ALP Recruitment: నిరుద్యోగ అభ్యర్థులు ఎప్పటి నుంచో వేచి చూస్తున్న అసిస్టెంట్ లోకోపైలెట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చిన విషయం తెలిసిందే. అప్లికేషన్ ప్రక్రియ కూడా నేటి నుంచి ప్రారంభమైంది. రైల్వే ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు అయితే సువర్ణవకాశం అనే చెప్పాలి. రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు భారీగా అసిస్టెంట్ లోకోపైలెట్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఓసారి నోటిఫికేషన్ వివరాలను సవివరంగా తెలుసుకుందాం.
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB)-2025 ద్వారా 9970 అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియకు త్వరలోనే డేట్స్ వెల్లడించనున్నారు.
మొత్తం పోస్టుల సంఖ్య: 9970
రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డులో అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలను భర్తీ చేస్తుంది. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు.. డేట్స్ ప్రకటించిన తర్వాత దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు ప్రక్రియకు ప్రారంభ తేది: 2025 ఏప్రిల్ 10 (నేటి నుంచి స్టార్ట్ షురూ అయ్యింది)
దరఖాస్తు ప్రక్రియకు చివరి తేది: 2025 మే 11
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.500 ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులు, ఈబీసీ అభ్యర్థులు రూ.250 చెల్లించాల్సి ఉంటుంది. ఆన్ లైన్ లో పేమెంట్ చేయాల్సి ఉంటుంది.
విద్యార్హత: టెన్త్, ఐటీఐ, డిప్లొమా, ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాసై ఉండాలి. ఎలాంటి ఎక్స్ పీరియన్స్ అవసరం లేదు.
వయస్సు: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 18 నుంచి 33 ఏళ్ల మధ్య వయస్సు కలిగి ఉండాలి. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులు మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులు, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.
ఉద్యోగ ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్ డ్ టెస్ట్ ల ద్వారా ఉద్యోగానికి ఎంపిక చేస్తారు.
జీతం: ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు అన్ని అలవెన్సులు కలుపుకుని రూ.50,000 పైనే ఉండొచ్చు. ఈ ఉద్యోగం లో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి భవిష్యత్తు ఉంటుంది.
నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను చూడొచ్చు.
అఫీషియల్ వెబ్ సైట్: https://indianrailways.gov.in/
అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. మంచి వేతనం కూడా కల్పించనున్నారు. గత కొన్నేళ్ల నుంచి రైల్వే పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. దరఖాస్తు ప్రక్రియ డేట్స్ ప్రారంభించిన వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. ప్లాన్ ప్రకారం ఇప్పటినుంచే ప్రిపరేషన్ మొదలుపెట్టండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.
Also Read: FSNL Recruitment: ఏదైనా డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు.. ఈ జాబ్ వస్తే నెలకు రూ.2,20,000 జీతం
ముఖ్య సమాచారం:
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 9970
దరఖాస్తుకు చివరి తేది: మే 11
Also Read: Court Jobs: నిరుద్యోగులకు భారీ గుడ్‌న్యూస్.. ఏపీలో 1620 ఉద్యోగాలకు నోటిఫికేషన్..
Also Read: GMC Recruitment: ఆ జిల్లాలో భారీగా జాబ్స్.. పది పాసైతే చాలు, జీతం రూ.22,750