Maheshbabu:సూపర్ స్టార్ మహేష్ బాబు (Maheshbabu)కి ఈడీ అధికారులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ విషయం మొన్న ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. సాయి సూర్య డెవలపర్స్ , సూరానా గ్రూప్ ఆఫ్ కంపెనీల మనీ లాండరింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. బషీర్ బాగ్ లోని తమ ఆఫీసులో నేడు విచారణకు హాజరు కావాలని మహేష్ బాబుకు నోటీసులు ఇచ్చారు అధికారులు. ఇకపోతే సాయి సూర్య డెవలపర్స్ కంపెనీ.. మహేష్ బాబుకు రూ.5.9 కోట్లు చెల్లించినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. చెక్కుల రూపంలో రూ.3.4 కోట్లు.. నగదు రూపంలో రూ.2.5 కోట్లు చెల్లించినట్లు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలోనే ఈడీ విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు ఇవ్వగా.. మరి విచారణకు మహేష్ బాబు వస్తారా? రారా? అన్నది సస్పెన్స్ గా మారింది.
ప్రమోషన్ తో అడ్డంగా ఇరుక్కున్న మహేష్ బాబు..
ఇకపోతే తెలంగాణ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడి అధికారులు ఈ కేసును నమోదు చేశారు.ముఖ్యంగా సాయి సూర్య డెవలపర్స్ యజమాని కే.సతీష్ చంద్రగుప్త, సురానా గ్రూప్ డైరెక్టర్ నరేంద్ర సురానా తదితరులు కొనుగోలుదారులను మోసగించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అనుమతి లేని లేఅవుట్లలో ఫ్లాట్లు విక్రయించడం, ఒకే ఫ్లాట్ ను పలువురికి అమ్మడం, తప్పుడు రిజిస్ట్రేషన్ హామీలు ఇవ్వడం వంటి మోసాలకు పాల్పడ్డారని వారిపై అభియోగాలున్న నేపథ్యంలోనే ఇలా అధికారులు సోదాలు నిర్వహించగా.. ఈ సాయి సూర్య డెవలపర్స్ కంపెనీ పై అధికారులు ఐటీ సోదాలు నిర్వహించారు. ఇక ఈ రియల్ ఎస్టేట్ బ్రాండ్ ను మహేష్ బాబు ప్రమోట్ చేశారు. అందులో భాగంగానే రూ.5.9 కోట్లు ఆయనకు రెమ్యూనరేషన్ గా ఇచ్చినట్లు సమాచారం.
మహేష్ బాబు సినిమాలు..
మహేష్ బాబు సినిమా విషయానికి వస్తే.. మహేష్ బాబు తెలుగులో స్టార్ హీరోగా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు. ఇక ఇప్పుడు రాజమౌళి దర్శకత్వంలో ఎస్ఎస్ఎమ్బీ29 అనే సినిమాలో నటిస్తున్నారు. భారీ అంచనాల మధ్య పాన్ వరల్డ్ మూవీగా ఈ సినిమా రాబోతోంది. ఇందులో గ్లోబల్ స్టార్ గా పేరు సొంతం చేసుకున్న ప్రియాంక చోప్రా (Priyanka Chopra) హీరోయిన్ గా నటిస్తోంది. అంతేకాదు మాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న పృథ్వీ రాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) విలన్ గా నటిస్తున్నారు. ఇకపోతే ఇందులో ఈయన మెయిన్ విలన్ కాదని , ఒక నల్ల జాతీయుడిని మెయిన్ విలన్ గా తీసుకురాబోతున్నట్లు సమాచారం. రాజమౌళి ఈ సినిమాను చాలా పగడ్బందీగా ప్లాన్ చేస్తూ ఆస్కార్ దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గానే మారుతున్నాయి.
ఈ రోజు ఈడీ విచారణకు మహేశ్ బాబు..?
సాయిసూర్య డెవలపర్స్, సురానా గ్రూప్ ఆఫ్ కంపెనీల మానీలాండరింగ్ కేసులో కీలక పరిణామం
బషీర్‌బాగ్‌లోని తమ ఆఫీసులో నేడు విచారణకు హాజరు కావాలని మహేశ్‌కు నోటీసులు
సాయిసూర్య డెవలపర్స్ కంపెనీ నుంచి మహేశ్‌కు రూ.5.9 కోట్లు చెల్లించినట్లు ఈడీ అధికారుల… pic.twitter.com/6ONxKU5bFh
— BIG TV Breaking News (@bigtvtelugu) April 27, 2025