Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఎన్నో చిత్రాలలో హీరోయిన్ గా నటించిన ఇప్పుడు కొత్తగా నిర్మాతగా మారి, శుభం మూవీతో మన ముందుకు రానుంది. ఆమె స్వయంగా ట్రాలాల మూవింగ్ పిక్చర్స్ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించి ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ప్రమోషన్స్ని మూవీ టీం పాల్గొంటుంది. తాజాగా అందులో భాగంగా సమంత ఓ ఇంట్రెస్టింగ్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
సమంతకి పూర్తిగా ప్రొడ్యూసర్ గా మారిపోయారు ..
మూవీ ప్రమోషన్స్ లో భాగంగా సమంత చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. సమంత శుభం మూవీ మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది అదే రోజు సింగిల్ మూవీ తో శ్రీ విష్ణు ప్రేక్షకులను పలకరించనున్నాడు అందులో భాగంగా శ్రీ విష్ణు తో కలిసి వెన్నెల కిషోర్ మూవీలో ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. సమంత తన మూవీ ప్రమోషన్స్ కోసం వెన్నెల కిషోర్ కి కాల్ చేస్తుంది. వెన్నెల కిషోర్ సమంత ను చూసి తన మూవీ సింగిల్ ను చూడమని ఆమెని అడుగుతాడు. సమంతా వెన్నెల కిషోర్ మాటని పట్టించుకోకుండా తను చెప్పాలనుకున్నది మాత్రమే చెప్తుంది. వెన్నెల కిషోర్ మాట్లాడింది వినదు ఇప్పుడు ఈ వీడియో నెట్టింటి వైరల్ అవుతుంది. సమంతా వెన్నెల కిషోర్ తో వీడియో కాల్ లో మాట్లాడుతుంది. మా మూవీ శుభం మే 9న రిలీజ్ అవుతుంది. నువ్వు తప్పకుండా ఫ్యామిలీని తీసుకొని రావాలి అని అంటుంది. అదే రోజు మా సింగిల్ మూవీ కూడా ఉంది అని వెన్నెల కిషోర్ చెప్పడానికి ట్రై చేస్తుంటాడు. కానీ సమంత వినిపించుకోకుండా మా సినిమా చాలా బాగా వచ్చింది. మీరు చెప్పకుండా చూడండి అని ఫోన్ పెట్టేస్తుంది. వెన్నెల కిషోర్ కి మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వదు. ఈ వీడియో చూసిన వారంతా నిర్మాతగా సమంత పూర్తిగా మారిపోయారు అని, ప్రొడ్యూసర్ నీళ్లు బాగా వంటపడ్డాయి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఒకే రోజు రెండు సినిమాలు రిలీజ్ ..
సమంత నిర్మాతగా చేస్తున్న మొదటి సినిమా శుభం. ఇప్పటికే సమంత హీరోయిన్ గా తనంటే ఏంటో నిరూపించుకున్నారు. ఇప్పుడు మరో ప్రయత్నంగా ప్రొడ్యూసర్ గా మారి కొత్త నటీనటులతో, శుభం మూవీని నిర్మించారు.ఈ చిత్రంలో హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పేరి, శ్రియ కొంతం, శ్రావణి లక్ష్మి ప్రధాన పాత్రలో నటించారు. ఈ మూవీకి క్వింటన్ సిరోజే సంగీతాన్ని అందించారు. ఈ మూవీ తో పాటు సింగిల్ మూవీ కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఫ్యామిలీ యూత్ ఫుల్ అంశాలతో కామెడీ ఎంటర్ గా రానుంది. ఈ చిత్రంలో సమంత ఒక ప్రత్యేకమైన పాత్రలో నటిస్తోంది.రెండు సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి మే 9న రానున్నాయి.
Jayasudha: పాత్రలు నచ్చకపోయినా యాక్ట్ చేశా… పాత రోజులు గుర్తుతెచ్చుకున్న జయసుధ