E-Paper
Advertisement

Poland players Escort Security : పోలాండ్ క్రీడాకారులకు 2 యుద్ధ విమానాలతో సెక్యూరిటీ..

Poland players Escort Security : పోలాండ్ క్రీడాకారులకు 2 యుద్ధ విమానాలతో సెక్యూరిటీ..
Advertisement

Poland Players Escort Security : పోలాండ్ తమ దేశ ఆటగాళ్లు ప్రయాణించే విమానానికి సెక్యూరిటీగా మరో రెండు విమానాలను పంపించింది. రెండు యుద్ధ విమానాలతో ఎస్కార్ట్ కల్పించింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం జరుగుతుండడం, ఆ రెండు దేశాలు తమ పక్కనే ఉండడంతో ముందుజాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకుంది.

ఖతార్‌లో ఫిఫా వరల్డ్ కప్ పోటీలలో పోలాండ్ ఫుట్ బాల్ టీమ్ కూడా పాల్గొంటోంది. అయితే, ఖతార్ వెళ్లాలంటే రష్యా, ఉక్రెయిన్ దేశాల గగనతలం నుంచి విమానం ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఆ రెండు దేశాల మధ్య తీవ్ర యుద్ధం జరుగుతున్న క్రమంలో తమ విమానంపై క్షిపణి దాడి జరిగే ప్రమాదం ఉందని పోలాండ్ ఆటగాళ్లు ఆందోళన వ్యక్తం చేశారు.

Advertisement

ఉక్రెయిన్ సరిహద్దుల్లోని పోలాండ్ గ్రామంలో ఇటీవల క్షిపణి పడిన నేపథ్యంలో ఆటగాళ్లతో పాటు వాళ్ల అభిమానులు కూడా ఆందోళన చెందుతున్నారు. దీంతో పోలాండ్ ఫుట్ బాల్ టీమ్ ప్రయాణించే విమానానికి ఎఫ్-16 యుద్ధ విమానాలను పోలాండ్ ప్రభుత్వం ఎస్కార్ట్ గా పంపించింది. ఆకాశంలో తమ విమానానికి తోడుగా వస్తున్న యుద్ధ విమానాలను ఆటగాళ్లు వీడియో తీశారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పెట్టి, యుద్ధ విమానాల పైలట్లకు కృతజ్ఞతలు తెలిపారు.

Tags

Related News

తగలబడిన పెర్రీ.. ఐదుగురు మృతి, 80 మంది మిస్సింగ్, ఫిలిప్పిన్స్‌‌లో ఘోరం

ప్రపంచ అధినేతల జీతాల లిస్ట్ ఇదే, సింగపూర్ ప్రధాని సాలరీ చూస్తే నోరెళ్లబెడతారు!

అమ్మబాబోయ్.. నూడుల్స్‌లో బతికున్న ఎలుక పిల్ల.. రెస్టారెంట్‌పై కేసు నమోదు!

నేపాల్‌లో ఆకస్మిక వరదలు.. మానవుల మూత్రం వల్ల అతిపెద్ద ముప్పు? పరిశోధనలో కొత్త విషయాలు

మిస్‌‌ వరల్డ్‌‌-2026 పోటీలు.. జోహెరి మెలాకు ప్రపంచ సుందరి కిరీటం, వియత్నాంలో అంగరంగ..

వివాహంలో భారీ అగ్నిప్రమాదం.. స్పాట్‌లో 22 మంది మృతి, కాంగోలో ఘటన

ఆఫ్రికా పెరిగింది, అమెరికా అలిగింది.. కొత్త ప్రపంచ పటానికి UN ఆమోదం

నేపాల్‌పై ప్రకృతి కన్నెర్ర.. భారీగా విరిగిన కొండచరియలు, నది ప్రవాహానికి అంతరాయం

Big Stories

Advertisement
×