Ponnam prabhakar: కులగణనకు బీజీపీ అనుకూలమో కాదో ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ చెప్పాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. దేశవ్యాప్తంగా సర్వే చేసేందుకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తారో? లేదో చెప్పాలని నిలదీశారు. మీడియా సమావేశంలో పొన్నం మాట్లాడుతూ… ఎన్నికల కోసం కులగణన చేస్తున్నారని విమర్శిస్తున్నారని, సర్వే అడ్డుకోవాలని చూస్తే లక్ష్మణ్ ద్రోహిగా మిగిలిపోతారని హెచ్చరించారు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు అమలు చేయాలా? వద్దా అని మండిపడ్డారు.
Also read: ఏపీకి నంబర్ వన్ బ్రాండ్ తీసుకొస్తాం: చంద్రబాబు
బీజేపీ ఎన్నికల్లో పూర్తిగా మతం రంగును పూసుకుందని విమర్శించారు. బీజేపీ ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మైనారిటీలకు వ్యతిరేకమని అన్నారు. ప్రజలు బీజేపీ నేతల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాజస్థాన్ ఓ రిజర్వేషన్ అమలు చేస్తుంటే హేమంత్ సోరెన్ ను అరెస్ట్ చేశారని తెలిపారు. వీపీ సింగ్ రిజర్వేషన్లు తీసుకువస్తే కమండలం పేరు మీద పదవిని ఊడబీకారని అన్నారు. బలహీన వర్గాలకు చెందిన మోడీ, వారు అనుచరుల కోసం పదేళ్లలో ఏమైనా చేశారా? అని ప్రశ్నించారు.
రాష్ట్రంలో బీజేపీ బీసీని సీఎంగా చేస్తామని బీసీ అధ్యక్షుడిని తీసేసిందని ఎద్దేవా చేశారు. అందరి అభిప్రాయం తీసుకున్న తరవాతనే కులగణన చేస్తున్నామని తెలిపారు. బీజేపీ కులగణనకు అడ్డుపడాలని ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ప్రభుత్వం ఏ డాక్యుమెంట్ అడగట్లేదని, సమాచారాన్ని ప్రభుత్వం గోప్యంగా ఉంచుతుందని చెప్పారు. బీఆర్ఎస్ చేయలేకపోయిందే తాము చేస్తున్నామని అన్నారు. మూసీ పునరుజ్జీవం కోసమే సీఎం రేవంత్ రెడ్డి కష్టపడుతున్నారని అన్నారు. మూసీ ప్రజల కష్టాలు తీర్చడం కోసమే తాపత్రేయమని చెప్పారు.