BigTV English

Samantha: నాగచైతన్య కోసం అనవసరమైన ఖర్చులు పెట్టాను, అవన్నీ యూజ్‌లెస్.. సమంత కామెంట్స్

Samantha: నాగచైతన్య కోసం అనవసరమైన ఖర్చులు పెట్టాను, అవన్నీ యూజ్‌లెస్.. సమంత కామెంట్స్

Samantha: మామూలుగా సినీ పరిశ్రమలో ప్రేమించి పెళ్లి చేసుకునే హీరోహీరోయిన్ల సంఖ్య చాలా తక్కువ. బాలీవుడ్‌లో ఇలాంటి జంటలు చాలానే ఉన్నా.. టాలీవుడ్‌లో మాత్రం ఇలాంటి పెళ్లిళ్లు జరగడం చాలా అరుదు. అందుకే నాగచైతన్య, సమంత ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారని తెలిసినప్పుడు ఫ్యాన్స్ అంతా చాలా ఎగ్జైట్ అయ్యారు. ఈ కపుల్ ఆన్ స్క్రీన్ చాలా బాగుంటుంది కాబట్టి ఆఫ్ స్క్రీన్ కూడా వీరి లైఫ్ చాలా బాగుంటుందని ఆశించారు. కానీ అలా జరగలేదు. నాలుగేళ్లలోనే వీరి విడాకులు అయిపోయాయి. అప్పటినుండి ఒకరు గురించి మరొకరు మాట్లాడడానికి ఇష్టపడలేదు. అలాంటిది నాగచైతన్య గురించి తాజాగా ఒక షాకింగ్ స్టేట్‌మెంట్ ఇచ్చింది సామ్.


ప్రమోషన్స్‌లో భాగంగా

విడాకుల తర్వాత సమంత పర్సనల్ లైఫ్ మాత్రమే కాదు.. ప్రొఫెషనల్ లైఫ్ కూడా చాలా స్లో అయిపోయింది. అలాంటిది ఒక మంచి యాక్షన్ సిరీస్‌తో తాను స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇవ్వడానికి సిద్ధమయ్యింది. అదే ‘సిటాడెల్ హనీ బన్నీ’. రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ కొన్నిరోజుల క్రితం అమెజాన్ ప్రైమ్‌లో విడుదలయ్యింది. ఇందులో సమంత యాక్టింగ్‌కు, యాక్షన్‌కు మంచి మార్కులే పడ్డాయి. ఇంకా ఈ సిరీస్‌ను ఎక్కువమంది ప్రేక్షకులకు రీచ్ అయ్యేలా చేయడం కోసం హీరో వరుణ్ ధావన్‌తో కలిసి ప్రమోషన్స్ చేస్తూనే ఉంది సామ్. అందులో భాగంగానే వీరిద్దరూ ఒక ర్యాపిడ్ ఫైర్‌లో పాల్గొన్నారు. అందులో నాగచైతన్య గురించి ఒక స్టేట్‌మెంట్ ఇచ్చి అందరినీ షాక్‌కు గురిచేసింది.


Also Read: ఇతర ఇండస్ట్రీలతో పోలిస్తే మలయాళంలో మహిళలకు సేఫ్టీ తక్కువ.. సుహాసిని షాకింగ్ కామెంట్స్

చాలానే ఖర్చుపెట్టాను

‘‘ఏ యూజ్‌లెస్ విషయంపై అత్యధిక మొత్తంలో డబ్బు ఖర్చు చేశావు’’ అంటూ సమంతను అడిగాడు వరుణ్ ధావన్. ‘‘నా ఎక్స్ ఖరీదైన గిఫ్ట్స్ మీద చాలా ఖర్చు చేశాను’’ అని ఓపెన్‌గా చెప్పేసింది సమంత. ఎంత అని అడగగా.. చాలానే అంటూ నవ్వింది. దీంతో సామ్ ఇలాంటి సమాధానం చెప్తుందని ఊహించిన ఫ్యాన్స్ అంతా తెగ షాకవుతున్నారు. నాగచైతన్యకు కార్స్ అంటే చాలా ఇష్టం. తన దగ్గర మంచి స్పోర్ట్స్ కలెక్షన్ కూడా ఉంది. అయితే సమంత కూడా వీటికి సంబంధించి చైతూకు చాలా గిఫ్ట్స్ ఇచ్చిందేమో అని, అందుకే ఇలా చెప్పిందేమో అని ప్రేక్షకులు చర్చించుకుంటున్నారు. ఎంతైనా తను అలా చెప్పడం కరెక్ట్ కాదని మరికొందరు వాదిస్తున్నారు.

అప్పటినుండే ఇదంతా

సమంత (Samantha), నాగచైతన్య (Naga Chaitanya) విడాకులు అయ్యి రెండేళ్లు అయిపోయింది. అప్పటినుండి ఇప్పటివరకు వీరిద్దరూ పెద్దగా ఒకరి గురించి ఒకరు మాట్లాడడానికి ఇష్టపడలేదు. పర్సనల్ లైఫ్ గురించి ప్రశ్నలు ఎదురైనా సమాధానం చెప్పకుండా పక్కన పెట్టేస్తూ వచ్చారు. ఇప్పటికీ అసలు వీరి విడాకులకు కారణమేంటి అని ఓపెన్‌గా చెప్పలేదు ఈ జంట. అయినా ఇంతలోనే మరొక హీరోయిన్ అయిన శోభితాను ఎంగేజ్‌మెంట్ చేసుకొని అందరినీ షాక్‌కు గురిచేశాడు చైతూ. అప్పటినుండి సమంత కూడా ఇన్‌డైరెక్ట్‌గా సోషల్ మీడియాలో పోస్టులు షేర్ చేయడం, సందర్బం వచ్చిన ప్రతీసారి ఎక్స్ ప్రస్తావన తీసుకురావడం చేస్తోంది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×