E-Paper
Advertisement

Samantha New Movie Update: సమంత ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. షూటింగ్ పూర్తయింది..

Samantha New Movie Update: సమంత ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. షూటింగ్ పూర్తయింది..
Advertisement

Samantha – Varun Dhawan Web Series Update: టాలీవుడ్ ఇండస్ట్రీలోని టాలెంటెడ్ హీరోయిన్లలో నటి సమంత ఒకరు. ఎన్నో ఏళ్ల నుంచి స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతున్న ఈ బ్యూటీకి తెలుగులోనే కాకుండా.. దేశ వ్యాప్తంగా అన్ని భాషల్లోనూ ఫ్యాన్స్ ఉన్నారు. ఇటీవల ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ ద్వారా హిందీలో కూడా తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ బేస్‌ను ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఈ మధ్య తన ఆరోగ్య సమస్యల కారణంగా సినిమాలకు కొన్ని రోజులు బ్రేక్ ఇచ్చారు.

ఆ తర్వాత మళ్లీ చకచకా.. యశోద, శాకుంతలం, ఖుషి సినిమాలతో తమ ప్రేక్షకులను అలరించారు. ఆపై మళ్లీ కొద్ది రోజులు విశ్రాంతికి కేటాయించి.. వెకేషన్‌లో ఎంజాయ్ చేశారు. దీంతో సమంత మళ్లీ ఎప్పుడు మీడియా ముందర కనిపిస్తుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో సమంత షేర్ చేసిన ఓ పోస్ట్ వారిలో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది.

Advertisement

బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్, సమంత జంటగా ‘సిటాడెల్’ వెబ్ సిరీస్ చేస్తున్న సంగతి తెలిసిందే. రాజ్ అండ్ డీకే ఈ సిరీస్‌కు దర్శకత్వం వహిస్తున్నారు. హాలీవుడ్‌లో ప్రియాంక చోప్రా చేసిన ‘సిటాడెల్’కి రీమేక్‌గా ఇండియన్ వెర్షన్‌లో రూపొందుతోంది. దాదాపు 2 ఏళ్ల కిందట ప్రారంభమైన ఈ సిరీస్.. తాజాగా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజాగా ఉంది.

ఈ నేపథ్యంలో ఈ సిరీస్‌కు సంబంధించిన అప్డేట్‌ను సమంత తాజాగా అందించారు. ఈ సిరీస్‌లో తన పాత్రకు ఆమె డబ్బింగ్ మొదలు పెట్టినట్టు తెలిపారు. ఈ మేరకు స్టూడియోలో ఉన్న ఫొటోలను ఇన్‌స్టా వేదికగా షేర్ చేశారు. ఈ విషయం తెలిసి ఆమె అభిమానులు సమంత మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×