ్ సిరీస్ కి ఈ రేంజ్ లో తీసుకుందంటే.. సినిమాల కోసం ఇంకెంత తీసుకుంటుందో అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.