BigTV English
Advertisement

Pushpa 2 The Rule: ‘పుష్ప2’ షూటింగ్ నుంచి బన్నీ పిక్స్ లీక్.. చీర కట్టులో ఏమున్నాడురా బాబు!

Pushpa 2 The Rule: ‘పుష్ప2’ షూటింగ్ నుంచి బన్నీ పిక్స్ లీక్.. చీర కట్టులో ఏమున్నాడురా బాబు!

Allu Arjun Saree Pic Leaked from Pushpa 2 The Rule: ఐకాన్ అల్లు అర్జున్ హీరోగా లెక్కల మాస్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న అత్యంత భారీ బడ్జెట్ చిత్రం ‘పుష్ప2’. ఈ మూవీ ఫస్ట్ పార్ట్ ప్రపంచ వ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ మూవీ ఘన విజయంతో సీక్వెల్‌పై ప్రేక్షకాభిమానుల్లో అంచనాలు పెరిగిపోయాయి. వారి అంచనాలకు తగ్గట్టుగా ఎక్కడా తగ్గేదే లే అన్నట్లుగా సినిమాను చిత్రీకరిస్తున్నారు. షూటింగ్ లేట్ అయినా సినిమా ఓ రేంజ్‌లో ఉండే విధంగా సుకుమార్ ప్లాన్ చేసుకుంటున్నాడు.


ఈ మూవీ కోసం వరల్డ్ వైడ్‌గా ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికీ భారీ అంచనాలున్న ఈ మూవీ నుంచి ఇటీవల గ్లింప్స్ రిలీజ్ చేసి ఆ అంచనాలను మరింత రెట్టింపు చేశారు. అంతేకాకుండా ఈ మధ్య ఈ సినిమా నుంచి లీక్స్ కూడా దర్శనం ఇస్తూ.. ఫ్యాన్స్‌కు ఓ రకమైన పూనకాలు తెప్పించాయి.

ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇందులో భాగంగా హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. ఈ షెడ్యూల్‌లో కీలకమైన యాక్షన్ సన్నివేశాల్ని మేకర్స్ తెరకెక్కిస్తున్నారు. ఇందులో ముఖ్యంగా గంగమ్మ జాతర సీన్స్‌ను షూట్ చేస్తున్నారట. ఈ క్రమంలో తాజాగా ఈ షూటింగ్‌ నుంచి అల్లు అర్జున్ ఫోటో లీకై సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది.


ఆ ఫొటోలో బన్నీ చీర కట్టుకుని కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అయితే ఆ ఫొటో ప్రకారం.. ఈ మూవీలో బన్నీ గంగమ్మ జాతర సమయంలో గంగమ్మ తల్లిగా అవతారమెత్తనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటో వైరల్ కావడంతో.. అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×