Chimney: పొయ్యి లేదా వుడ్ స్టవ్ ఉన్న ఇళ్లలో చిమ్నీ శుభ్రత చాల కీలకం. ఇది సరిగ్గా పనిచేయాలంటే మసి, పొగ మసి పేరుకోకుండా చూసుకోవాలి. లేకపోతే మంటలు, గాలి ఆడకపోవడం వంటి సమస్యలు రావచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే, దీన్ని క్లీన్ చేయడం ఎలా అనేది చాలా మందికి తెలియదు. అసలు చిమ్నీని ఇంట్లో శుభ్రం చేసుకునే సులభమైన టిప్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఎందుకు క్లీన్ చేయాలంటే?
చిమ్నీలో కాలక్రమేణా మసి, పొగమాసి, శిధిలాలు చేరి గాలి ఆడకుండా అడ్డుకుని మంటల ప్రమాదాన్ని పెంచుతాయి. చిమ్నీ శుభ్రం చేయకపోతే మంటలు చెలరేగే అవకాశం ఎక్కువనని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఏడాదికి ఒకసారైనా చిమ్నీని తనిఖీ చేసి శుభ్రం చేసుకోవడం చాలా ముఖ్యమని నేషనల్ ఫైర్ ప్రొటెక్షన్ అసోసియేషన్ సూచిస్తోంది.
ఎలా శుభ్రం చేయాలి?
సరైన సామగ్రి, చిన్న చిన్న జాగ్రత్తలతో చిమ్నీని ఇంట్లోనే శుభ్రం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఎత్తులో పనిచేయడం ఇష్టం లేకపోతే లేదా చిమ్నీలో సమస్యలు ఉన్నాయనే అనుమానం ఉంటే నిపుణులను పంప్రదించడం మంచిది. ఇంట్లోనే చిమ్నీని క్లీన్ చేయడానికి ఏం కావాలంటే..
చిమ్నీ బ్రష్, చిమ్నీ సైజుకు సరిపడా రాడ్లు, డస్ట్ మాస్క్, సేఫ్టీ గాగుల్స్, వర్క్ గ్లోవ్స్, డ్రాప్ క్లాత్‌లు లేదా టార్ప్‌లు, ఫ్లాష్‌లైట్, షాప్ వాక్యూమ్ నిచ్చెన (కప్పు మీద నుంచి శుభ్రం చేస్తే), శిధిలాల కోసం బకెట్.
క్లీన్ చేయండిలా..
పొయ్యి చుట్టూ నేల, ఫర్నిచర్ ను కాపాడేందుకు డ్రాప్ క్లాత్‌లు వేయండి. పొయ్యి తలుపును ప్లాస్టిక్ షీట్, టేప్ తో మూసేయండి. మాస్క్, గాగుల్స్, గ్లోవ్స్ వేసుకోండి.
ఫ్లాష్‌లైట్‌తో చిమ్నీలో పక్షి గూళ్లు, ఎక్కువ మసి ఉన్నాయేమో చుడండి. అది బాగా దెబ్బతిన్నట్టు అనిపిస్తే నిపుణిడిని సంప్రదించండి.
కప్పు మీద నుంచి (టాప్ – డౌన్) లేదా పొయ్యి నుంచి (బాటమ్-అప్) చేయాలా అనేది నిర్ణయించుకోండి. టాప్ – డౌన్ పధ్ధతి శుభ్రంగా ఉంటుంది, కానీ నిచ్చెన జాగ్రత్తలు తీసుకోండి.
చిమ్నీ బ్రష్ ను రాడ్ కు అతికించి, చిమ్నీలోకి పెట్టి పైకి – కిందకి కదిలించండి. అవసరమైతే రాడ్ లు జోడించి, మొత్తం చిమ్నీ శుభ్రమయ్యేలా చుడండి.
షాప్ వాక్యూమ్ తో పొయ్యిలో లేదా చిమ్నీ దిగువన పడిన మసిని తీసేయండి. పొగమసి మండే స్వభావం కలిగినది కాబట్టి జాగ్రత్తగా పారవేయండి.
మళ్లీ ఫ్లాష్‌లైట్‌తో చూసి, అన్నీ శుభ్రంగా ఉన్నాయా అనే విషయాన్ని నిర్ధారించుకోండి. ఒకవేళ మసి లేదా దెబ్బతిన్న భాగాలు కనిపిస్తే నిపుణుడిని పిలవండి.
చిట్కాలు:
శుభ్రం చేయడానికి 24 గంటల ముందు మంటలు ఆర్పేసి చిమ్నీ చల్లబడేలా చుడండి. కప్పు మీద పనిచేసినప్పుడు గట్టి నిచ్చెన వాడండి, సహాయం తీసుకోండి.
తేమ తక్కువ ఉన్న పొడి కట్టెలను వాడండి. తడి కట్టెలు ఎక్కువ మసిని ఉత్పత్తి చేస్తాయి.
తరచూ పొయ్యి వాడితే, 1/8 ఇంచ్ మసి పేరుకుంటే వెంటనే శుభ్రం చేయండి.
నిపుణిడిని ఎప్పుడు పిలవాలి?
1/4 ఇంచ్ కంటే ఎక్కువ మసి పేరుకుంటే పగిలిన ఫ్లూ టైల్స్, దెబ్బతిన్న మోర్టార్, జంతువుల గూళ్లు, పెద్ద అడ్డంకులు, చిమ్నీ మంటల వంటి సంకేతాలు కనిపిస్తే నిపుణులు రోటరీ బ్రష్ లు, ఇండస్ట్రియల్ వాక్యూమ్‌లతో సురక్షితంగా పనిచేస్తారు.