BigTV English

Hair Fall Control: వీటిని వాడితే.. జుట్టు ఊడమన్నా ఊడదు

Hair Fall Control: వీటిని వాడితే.. జుట్టు ఊడమన్నా ఊడదు

Hair Fall Control: ఈ రోజుల్లో, జుట్టు కోసం వివిధ రకాల ఉత్పత్తులు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇవి ఖరీదైనవి అంతే కాకుండా అనేక రసాయనాలను కలిగి ఉంటాయి. అయితే జుట్టుకు సహజసిద్ధంగా పోషణనిచ్చే కొన్ని ఆయుర్వేద పౌడర్లు కూడా ఉన్నాయి. ఆమ్లా, బ్రాహ్మి భృంగరాజ్ వంటి పౌడర్‌లు జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడమే కాకుండా జుట్టును బలంగా, ఒత్తుగా మారుస్తాయి.


ప్రతి అమ్మాయి చాలా అందంగా కనిపించాలని కోరుకుంటుంది. అందుకే రకరకాల స్కిన్ కేర్ టిప్స్ ఫాలో అవుతూ ఉంటారు. ఇదే సమయంలో జుట్టును మందంగా, పొడవుగా బలంగా ఉండటం కోసం రకరకాల హెయిర్ ఆయాల్స్ తో పాటు.. షాంపూలను వాడుతుంటారు. ఈ రోజుల్లో, ఆహారం, కాలుష్యం కారణంగా,జుట్టు రాలడం, జుట్టు పొడిగా మారడంతో పాటు నిర్జీవంగా మారడం సాధారణ సమస్యలుగా మారాయి. ఈ సమస్యల నుంచి బయటపడేందుకు అమ్మాయిలు మార్కెట్ నుంచి అనేక రకాల కెమికల్స్‌తో తయారు ఉత్పత్తులను కొంటున్నారు. వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తుంటాయి. ఇలా జరగకుండా ఉండాలంటే కొన్ని రకాల ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ వాడటం మంచిది. వాటి గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

బృంగరాజ్ పౌడర్:
బృంగరాజ్ జుట్టుకు చాలా మేలు చేస్తుంది. బృంగరాజ్ పొడిని నీళ్లలో, కొబ్బరి నూనెతో కలిపి పేస్ట్‌లా చేసి జుట్టు మూలాలపై అప్లై చేయండి. ఇది జుట్టు మూలాలను బలపరుస్తుంది. దీంతో జుట్టు రాలడం కూడా తగ్గుతుంది.


ఉసిరి పొడి:
ఉసిరికాయ జుట్టుకు చాలా మేలు చేస్తుంది. ఉసిరిలో ఉండే విటమిన్ సి జుట్టు రాలడాన్ని నివారించడంతో పాటు జుట్టును మందంగా చేయడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఉసిరికాయ పొడిని పెరుగు లేదా కొబ్బరి నూనెతో కలిపి జుట్టు మూలాలకు రాసుకుంటే జుట్టు బలంగా పెరుగుతుంది. దీనిని వారానికి ఒకసారి ఉపయోగించవచ్చు.

శీకాకాయ పొడి:
శీకాకాయ జుట్టు మూలాల్లోని మురికిని తొలగించడంలో సహాయపడుతుంది. దీని కారణంగా, జుట్టు వేగంగా పెరుగుతుంది. దీన్ని జుట్టుకు పట్టించడానికి, శీకాకాయ్ పొడిని ఉసిరికాయ, కుంకుడు కాయ పొడిని సమపాళ్లలో తీసుకుని కలపండి. ఇందులో తగినంత నీరు వేసి మిక్స్ చేసి జుట్టుకు అప్లై చేయండి. 30 నిమిషాల తర్వాత తలస్నానం చేయండి. దీనిని తరుచుగా ఉపయోగించడం వల్ల జుట్టుకు సహజమైన మెరుపు వస్తుంది. అంతే కాకుండా జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.

కుంకుడు కాయ పొడి:
కుంకుడు కాయ సహజమైన షాంపూలా పనిచేస్తుంది. దీనిని తరుచుగా ఉపయోగించడం వల్ల జుట్టు బలంగా పెరుగుతుంది. అంతే కాకుండా మృదువుగా మారుతుంది. శీకాకాయ , ఉసిరికాయ పొడిని కలిపి జుట్టుకు రాసుకుంటే జుట్టుకు కొత్త మెరుపు వస్తుంది.

కలబంద పొడి:
అలోవెరా ముఖంతో పాటు జుట్టుకు కూడా మేలు చేస్తుంది. ఇందులో ఉండే విటమిన్లు, ఎంజైమ్‌లు, అమినో యాసిడ్‌లు జుట్టుకు తేమను అందించి, వాటిని చిట్లకుండా కాపాడతాయి. ఇది స్కాల్ప్ ను హైడ్రేట్ చేసి జుట్టును మృదువుగా మార్చుతుంది.

బ్రహ్మి పొడి:
బ్రహ్మి జుట్టు మూలాలకు పోషణ అందించడంతో పాటు స్కాల్ప్ ను చల్లబరుస్తుంది. బ్రహ్మీ పొడిని నీటిలో కరిగించి జుట్టుకు రాసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. ఇది జుట్టు యొక్క తేమను కాపాడుతుంది . అంతే కాకుండా జుట్టు రాలడం వంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది.

Also Read: వీటిని వాడితే.. ఎంతటి తెల్ల జుట్టు అయినా క్షణాల్లోని నల్లగా మారడం ఖాయం

ఈ పొడులన్నీ మీ జుట్టును సహజంగా ఒత్తుగా, పొడవుగా , మెరిసేలా చేస్తాయి. మీరు ఈ ఆయుర్వేద పౌడర్లను హెయిర్ మాస్క్‌లుగా లేదా హెయిర్ ప్యాక్‌లుగా ఉపయోగించవచ్చు. ఈ పొడలను గోరువెచ్చని నీటిలో కలిపి పేస్ట్ లా చేసి జుట్టుకు పట్టించాలి. 30-40 నిమిషాలు అలాగే ఉంచండి. దీని తర్వాత గోరువెచ్చని నీటితో జుట్టును వాష్ చేయండి. మీరు ఈ ప్రక్రియను వారానికి ఒకటి లేదా రెండుసార్లు చేయవచ్చు.దీని వల్ల జుట్టు రాలకుండా ఉంటుంది. అంతే కాకుండా బాగా పెరుగుతుంది కూడా.

Related News

Broccoli Benefits: బ్రోకలీ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Weight Loss: ఈ యోగాసనాలతో.. 10 రోజుల్లోనే వెయిట్ లాస్

Sugar: చక్కెర తినడం 30 రోజులు ఆపేస్తే.. ఏం జరుగుతుందో తెలుసా ?

Hair Care Tips: వర్షంలో జుట్టు తడిస్తే..… వెంటనే ఇలా చేయండి?

Paneer Effects: దే…వుడా.. పన్నీరు తింటే ప్రమాదమా?

Hair Growth Tips: ఈ టిప్స్ పాటిస్తే.. వారం రోజుల్లోనే ఒత్తైన జుట్టు !

Big Stories

×