E-Paper
Advertisement

Samantha: సెలబ్రిటీగా ఉండడం అప్పుడు నరకం అనిపించింది..ఆ ఘటనను మరువలేను..!

Samantha: సెలబ్రిటీగా ఉండడం అప్పుడు నరకం అనిపించింది..ఆ ఘటనను మరువలేను..!
Advertisement

Samantha:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు సొంతం చేసుకున్న సమంతా (Samantha ) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.. ఒకప్పుడు వరుస సినిమాలతో బిజీ హీరోయిన్ గా మారిన సమంత స్టార్ హీరోల అందరికీ జోడిగా నటించి అలరించింది. కెరియర్ పీక్స్ లో ఉండగానే నాగచైతన్య (Naga Chaitanya)ను ప్రేమించి, పెళ్లి చేసుకున్న ఈమె కొన్నాళ్లు ఇండస్ట్రీకి దూరమైంది. ఆ తర్వాత భర్తతో కలిసి కొన్ని సినిమాలు చేసింది. ఇక క్యూట్ జోడీగా, ఆదర్శ దంపతులుగా నిలిచిన వీరు అనూహ్యంగా విడాకులు తీసుకొని వేరుపడ్డారు. విడాకుల తర్వాత సమంత ఎంతో నరకం అనుభవించిందనే చెప్పాలి. చాలామంది ఈమె క్యారెక్టర్ ను నెగిటివ్ చేస్తూ పలు రకాల కామెంట్లు చేశారు. అంతేకాకుండా ‘మయోసైటిస్’ అనే వ్యాధి బారినపడి, ఈ వ్యాధి నుండి బయటపడడానికి ఏకంగా ఏడాది పాటు ఇండస్ట్రీకి కూడా దూరం అయింది సమంత.

రెట్టింపు వేగంతో సమంత కం బ్యాక్..

Advertisement

అవమానాలు, హేళనలు, నిందలు అన్నింటిని ఎదుర్కొని, ఇప్పుడు రెట్టింపు వేగంతో మళ్ళీ ఇండస్ట్రీలోకి వచ్చింది. అందులో భాగంగానే ఒకవైపు బాలీవుడ్ లో వరుస వెబ్ సీరీస్లలో నటిస్తూ.. అక్కడ తన యాక్షన్ పర్ఫామెన్స్ తో అవార్డులు సైతం సొంతం చేసుకుంటున్న ఈమె, ఇక్కడ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ ను స్థాపించి ‘శుభం’ అనే సినిమాతో మరో ఊహించని విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. మొత్తానికైతే హీరోయిన్ గానే కాకుండా నిర్మాతగా కూడా సక్సెస్ అయ్యింది సమంత. నాడు సమంతను హేళన చేసిన వారే నేడు సమంత విజయాన్ని చూసి కుళ్ళుకుంటున్నారని అభిమానులు సైతం కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమా సక్సెస్ జోష్ లో ఉన్న సమంత తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని సెలబ్రిటీగా ఉండడం ఆ సమయంలో అత్యంత కష్టంగా అనిపించింది అంటూ తెలిపింది.

సెలబ్రిటీగా ఉండడం అంత సులభం కాదు – సమంత

Advertisement

తాజా ఇంటర్వ్యూలో సమంత మాట్లాడుతూ.. “అభిమానులు నా దగ్గరికి ఫోటోలు తీయడానికి వచ్చినప్పుడు ఎప్పుడూ కూడా నేను నో చెప్పలేదు. చెన్నైలో ఒకసారి మా నాన్న అంత్యక్రియలకు హాజరయ్యేందుకు వెళ్తున్న సమయంలోనే కొంతమంది అభిమానులు ఫోటో తీయడానికి నా దగ్గరకు వచ్చారు. అయినా నేను వారికి నో చెప్పలేదు. ఎందుకంటే నా విజయానికి కారణం నా అభిమానులు. మనం సెలబ్రిటీలు.. ఎలాంటి బాధలు అనుభవిస్తున్నామో వారికి తెలియకపోవచ్చు. అందుకే నేను ఎప్పుడూ అభిమానుల ఫోటోలకు నో చెప్పను. అయితే మా నాన్న చనిపోయిన విషయంలో నేను కృంగిపోతున్నప్పుడు కూడా నేను ఒక సెలబ్రిటీని అనే విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ సంఘటన నన్ను ఒక సెలబ్రిటీగా ఉండటంలో ఎదురయ్యే ఇబ్బందుల గురించి ఆలోచించేలా చేసిందని” సమంత తెలిపింది.

నాన్న అంత్యక్రియలకు.. నవ్వుతూ ఫోటోలకు ఫోజులిచ్చా..

ఇకపోతే ఆరోజు తన జీవితంలో జరిగిన సంఘటన గురించి గుర్తు చేసుకుంటూ.. డిసెంబర్ లో నాన్న మరణించారని నా తల్లి నుంచి ఉదయం నాకు ఫోన్ వచ్చింది. వెంటనే నేను ముంబై నుంచి చెన్నైకి విమానంలో ప్రయాణించాల్సి వచ్చింది. వాస్తవానికి ఈ సంఘటనకి కొంతకాలం ముందు మా నాన్న నాతో మాట్లాడకపోవడంతో నేను మరింత షాక్ కి గురయ్యాను. నాలో ఎలాంటి స్పందన లేకుండా విమానంలో కూర్చున్నాను. అయితే ఆ సమయంలో నా విషయం తెలియని కొంతమంది నాతో ఫోటో కోసం అడిగారు. ఇక నేను నిలబడి వారితో నవ్వుతూ ఫోటోలకు ఫోజులిచ్చాను “అంటూ సమంత తెలిపింది. మనం ఏ స్థితిలో ఉన్నామో అభిమానులకు తెలియదు. తెలియని వారితో ఫోటో అడగడానికి కూడా ధైర్యం అవసరం.. అందుకే నో చెప్పి వారిని బాధపెట్టాలని అనుకోలేదు అంటూ సమంత తెలిపింది.

ALSO READ:V.V.Vinayak: అఖిల్ తో మూవీ.. ఆ బాధ ఇప్పటికీ వెంటాడుతోంది – వినాయక్!

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×