E-Paper
Advertisement

Samantha on Yashoda Success : గాల్లో తేలుతున్న‌ట్లుంది.. స‌మంత ఎమోష‌న‌ల్ పోస్ట్

Samantha on Yashoda Success : గాల్లో తేలుతున్న‌ట్లుంది.. స‌మంత ఎమోష‌న‌ల్ పోస్ట్
Advertisement

Samantha on Yashoda Success : మియో సైటిస్‌తో బాధ‌ప‌డుతున్న స్టార్ హీరోయిన్ సమంత ట్రీట్‌మెంట్ తీసుకుంటుంది. క్లిష్ట ప‌రిస్థితుల్లో ఉన్నాన‌ని త‌న ఆరోగ్య ప‌రిస్థితి గురించి రీసెంట్ ఇంట‌ర్వ్యూలో స‌మంత తెలియ‌జేసిన సంగ‌తి తెలిసిందే. ఇంత ట‌ఫ్ సిట్యువేష‌న్స్‌లోనూ ఆమె త‌న లేటెస్ట్ మూవీ య‌శోద టీమ్‌ను ఎప్ప‌టిక‌ప్పుడు ఫాలో అవుతూనే ఉంది. ఆ సినిమా స‌క్సెస్ గురించి త‌న అభిప్రాయాల‌ను తెలియ‌జేస్తూనే ఉంది. తాజాగా మ‌రోసారి య‌శోద స‌క్సెస్‌పై స‌మంత రియాక్ట్ అయ్యింది. ఆమె చేసిన ఎమోష‌న‌ల్ పోస్ట్ నెట్టింట తెగ వైర‌ల్ అవుతుంది.

‘‘‘యశోద’ సినిమాపై మీరు చూపిస్తున్న ఆద‌ర‌ణ‌ను మ‌ర‌చిపోలేను. మీ ప్రేమాభిమానాలు, ఆద‌ర‌ణ దొర‌క‌టం గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. సినిమాకు వ‌స్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది. సినిమా గురించి మీరు చెప్పిన మాట‌లు, థియేట‌ర్స్ నుంచి వ‌స్తున్న రెస్పాన్స్ చూశాను. ఈ సినిమా కోసం సినిమా యూనిట్ ప‌డ్డ క‌ష్టం గుర్తుకు వ‌స్తుంది. అవ‌న్నీ చూస్తుంటే మ‌నసు గాల్లో తేలిపోతుంది. చిత్ర నిర్మాత శివ‌లెంక కృష్ణ ప్ర‌సాద్‌గారికి, డైరెక్ట‌ర్స్ హ‌రి, హ‌రీష్‌, ఉన్ని ముకుంద‌న్‌, వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ స‌హా సినిమాలో భాగ‌మైన ప్ర‌తీ ఒక్కరికీ థాంక్స్‌’’ అని ఎమోష‌న‌ల్ పోస్ట్‌ను ట్వీట్ చేసింది స‌మంత‌.

Advertisement

‘యశోద’ చిత్రం న‌వంబ‌ర్ 11న రిలీజైంది. పాన్ ఇండియా మూవీగా వ‌చ్చిన ఈ సినిమా ఇప్ప‌టి వ‌ర‌కు రూ.25 కోట్ల‌ను వ‌సూలు చేసింది. హ‌రి, హ‌రీష్ ద‌ర్శ‌క‌త్వంలో శ్రీదేవి మూవీస్ బ్యాన‌ర్‌పై శివ‌లెంక కృష్ణ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి మ‌ణిశ‌ర్మ సంగీతాన్ని అందించ‌గా సుకుమార‌న్ సినిమాటోగ్ర‌ఫీ చేశారు. పుల‌గం చిన్నారాయ‌ణ‌, డా.చ‌ల్లా బాగ్య‌ల‌క్ష్మి ఈ సినిమాకు మాట‌ల‌ను రాశారు.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×