Subham Trailer: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) మొదటిసారి నిర్మాతగా మారిన విషయం తెలిసిందే. ‘ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్’ బ్యానర్ పై తాజాగా ‘శుభం’ అనే సినిమాను విడుదల చేస్తున్నారు. ఇక ఇటీవలే ఈ సినిమా నుంచి టీజర్ విడుదల చేయగా మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇక ఇప్పుడు ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, శాలిని కొండేపూడి, శ్రీయ కొణతం తదితరులు కీలక పాత్రలు పోషించారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో హార్రర్ కామెడీ సినిమాగా ఈ సినిమా రూపుదిద్దుకుంటుంది.
ట్రైలర్ లో ఏముందంటే..?
ఇక ట్రైలర్ స్టార్ట్ అవ్వగానే ముగ్గురు వ్యక్తులు.. పెళ్లయిన తర్వాత తమ భార్యలతో ఎలా ప్రవర్తించాలి..? కాఫీ ఎలా అడగాలి..? అని డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. కట్ చేస్తే, కొత్తగా పెళ్లయిన వ్యక్తి శోభనం ప్రారంభం అవుతుంది. మొదలు పెడదామా అని పెళ్లి కొడుకు అంటే.. నాకు సిగ్గుగా వుంది.. 9 వరకు ఆగాలి అంటూ పెళ్లికూతురు చెబుతుంది. ఇక దాంతో ఏదో ఊహించుకున్న వరుడు కళ్ళు మూసుకొని ఇంకా తొమ్మిది కాలేదా అంటూ చిలిపిగా అడగగా.. కట్ చేస్తే పెళ్లికూతురు టీవీ సీరియల్ కి అతుక్కుపోతుంది. ఇక ఆమెతో ఈ టైంలో సీరియల్ ఏంటి అంటూ గొడవ పడతాడు. వెంటనే పెళ్లికూతురు సీరియస్ అయిపోయి గోల గోల చేసేస్తుంది. ఒక తన భార్య మాత్రమే సీరియల్స్ చూస్తూ గొడవ పెట్టుకుంటుందేమో అని అతడు అనుకుంటాడు. కానీ ఆ ఊర్లో మహిళలంతా కూడా రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే సీరియల్ కి అతుక్కుపోతూ ఉంటారు. అలా చూస్తూ చూస్తూ అందరూ దెయ్యాల్లా మారిపోతారు. ఇక ఆ ఊర్లో మగాళ్ళకి సొంత ఇంట్లోనే రక్షణ కరువుతున్న సమయంలో వారిని కాపాడడానికి ఒక మాటగా సమంత కనిపిస్తుంది.
శుభం ట్రైలర్ లో సడన్ ట్విస్ట్ ఇచ్చిన సమంత..
ఒక మాతగా మారిన సమంత మగవారిని ఎలా రక్షిస్తుంది..? అసలు మహిళలు ఎందుకు అలా వింతగా ప్రవర్తిస్తున్నారు..? అనే పాయింట్ తోనే ట్రైలర్ ను చూపించారు. ఇక సమంత ఇందులో డిఫరెంట్ రోల్ లో దెయ్యాలను వదిలించే మాతగా కనిపించడం.. భర్తలందరూ తమ భార్యలు దెయ్యాలుగా మారడాన్ని తట్టుకోలేక ఆవిడ దగ్గరకు వెళ్లి ఇప్పుడు ఏం జరగబోతోంది..? మేమంతా చచ్చిపోతామా..? అంటూ ప్రశ్నించడం సమంతా సైగలతోనే ఎక్స్ప్రెషన్స్ పెట్టడం అన్నీ కూడా సినిమాపై ఆసక్తిని పెంచాయి. పెద్దగా క్యాస్టింగ్ లేకుండా అందరూ కొత్త వాళ్ళతో తెరకెక్కిన ఈ కామెడీ హార్రర్ ఎంటర్టైనర్ ప్రేక్షకులను కచ్చితంగా ఆకట్టుకుంటుంది అని అయితే చెప్పవచ్చు. ఇక ఈ చిత్రానికి రాజ్ నిడుమోరు క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా పని చేస్తున్నారు. ఈ సినిమా హిట్ అయితే కచ్చితంగా నిర్మాతగా సమంత గాడిలో పడుతుందని చెప్పడంలో సందేహం లేదు.
ALSO READ:Maheshbabu: మహేష్ బాబు రూ.5.9 కోట్ల స్కాం… నేడే విచారణ… అరెస్ట్ కూడా…?