E-Paper
Advertisement

Samantha: సంపాదించింది మొత్తం అందుకు ఖర్చు పెడుతున్న సామ్.. రిస్క్ తట్టుకుంటుందా.. ?

Samantha: సంపాదించింది మొత్తం అందుకు ఖర్చు పెడుతున్న సామ్.. రిస్క్ తట్టుకుంటుందా.. ?
Advertisement

Samantha: ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యాక.. ఎవరైనా తమ స్థాయిని పెంచుకోవాలనే చూస్తారు. నటీనటులు.. డైరెక్టర్స్ గా మారతారు.. నిర్మాతలుగా కూడా మారతారు. అదేంటీ.. హీరోలుగా, హీరోయిన్లుగా బాగానే సంపాదిస్తున్నారు కదా.. ఇప్పుడు ఈ కొత్త అవతారాలు ఎందుకో అనే అనుమానం రావచ్చు. తమను ఒక నిర్మాత నమ్మి ఈ స్థాయికి తీసుకొచ్చినప్పుడు.. వేరొకరికి అలాంటి అవకాశాలు ఇవ్వడంలో తప్పు లేదు అనుకునేవారు కొంతమంది అయితే.. కొత్త కథలను ఎంకరేజ్ చేయడానికి ప్రొడక్షన్ హౌస్ లను స్థాపించేవారు మరికొందరు.

అలా ఇండస్ట్రీలోని చాలామంది నటీనటులు తమ స్థాయిని పెంచుకుంటూ వెళ్తున్నారు. అందులో హీరోయిన్స్ కూడా తక్కువేమి కాదు. వారు కూడా నిర్మాతలుగా మారుతున్నారు. అప్పట్లో సావిత్రి దగ్గరనుంచి ఇప్పుడు సంయుక్త మీనన్ వరకు నిర్మాతలుగా మారిన హీరోయిన్స్ చాలామందే ఉన్నారు. ఈ లిస్ట్ లో స్టార్ హీరోయిన్ సమంత కూడా ఉంది. ఏంటి సామ్ . . నిర్మాతగా మారిందా.. ? అంటే అవును. సామ్ ఒక ప్రొడక్షన్ హౌస్ ను అనౌన్స్ చేసింది. అదే.. ట్రాలల మూవింగ్ పిక్చర్స్ బ్యానర్.

Advertisement

Kanguva: కంగువ.. అది ప్లస్ అవుతుందా.. ? మైనస్ అవుతుందా..?

ఇక ఈ బ్యానర్ లో ఆమె మొదటి సినిమా ‘మా ఇంటి బంగారం’.. ఈ ఏడాది సంక్రాంతికి సామ్ ఈ సినిమా పోస్టర్ ను రిలీజ్ చేసి ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలిపింది. అప్పటినుంచి ఇప్పటివరకు ఈ సినిమా గురించిన ఏ వార్తను ఆమె రివీల్ చేయలేదు. హీరో ఎవరు.. ? డైరెక్టర్ ఎవరు.. ? అనే విషయం చెప్పింది లేదు. అయితే ఇదొక ఫీమేల్ సెంట్రిక్ మూవీ అని తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లడానికి ప్రయత్నాలు సాగిస్తుందని సమాచారం.

Advertisement

ఇక ప్రొడక్షన్ హౌస్ అంటే.. తాము నటించే సినిమాలు మాత్రమే కాకుండా మిగతావారిని కూడా ఎంకరేజ్ చేసేలా ఉండాలి. ఇప్పుడు సామ్ కూడా అదే చేస్తోంది. తన ప్రొడక్షన్ లో మరో సినిమాను నిర్మించడానికి రంగం సిద్ధం చేసినట్లు టాక్ నడుస్తోంది. కమెడియన్ గా కెరీర్ ను మొదలుపెట్టి.. హీరోగా మారాడు ప్రియదర్శి. బలగం మంచి హిట్ అందుకోవడంతో కామెడీ పాత్రలను పక్కన పెట్టి చిన్న హీరోల లిస్ట్ లోకి చేరిపోయాడు. ఈ మధ్యనే 35 చిన్న కథ కాదు సినిమాలో ప్రియదర్శి నటనకు మంచి ప్రశంసలే దక్కాయి. ఇక ఈ సినిమాకు సామ్ కూడా ఫిదా అయ్యిందంట.

Puri Jagannath: పూరీ చేతికి చిక్కిన ఆ కుర్ర హీరో ఎవరబ్బా..?

ఇక ప్రియదర్శితో ఒక సినిమా చేయడానికి సామ్ సిద్ధమయ్యిందని సమాచారం. అంటే జంటగా కాదులెండి.. తన బ్యానర్ లో ప్రియదర్శితో సామ్ ఒక సినిమా ప్లాన్ చేసిందట. కథ కూడా నచ్చడంతో ఈ కుర్ర హీరో కూడా ఓకే అన్నాడట. త్వరలోనే మేకర్స్ అధికారికంగా ఈ చిత్రాన్ని ప్రకటించనున్నారు. అంతే కాకుండా.. మంచి కథ దొరికితే.. అమ్మడు తాను సంపాదించింది మొత్తం ఖర్చు పెట్టడానికి వెనుకాడబోవడం లేదట. దీంతో కొత్త డైరెక్టర్స్ అందరూ.. సామ్ ను మెప్పించే కథలను రాయటానికి ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది.

మరి హీరోయిన్ గా తనకంటూ ఒక ఇమేజ్ ను సంపాదించుకున్న ఈ చిన్నది నిర్మాతగా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.  ఇక సామ్ కెరీర్ విషయానికొస్తే.. ప్రస్తుతం ఆమె సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో బిజీగా మారింది. అమెజాన్ ప్రైమ్ లో ఈ సిరీస్ నవంబర్ నుంచి స్ట్రీమింగ్ కానుంది. మరి ఈ సిరీస్ తో సామ్ ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×